iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. హౌస్ లోకి 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు!

  • Published Sep 21, 2023 | 1:45 PM Updated Updated Sep 21, 2023 | 1:45 PM
  • Published Sep 21, 2023 | 1:45 PMUpdated Sep 21, 2023 | 1:45 PM
బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. హౌస్ లోకి 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు!

బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ నిజంగానే ఉల్టా పుల్టాగానే ఉంది. ప్రతి ఎపిసోడ్ ఆసక్తిగా మారుతోంది. కంటెస్టెంట్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ హౌస్ లో అన్ని సీజన్స్ తో పోలిస్తే కేవలం 14 మందినే ఇంట్లోకి పంపారు. నిజానికి ఈ సీజన్ లో దాదాపు 22 మంది హౌస్ లోకి వస్తారు అని చెప్పారు. కానీ, అందరికీ షాకిస్తూ కేవలం 14 మందినే హౌస్ లోకి పంపారు. అయితే ఈ సీజన్లో కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు అవి ఉంటాయి అనేదే ప్రశ్న. లీస్ట్ కేస్ లో అయినా కనీసం ఐదుగురు సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాల్సిందే. లేని పక్షంలో గేమ్ ముందుకు సాగదు.

ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా ఉంటుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలానే టాస్కులు, నిర్ణయాలు ఉల్టా పుల్టాగా తీసుకున్నారు కూడా. కంటెస్టెంట్స్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎప్పుడూ లేనిది ఈసారి పవరాస్త్రం అంటూ ఒక విధానం తీసుకొచ్చారు. ఆ అస్త్రాన్ని గెలిస్తేనే వాళ్లు హౌస్ మేట్ అవుతారు. అప్పటి వరకు కంటెస్టెంట్ లాగా మాత్రమే ఉంటారు. ఇప్పటివరకు హౌస్ లో ఆట సందీప్, శివాజీ హౌస్ మేట్లు అయ్యారు. మూడో వపరాస్త్రం కోసం ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ తలపడనున్నారు. మొదట 5 వారాలు, తర్వాత 4 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చారు. తర్వాత 3, ఆ తర్వాత 2 వారాల ఇమ్యూనిటీ ఇస్తారు. అలా మొత్తం 5 వారాలపాటు ఇలా చేస్తారు.

అప్పటికి హౌస్ లో ఐదుగురు కన్ఫామ్డ్ సభ్యులు ఉంటారు. అలాగే ఐదుగురు ఎలిమినేట్ అయి ఉంటారు. ఇంకో నలుగురు కంటెస్టెంట్స్ గా మాత్రమే ఉంటారు. మొత్తం 10 వారాల ఆట మిగిలి ఉండగా.. ఇంట్లో 9 మంది మాత్రమే ఉంటే ఆట ముందుకు సాగదు. అలాగే నో ఎలిమినేషన్ తో ఐదు వారాలు ఆటను కొనసాగిస్తే.. ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి ఉండదు. పైగా సీజన్ 6 కంటే కూడా.. ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలా కాకూడదు అంటే తప్పకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేయాలి. ఇప్పటికే బిగ్ బాస్ ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. హౌస్ లోకి సీరియల్ ఆర్టిస్ట్ అంబటి అర్జున్ వస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అతను కూడా చాలానే హింట్స్ ఇచ్చాడు. మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి.. అంటూ హింట్ ఇచ్చాడు. అలాగే యాంకర్ రవి కూడా ఆల్ ది బెస్ట్ అంటూ స్టోరీ పోస్ట్ చేశాడు. ఇవన్నీ చూసి నిజంగానే అంబటి అర్జున్ హౌస్ లోకి వెళ్తున్నట్లు ఫిక్స్ అవుతున్నారు.

ఇప్పుడు ఇంకో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ నరేశ్, పూజా మూర్తీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. నరేశ్ తాజాగా ఆస్ట్రేలియా ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాడని అతను హౌస్ లోకి రావడానికి రెడీగా ఉన్నాడు అంటున్నారు. అయితే మరి జబర్దస్త్ ని వదిలి వస్తాడా రాడా అనేది పెద్ద ప్రశ్న. పూజా పొన్నాడ గతంలోనే రావాల్సి ఉందని.. అయితే తన తండ్రి మరణించడంతో ఆమె రాలేదని చెప్పారు. ఇప్పుడు పూజా మూర్తి వైల్డ్ కార్డ్ రూపంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీళ్లు ముగ్గురి పేర్లు వైరల్ అవుతున్నాయి. అలాగే ఇంకో ఇద్దరు వైల్డ్ కార్డ్ రూపంలో రావాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా ఎప్పుడు వస్తారు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వీకెండ్ కల్లా.. అంబటి అర్జున్ కచ్చితంగా హౌస్ లోకి అడుగు పెడతాడు అంటూ లీకులు వినిపిస్తున్నాయి. మరి.. ఈ సీజన్ లో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వనున్నారు అనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom