iDreamPost
android-app
ios-app

లిక్కర్ పార్టీ వివాదంపై స్పందించిన బిగ్ బాస్ ఫేం మెహబూబ్!

  • Published Jul 31, 2024 | 6:06 PM Updated Updated Jul 31, 2024 | 6:06 PM

బిగ్ బాస్ ఫేం మెహబూబ్ తాజా వివాదంపై స్పందించాడు. తన పార్టీ వేడుకలపై పోలీసులు దాడి చేశారని, పెద్ద మొత్తంలో లిక్కర్ బాటిల్స్ లభించాయని వార్తలు రావడంతో వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకు ఏం చెప్పాడంటే..?

బిగ్ బాస్ ఫేం మెహబూబ్ తాజా వివాదంపై స్పందించాడు. తన పార్టీ వేడుకలపై పోలీసులు దాడి చేశారని, పెద్ద మొత్తంలో లిక్కర్ బాటిల్స్ లభించాయని వార్తలు రావడంతో వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకు ఏం చెప్పాడంటే..?

  • Published Jul 31, 2024 | 6:06 PMUpdated Jul 31, 2024 | 6:06 PM
లిక్కర్ పార్టీ వివాదంపై  స్పందించిన  బిగ్ బాస్ ఫేం మెహబూబ్!

యూట్యూబ్‌లో ప్రైవేట్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు మెహబూబ్. మెహబూబ్ దిల్ సే పేరుతో వీడియోలు చేశాడు. ఇదే క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చేలా చేసింది. చాలా మందికి ఇక్కడే సుపరిచితమయ్యాడు మెహబూబ్. సుమారు 70 రోజుల పాటు ఇంట్లో అలరించాడు. టాస్క్‌ల్లో ఇచ్చి పడేసేవాడు. కాగా, మోహబూబ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అనుమతి లేకుండా లిక్కర్ వినియోగిస్తున్నారని సమాచారంతో పార్టీ జరుగుతున్న రీసార్ట్ పై ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారని, అతడిపై కేసు నమోదైందని వార్త కథనాలు వచ్చాయి. దీనిపై యూట్యూబర్ కమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పందించాడు. దీనిపై వివరణ ఇచ్చాడు.

‘జులై 29న నా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. నా తమ్ముడు నాకొక సర్ ఫ్రైజ్ పార్టీ ఇచ్చాడు. నేను, నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాం. లిక్కర్ పర్మిషన్ తీసుకోమని నా తమ్ముడు ఫ్రెండ్స్ కు చెప్పాడట. వాళ్లు పట్టించుకోలేదు. అన్ని రీసార్ట్‌కు వచ్చి పోలీసులు చెక్ చేసినట్లు నేను పార్టీ చేసుకుంటున్న రీసార్ట్‌కు కూడా వచ్చారు. రూమ్స్ అన్ని చెక్ చేశారు. లిక్కర్ ఉంది దీనికి పర్మిషన్ లేదండి అని చెబితే..తీసుకెళ్లాలి అని చెప్పారు. వాళ్లు బాటిల్స్ తీసుకెళ్లిపోయారు. మేము పార్టీ చేసుకున్నాం. ఆ ఫోటోలను కూడా పోస్టు చేశాను. అయితే పొద్దున్న నుండి రేవ్ పార్టీ, ఆ పార్టీ అంటూ వార్తలు వస్తున్నాయి. అక్కడ అలాంటిది ఏం లేదు. అలాగే అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను’ అని పేర్కొన్నాడు మెహబూబ్.

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లో ఉన్న కాంటినెంటల్ రిసార్ట్ పై ఎక్సైజ్ పోలీసులు దాడి నిర్వహించారు. బర్త్ డే పార్టీ పేరుతో అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేపట్టారు. ఈ సమయంలో మెహబూబ్ పేరు వినిపించింది.మెహబూబ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన సోదరుడు సుభాన్ అలీ పార్టీని నిర్వహించగా.. అనుమతి లేని లిక్కర బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక మెహబూబ్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన వీడియోలు చేసేవాడు. అలాగే బీబీ డ్యాన్స్ జోడీలో కూడా అలరించాడు. తాజాగా బిగ్ బాస్ ఫేం శ్రీ సత్యతో కలిసి కాదల్ కురిసే సాంగ్ చేశాడు. ఇది ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. గుంటూరు మిర్చి అనే మూవీలో హీరోగా కనిపించాడు మెహబూబ్

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş