iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: గౌతమ్ పిచ్చి పీక్స్.. ప్రేక్షకుల గురించి ఆలోచిస్తేనే జాలేస్తోంది!

  • Published Oct 10, 2023 | 1:14 PM Updated Updated Oct 10, 2023 | 4:47 PM
  • Published Oct 10, 2023 | 1:14 PMUpdated Oct 10, 2023 | 4:47 PM
Bigg Boss 7 Telugu: గౌతమ్ పిచ్చి పీక్స్.. ప్రేక్షకుల గురించి ఆలోచిస్తేనే జాలేస్తోంది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. నామినేషన్స్ తో హౌస్ లో రచ్చ మొదలైంది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలను పోటుగాళ్లుగా.. ఇప్పటికే హౌస్ లో ఉన్న వాళ్లను ఆటగాళ్లుగా విడదీశారు. ముందుగా నామినేషన్స్ లో పోటుగాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. 5 వారాల ఆట చూశారుగా దాన్ని బట్టి ఆటగాళ్లలో ఇద్దరిని నామినేట్ చేయండి అన్నారు. ఈ నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు అమర్ దీప్ కి పడ్డాయి. ఐదుగురిలో నలుగురు అమర్ కు ఓటేశారు. ఒక్క పూజా మాత్రం అమర్ కు ఓటేయలేదు. పోటుగాళ్లలో గౌతమ్ కూడా చేరాడు. సీక్రెట్ రూమ్ నుంచి నేరుగా నామినేషన్స్ లోకి వచ్చేశాడు.

గౌతమ్ ని ఇప్పటికీ ప్రేక్షకులు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ప్రవర్తన పరంగా జెంటిల్ మ్యాన్ అనే చెప్పాలి. కానీ, ఆట విషయంలో మాత్రం దూసుకెళ్తాడు అనుకున్న చోట చతికిల పడతాడు. ఎక్కడ బలంగా మాట్లాడాలో అక్కడ సైలెంట్ గా ఉంటాడు. ఎక్కడ సైలెంట్ గా ఉంటే బాగుంటుందో అక్కడ కేకలు వేస్తాడు. ఇటీవల చిట్టీ యాయీరే టాస్కులో కూడా సుబ్బు వెళ్లిపోవడానికి మనోడే కారణం అని ప్రేక్షకులు కూడా హర్ట్ అయిపోయారు. ఎందుకంటే గేమ్, డిబేట్, రీజన్స్ ఇలా ఏం చూసుకున్నా కూడా గౌతమ్ కంటే శుభశ్రీ టాప్ ప్లేయర్ అనే చెప్పచ్చు. అంతేకాకుండా ఆమె కంటెండర్ అయుంటే కాస్త ఈజీ టాస్క్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆమెతో గొడవపడి మరీ కంటెండర్ అయ్యాడు. చివరి రౌండ్ లో ప్రశాంత్ చేతిలో కాస్త తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తర్వాత గౌతమ్ డిసర్వింగ్ కంటెస్టెంట్ అవునా? కాదా? అని ఓటింగ్ పెట్టి గౌతమ్ ని ఎలిమినేట్ చేశాం అన్నారు. తర్వాత అతడిని సీక్రెట్ రూమ్ కి పంపారు. సీక్రెట్ రూమ్ లో ఉండి ఎవరి ఆట ఏంటో తెలుసుకుని ఇరగదీస్తాడు అని ప్రేక్షకులు అంతా అనుకున్నారు. కానీ, అశ్వద్ధామ డైలాగులతో హౌస్ లోకి గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి గౌతమ్ తనని తాను పులిగా పరిచయం చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లు తేనె పూసిన కత్తితో గొంతులో పొడిచారు. కానీ, అస్వద్ధామలా చచ్చిపోకుండా తిరిగి వచ్చాను అని చెప్పారు. నిజానికి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడం అనేది గొప్ప వరం అనే చెప్పాలి. ఎందుకంటే నువ్వు లేనప్పుడు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అలాగే హౌస్ లో ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది చూసే అవకాశం దక్కుంతుంది.

గౌతమ్ ఇవేమీ పట్టించుకున్నట్లు లేడు. కేవలం ఏదొక సినిమా డైలాగులు చెప్పేసి ఎక్కేస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ, అది గౌతమ్ కు బాగా బ్యాక్ పైర్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మనోడి డైలాగులు చూసి ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. కొంతమంది అయితే మేక తనని తాను పులిగా ఊహించుకుంటోంది అంటూ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి వచ్చాక గౌతమ్ ఆట మరింత తగ్గిపోయేలా ఉంది. అంతేకాకుండా ఇప్పటి నుంచి మరింతగా లాజిక్స్ లేకుండా గౌతమ్ ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదంతా చూసిన తర్వాత మనసులోకి ఒకటే డైలాగ్ గుర్తొస్తోంది.. పాపం ప్రేక్షకులను చూస్తే జాలేస్తోంది. మరి.. గౌతమ్ రీ ఎంట్రీ ఎంతమందికి నచ్చింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom