iDreamPost
android-app
ios-app

కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రోమో.. గౌతమ్ తల్లి ఇంట్లోకి రాగానే..!

  • Published Nov 08, 2023 | 11:18 AM Updated Updated Nov 08, 2023 | 11:18 AM

బిగ్ బాస్ ఆడియన్స్ కళ్లు చమ్మగిల్లుతున్నాయి. ఫ్యామిలీ వీకెండ్ లో ప్రతి ప్రోమో అందరి హృదయాలను కదిలిస్తోంది.

బిగ్ బాస్ ఆడియన్స్ కళ్లు చమ్మగిల్లుతున్నాయి. ఫ్యామిలీ వీకెండ్ లో ప్రతి ప్రోమో అందరి హృదయాలను కదిలిస్తోంది.

  • Published Nov 08, 2023 | 11:18 AMUpdated Nov 08, 2023 | 11:18 AM
కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రోమో.. గౌతమ్ తల్లి ఇంట్లోకి రాగానే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట భావోద్వేగంగా సాగుతోంది. ఫ్యామిలీ వీకెండ్ లో ఆట మరింత ఎమోషనల్ గా సాగుతోంది. మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మొత్తం కన్నీళ్లు పెట్టించారు. శివాజీ కుమారుడు, అంబటి అర్జున్ భార్య, అశ్వినీ తల్లి ఇంట్లోకి వచ్చారు. ఇన్నిరోజుల తర్వాత ఎవరికి వాళ్లు తమ ఫ్యామిలీని చూసి ఏడ్చేశారు. శివాజీ కూడా కొడుకుని పట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అర్జున్ కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత తన ఎమోషన్ ని బయటకు చూపించడం ఇదే తొలిసారి. భార్యకు సీమంతం చేయగానే అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇప్పుడు డాక్టర్ బాబు గౌతమ్ తల్లి హౌస్ లోకి వచ్చారు. తల్లిని చూడగానే గౌతమ్ చిన్న పిల్లాడు అయిపోయాడు.

ఫ్యామిలీ వీకెండ్ లో వస్తున్న ప్రతి ప్రోమో అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. కన్న ప్రేమ ఒకవైపు.. కట్టుకున్న బంధం మరోవైపు బిగ్ బాస్ ఇంటి సభ్యులను మాత్రమే కాదు.. ప్రేక్షకులను కూడా ఏడిపించేస్తోంది. హౌస్ లోకి ముందుగా తెల్ల పంచెను పంపారు. ఆ తర్వాత తన తల్లి కన్నయ్య అంటూ పిలిచింది. ఆ పిలుపు వినగానే గౌతమ్ పరుగున వెళ్లాడు. ఇల్లు మొత్తం తల్లికోసం వెతికాడు. పంచె వచ్చిందా అనగానే.. నా కోసమేనా అంటూ పరుగున వెళ్లి ఆ పంచెను కట్టుకున్నాడు. తర్వాత తన తల్లి ఇంట్లోకి అడుగుపెట్టారు. తల్లిని చూడగానే ఆమె పట్టుకుని గౌతమ్ ఏడ్చేశాడు. గౌతమ్ చెవి పట్టుకుని అమ్మ వారించింది.

హౌస్ మేట్స్ అందరూ రాగానే.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది అంటూ అసలు విషయం చెప్పింది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. ఆ తర్వాత గౌతమ్ తల్లి అన్నం కలిపి ఇంట్లో ఉన్న అందరికీ తినిపించింది. తల్లి ప్రేమకు దూరమైన అందరూ చిన్న పిల్లల్లా మారిపోయి అమ్మ గోరు ముద్దలు తిన్నారు. గౌతమ్ తల్లిని చూసి యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. యావర్ కన్నీళ్లు తుడుస్తూ.. నువ్వు కూడా నాకు కొడుకువే ఏడవకు అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ మొత్తం దృశ్యాలు చూసిన హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గౌతమ్ తల్లి ఇంట్లోని సభ్యులు అందరితో కలిసి డాన్స్ చేశారు. గౌతమ్ కృష్ణ గేమ్ గురించి తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు చేస్తోంది కరెక్ట్ నువ్వు అలాగే ఆడు అంటూ చెప్పుకొచ్చారు.

ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోయారు. అందరూ భావోద్వేగంతో కామెంట్స్ పెడుతున్నారు. యావర్ ఏడవడం చూడగానే మాకు కూడా ఏడుపొచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాం అంటున్నారు. కొందరైతే.. ఈ ఫ్యామిలీ వీకెండ్ లో ఏ ప్రోమో చూసినా కూడా కన్నీళ్లు ఆగడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ సీజన్ లో ఫ్యామిలీ వీకెండ్ ప్రోమోలు అన్నీ టూ ఎమోషనల్ గా ఉంటున్నాయి. ఆ ప్రోమోలు చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఎందుకంటే.. ఎవరూ కూడా ఫ్యామిలీతో మాట్లాడకుండా, చూడకుండా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అన్ని రోజుల తర్వాత వాళ్లు వాళ్ల ఫ్యామిలీని కలుస్తుంటే ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్ ని ఫీలవుతున్నారు. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet