iDreamPost
android-app
ios-app

శివాజీకి మానస్ కౌంటర్స్.. ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదు!

  • Published Nov 13, 2023 | 10:59 AM Updated Updated Nov 13, 2023 | 10:59 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ సక్సెస్ ఫుల్ గా సాగింది. స్టేజ్ మీద మానస్ నాగులపల్లి శివాజీకి కౌంటర్స్ వేశాడు. అమర్ ఆట గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ సక్సెస్ ఫుల్ గా సాగింది. స్టేజ్ మీద మానస్ నాగులపల్లి శివాజీకి కౌంటర్స్ వేశాడు. అమర్ ఆట గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Published Nov 13, 2023 | 10:59 AMUpdated Nov 13, 2023 | 10:59 AM
శివాజీకి మానస్ కౌంటర్స్.. ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ ఎపిసోడ్ ఘనంగా ముగిసింది. అందరి కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి, స్టేజ్ మీదకు వచ్చారు. వాళ్ల ఆటకు సంబంధించిన అన్ని సలహాలు ఇచ్చారు. ఇకపై ఆట కూడా హౌస్ లో మరింత జోరు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఇచ్చిన సలహాలను హౌస్ మేట్స్ ఇప్పటికే పాటించడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఆదివారం ఎపిసోడ్ లో మానస్ నాగులపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టేజ్ మీద ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ శివాజీ కోసమే అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఎవరి ఆట వాళ్ల ఆడతారు. కానీ, ఈ సీజన్ లో మాత్రం శివాజీ కోచింగ్ సెంటల్ ఓపెన్ చేశాడు. ప్రశాంత్, యావర్, రతికా అంటూ ఆ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే అక్కడ అడ్మిషన్ దొరకలేదు అంటూ భావోద్వేగానికి గురైన వాళ్లు కూడా ఉన్నారు. వారిలో అమర్ ముందు వరసలో ఉంటాడు. ఇన్ని వారాలు తనకు సపోర్ట్ చేయడం లేదంటూ బాగానే బాధ పడ్డాడు. కొన్ని వారాలుగా ఆ మ్యాటర్ పక్కన పెట్టి తన ఆట తాను ఆడుతున్నాడు. స్టేజ్ మీదకు వచ్చిన మానస్, అమర్ తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్ తండ్రి కప్పు కొట్టుకుని వచ్చాకే హైదరాబాద్ వస్తాను అంటూ చెప్పినట్లు తెలిపారు. తండ్రి కోసం తాను తప్పకుండా కప్పుతోనే తిరిగి వస్తాను అంటూ తెలియజేశాడు.

అమర్ తల్లి పల్లవి ప్రశాంత్ ఆట గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి బాగా ఆడుతున్నావ్ అంటూ చెప్పింది. ఇంకా బాగా ఆడాలి అని కోరుకుంది. అలాగే అందరూ కలిసి ఉండండి అంటూ సూచించింది. మానస్ కూడా అమర్ ఆట గురించి క్లారిటీ ఇచ్చాడు. నేను హౌస్ లో ఉన్నప్పుడు నా కోసం అమర్ స్టేజ్ మీదకు వచ్చాడు. నేను అప్పుడే మాటిచ్చాను నీకోసం నేను వస్తాను అని. నా మాట నెరవేర్చుకున్నాను. అమర్ చాలా బాగా ఆడుతున్నావ్. మొన్న ఆడావ్ కదా.. అలాగే ఆడాలి. ఇంట్లో ఎవ్వడికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తోపురా.. మీసం తిప్పురా. నీ ఆట నువ్వు ఆడు. త్యాగాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.

శివాజీ గారు మీకు చాణక్యుడు అనే పేరు కూడా వచ్చింది. హౌస్ లో అందరికంటే మీరే పెద్ద. వీళ్లంతా మీ ముందు బచ్చాలు. ఆట కూడా బాగా మార్చుకున్నాడు. మరి.. అమర్ కి కూడా కాస్త ఆ సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుంది కదా?” అంటూ శివాజీకి కౌంటర్లు వేస్తూనే మళ్లీ మీరు తోపు అంటూ చెప్పాడు. అమర్ బయట ఉన్నప్పుడు కూడా అవే మాటలు చెప్పాడు. కొత్తగా వచ్చిన వాళ్లను కూడా బిడ్డా అంటూ దగ్గరకు తీసుకునే శివాజీ.. ఎందుకు అమర్ అంటే అంత దూరం పెడుతున్నాడు అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి ఫ్యామిలీస్ స్టేజ్ మీదకు రావడంతో అందరిలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తల్లి, అక్క రావడంతో హౌస్ అంతా ఎమోషనల్ అయ్యింది. ఒక కామన్ మ్యాన్ ఇంత దూరం వచ్చాడు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మానస్ నాగులపల్లి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet