iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ ఎలిమినేటెడ్?

  • Published Dec 02, 2023 | 5:45 PM Updated Updated Dec 02, 2023 | 6:08 PM

Bigg Boss 7 Telugu This Week Eliminationబిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ అనగానే ఫన్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎలిమినేషన్ టెన్షన్ ఉంటుంది. ఈ వారం హౌస్ నుంచి షాకింగ్ గా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. వాటిలో నిజం ఎంత ఉంది?

Bigg Boss 7 Telugu This Week Eliminationబిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ అనగానే ఫన్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎలిమినేషన్ టెన్షన్ ఉంటుంది. ఈ వారం హౌస్ నుంచి షాకింగ్ గా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. వాటిలో నిజం ఎంత ఉంది?

  • Published Dec 02, 2023 | 5:45 PMUpdated Dec 02, 2023 | 6:08 PM
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ ఎలిమినేటెడ్?

బిగ్ బాస్ లో శనివారం అనగానే ఎలిమినేషన్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అదేంటి ఎలిమినేషన్ అయ్యేది ఆదివారం కదా.. మరి శనివారమే ఎందుకు డిస్కషన్ అంటారా? విషయం ఏంటంటే.. 24 గంటల స్ట్రీమింగ్ వచ్చిన తర్వాత నెట్టింట లీకులు ఎక్కువ అయిపోయాయి. గతంలో మాదిరి ఇప్పుడు ప్రోమో వచ్చే దాకా ఆగే పరిస్థితి లేదు. అయితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందనే చెబుతున్నారు. ఎందుకంటే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇది విన్న తర్వాత ఆడియన్స్ కాస్త షాక్.. ఇంకొంత అసంతృప్తికి గురవుతున్నారు.

సాధారణంగా ఈ సీజన్ లో హౌస్ నుంచి వచ్చినవాళ్లు అందరూ బయట జరిగిన అనధికారిక పోలింగ్స్ ని బట్టే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అంటే ఆడియన్స్ పల్స్ కి దగ్గరగా ఎలిమినేషన్స్ జరిగాయి. కానీ, ఈసారి మాత్రం షాకింగ్ గా గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. గౌతమ్- శోభాశెట్టి డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయ్యారు. వారిలో బయట జరుగుతున్న అన్ అఫీషియల్ ఓటింగ్, ఆడియన్స్ కామెంట్స్ ని బట్టి చూస్తే శోభాశెట్టి ఎలిమినేట్ కావాల్సి ఉంది. నిన్నటి వరకు శోభా పేరే వినిపించింది కూడా. శోభాశెట్టి ప్రోమో కూడా రెడీ అయ్యింది అంటూ పోస్టులు వచ్చాయి. కానీ, ఇప్పుడు చివర్లో ట్విస్ట్ వచ్చింది.

శోభా కాకుండా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడంటూ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. దీంతో ఆడియన్స్ కి ఏం అర్థం కావడం లేదు. పైగా శోభాకి గత వారంతో పోలిస్తే.. ఈ వారం బాగా నెగిటివ్ అయ్యింది. అమర్ ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం ప్రియాంక- అమర్ మధ్య పుల్లలు పెట్టింది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అమర్ కి సపోర్ట్ చేస్తున్న పేరుతో అతని ఆటను మిస్ గైడ్ చేస్తోందంటూ చెబుతున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ కు ఆట పరంగా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ, ఈ వీక్ లో పెద్దగా ఆడింది ఏమీ లేదు. ఒక్క టాస్కులో కూడా గెలవలేకపోయాడు. అన్ని టాస్కుల్లో ఓడిపోతూనే ఉన్నాడు. దేనిలో కూడా అతని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అనడానికి లేకుండా పోయింది. హౌస్ లో నేను ఒక్కడినే ఆడతాను.. గ్రూప్ గేమ్ ఆడను అంటూ గౌతమ్ చెప్తూ ఉంటాడు.

ప్రియాంక విషయంలో మాత్రం గ్రూప్ గానే ఆడతాడు. అంతేకాకుండా తాజాగా ప్రోమోలో గౌతమ్ ని నాగార్జున అడిన ప్రశ్న ఇప్పటికే జనాల్లో నానుతోంది. శివాజీని ఇద్దరికే సపోర్ట్ చేస్తావ్ అని విమర్శించే గౌతమ్.. ప్రియాంకను మాత్రం ఆ ప్రశ్న అడగడం లేదు. అది కూడా గౌతమ్ ను జనాల్లో నెగిటివ్ చేస్తోంది. మొత్తానికి ఈ ఎలిమినేషన్ వార్త నిజమా అంటే? ఆదివారం రాత్రి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు చెప్పలేం. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు గౌతమ్ పేరు వినిపించినా.. తర్వాత శోభాశెట్టి బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet