iDreamPost
android-app
ios-app

రతిక ఓట్ల కోసం రాహుల్ ని వాడుకుంటోంది: ఆదిరెడ్డి

  • Published Sep 08, 2023 | 9:56 PM Updated Updated Sep 08, 2023 | 9:56 PM
  • Published Sep 08, 2023 | 9:56 PMUpdated Sep 08, 2023 | 9:56 PM
రతిక ఓట్ల కోసం రాహుల్ ని వాడుకుంటోంది: ఆదిరెడ్డి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. ఈసారి మొదటివారంలోనే టాస్కులు, గొడవలు, జంటలు, కన్నీళ్లు కూడా పెట్టేశారు. సాధారణంగా ప్రతి సీజన్ లో ఒక 5 వారాలు అయినా జరిగిన తర్వాత ఇంటి సభ్యులను గుర్తుచేయడం, ఎవరినైనా మిస్ అవుతున్నారా అంటూ ప్రశ్నించడం చేస్తారు. అయితే ఈసారి మాత్రం అది మొదటి వారంలోనే చూశాం. రతికాని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని అడుగుతాడు. అందుకు రతికా తన మాజీ ప్రియుడి గురించి చెప్పింది. ఈ మొత్తం కాన్సెప్ట్ పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రతికా ఓట్ల కోసమే ఇలా చేస్తోంది అంటూ రివ్యూవర్, బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

రతికా రోజ్ స్టేజ్ మీద ఉన్నప్పటి నుంచి ఎందుకో ఈమె భగ్న ప్రేమకథను కదిలిస్తూ వస్తున్నారు. అయితే ఎందుకు ప్రతిసారి ఆమె మాజీ ప్రియుడి గురించి మాట్లాడుతున్నారు అనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఈ విషయంపై క్లియర్ గా మాట్లాడుతూ ఆదిరెడ్డి ఒక వీడియో చేసి తన ఛానల్ లో పోస్ట్ చేశాడు. అందులో ఆమె తన ప్రేమకథను, ఒకవేళ మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ అయితే మాత్రం అతని ఫేమ్ ని ఓట్ల కోసం వాడుకుంటోంది అని చెబుతున్నాడు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు సడెన్ గా రాహుల్ ప్రేమ కథ తెర మీదకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నాడు? ఒకవేళ నిజంగానే రాహుల్ సిప్లిగంజ్ మాజీ ప్రియుడు అయితే ముగిసి పోయిన ప్రేమకథ గురించి ఎందుకు ప్రస్తావన తెస్తున్నారు అంటూ నిలదీస్తున్నాడు.

పాత సీజన్స్ లో బాగా ఆడిన ప్లేయర్ల పేర్లు ప్రస్తావిస్తే ఓట్ల కోసం ఇలా చేశారు అని అంటారు కదా? మరి.. బిగ్ బాస్ సీజన్ విన్నర్, ఆస్కార్ గెలిచిన పాట పాడిన సింగర్ అయిన రాహుల్ పేరును ఇక్కడ ఇలా వాడుకోవడం ఓట్ల కోసం కాదా అంటూ ఆదిరెడ్డి సూటి ప్రశ్న విసిరాడు. ఎప్పుడో రాహుల్ తో కలిసున్న ఫొటోలు సడెన్ గా ఎందుకు నెట్టింట ప్రత్యక్షం అవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఒకవైపు బిగ్ బాస్ వైపు నుంచి కూడా ఏదో జరుగుతోంది అంటూ ఆదిరెడ్డి కామెంట్ చేశాడు. పదే పదే ఆమె బ్రేకప్ గురించి ఎందుకు ప్రస్తావన తెస్తున్నారంటూ ఆదిరెడ్డి క్వశ్చన్ చేశాడు. అలాగే రతిక పీఆర్ టీమ్ రాహుల్ పేరుని వాడుకోవడానికి ఇలా చేస్తూ ఉండచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. 10 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో పోస్ట్ చేసిన ఆదిరెడ్డి తన ఛానల్ నుంచి ఈ వీడియో డిలీట్ చేశాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom