iDreamPost
android-app
ios-app

శివాజీ తప్పులు చేసి కప్పిపుచ్చుకుంటున్నారు: గౌతమ్

  • Published Nov 04, 2023 | 4:00 PM Updated Updated Nov 04, 2023 | 4:00 PM

బిగ్ బాస్ హౌస్ లో ఆట సంగతి పక్కన పెడితే పెద్ద యుద్ధాలే జరిగాయి. శోభాశెట్టి ఈ వారం కప్టెన్ అయ్యింది. ఇంక అశ్విని, గౌతమ్ కృష్ణాలు శివాజీపై గట్టిగానే విమర్శలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆట సంగతి పక్కన పెడితే పెద్ద యుద్ధాలే జరిగాయి. శోభాశెట్టి ఈ వారం కప్టెన్ అయ్యింది. ఇంక అశ్విని, గౌతమ్ కృష్ణాలు శివాజీపై గట్టిగానే విమర్శలు చేశారు.

  • Published Nov 04, 2023 | 4:00 PMUpdated Nov 04, 2023 | 4:00 PM
శివాజీ తప్పులు చేసి కప్పిపుచ్చుకుంటున్నారు: గౌతమ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట కాస్తా యుద్ధంలా మారిపోయింది. ఈవారం హౌస్ లో కెప్టెన్ గా గట్సీ గార్ల్ శోభాశెట్టి విజయం సాధించింది. మిత్రుడు అమర్ దీప్ పోరాడి శోభాని హౌస్ కి తొలి లేడీ కెప్టెన్ ని చేశాడు. మొదటి నుంచి అందరితో కొట్లాటకు దిగి మరీ విజయం సాధించాడు. అమర్ దీప్ ఏదైతో శాభాకు ఇచ్చాడో.. తాను హౌస్ నుంచి వెళ్లోలోపు అమర్ దీప్ కు కూడా తన చేతనైన సహాయం చేస్తాను అంటూ మాటిచ్చింది. 62వ ఎపిసోడ్ మొత్తం భావోద్వేగం, ఉద్వేగం, ఉక్రోశంతో అట్టుడికిపోయింది. అమర్ దీప్ కి ఎంతో పాజిటివ్ అయిన ఎపిసోడ్.. శివాజీకి మాత్రం నెగిటివ్ అయిపోయింది.

గెలిచిన టీమ్ సభ్యుల కోసం ఓడిన ఇంటి సభ్యులు పోరాడాలి అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే శివాజీ గౌతమ్ కెప్టెన్ అయ్యాడు కదా. ఈసారి మనోడు తప్పుకుంటాడు మిగిలిన వాళ్లు ఆడతారు అంటూ చెప్పాడు. కానీ, ఆ నిర్ణయాన్ని గౌతమ్ తప్పుబట్టాడు. అర్జున్, యావర్ కూడా కెప్టెన్ అయ్యారు మరి వాళ్లు ఎందుకు ఆడాలి? అని ప్రశ్నించాడు. అందుకే తాను వెళ్లి అశ్వినీని తన తరఫున ఆడమని కోరాడు. అందుకు అశ్వినీ కూడా అంగీకరించింది. ఇంక యావర్ తాను తప్పుకుంటాను అంటూ ఒప్పుకున్నాడు. శివాజీ అర్జున్ తరఫున ఆడాడు. ఆటలో గాయం కావడం వల్ల టాస్కు నుంచి తప్పుకున్నాడు. తన వల్లే శివాజీకి దెబ్బ తగిలింది అని అమర్ దీప్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కూడా చెప్పాడు. అయితే శివాజీ గేమ్ ప్లే గురించి అశ్విని, గౌతమ్ పలు విమర్శలు చేశారు.

అశ్వినీ మాట్లాడుతూ.. “ఆయనకు చివర్లో ఏం మాట్లాడాలో తెలుసు. ఆఖర్లో వచ్చేసి ఆ నువ్వు ఆడతావా? పదా నీ తరఫున నేను ఆడతాను అంటూ పాజిటివ్ అవ్వాలని చూస్తాడు” అంటూ కామెంట్ చేసింది. అంతకంటే ముందు భోలేతో మాట్లాడుతూ.. శివాజీ అన్న అంటే నాకు ఎంతో రెస్పెక్ట్. ఇంట్లో వాళ్లు కూడా ఆయనతో మంచిగా ఉండమని చెప్పి పంపారు. కానీ, ఆయన మాత్రం కేవలం కొందరికి మాత్రమే సపోర్ట్ చేస్తాడు. అందరికీ ఆయన సపోర్ట్ చేయడు” అంటూ అశ్వినీ ఏడ్చేసింది. గౌతమ్ కూడా తన మనసులో ఉన్నది మొత్తం కక్కేశాడు. ఆఖర్లో వచ్చి నేను ఆడతాను అంటాడు. ఆ తర్వాత చేయి నొప్పి అని ఫస్ట్ రౌండ్ లోనే పక్కకు వెళ్లిపోతాడు అంటూ గట్టిగానే కౌంటర్లు వేశాడు. అంతేకాకుండా ఎపిసోడ్ చివర్లో కెమెరా దగ్గరకు వెళ్లి తనను కన్ఫెషన్ రూమ్ కి పిలవాలి అంటూ చెప్పుకొచ్చాడు.

శివాజీకి గౌతమ్ కు వరుసగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. స్పెషల్ బాల్ విషయంలో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ తర్వాత ఎవరు పోటీ చేయాలి అనే ప్రశ్న దగ్గర కూడా వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ విషయంపై గౌతమ్ బిగ్ బాస్ తో మాట్లాడాడు. తాను తన మనసులో ఉన్నది చెప్పుకోవాలి అంటూ రిక్వెస్ట్ పెట్టాడు. అలా చేయకపోతే శివాజీ చెప్పిందే నిజం అవుతుంది అంటూ భయపడ్డాడు. ఒకవేళ సైలెంట్ గా ఉంటే తన గురించి బయటకు బ్యాడ్ వెళ్తుంది అంటూ చెప్పాడు. “శివాజీ గురించి నేను మాట్లాడాలి బిగ్ బాస్. లేకపోతే రాంగ్ గా పోట్రే అవుతుంది. అలా అయితే నన్ను ఎలిమినేట్ చేసేసి పంపేసినా నాకు ఇష్టమే. ఫిజికల్ గేమ్ ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని చూస్తున్నారు. ఆయన చాలా తప్పులు చేస్తున్నారు. హౌస్ లో ఉన్న వాళ్లందరికీ క్లియర్ గా కనిపిస్తోంది. అన్నీ లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని బాగా కవర్ చేసుకుంటున్నారు. ప్రతిదీ నేను చెప్తాను బిగ్ బాస్” అంటూ గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom