iDreamPost
android-app
ios-app

రైతు బిడ్డ vs డాక్టర్ బాబు.. తప్పు ఎవరిది?

  • Published Oct 25, 2023 | 3:19 PM Updated Updated Oct 25, 2023 | 3:19 PM

ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ లో పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసిరారు. వీరిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్- డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకుండా పోటా పోటీగా కేకలు వేసుకున్నారు. అయితే వీరిలో అసలు తప్పు ఎవరిది?

ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ లో పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసిరారు. వీరిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్- డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గకుండా పోటా పోటీగా కేకలు వేసుకున్నారు. అయితే వీరిలో అసలు తప్పు ఎవరిది?

  • Published Oct 25, 2023 | 3:19 PMUpdated Oct 25, 2023 | 3:19 PM
రైతు బిడ్డ vs డాక్టర్ బాబు.. తప్పు ఎవరిది?

నామినేషన్స్ లో రచ్చ రచ్చ జరిగింది. ఎవరు ఎవరిని ఎందుకు నామినేట్ చేశారు? ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు అనే విషయం కూడా అర్థం కాలేదు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ నానా రచ్చ చేశారు. లిటిల్ గ్యాప్ లో కొట్టేసుకుంటారేమో అని ప్రేక్షకులకు కూడా కంగారు వచ్చేసింది. వీళ్ల గొడవల్లో రైతు బిడ్జ పల్లవి ప్రశాంత్, డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణకి మధ్య గట్టి వాదనే జరిగింది. ఈడికొచ్చి మాట్లాడు అంటూ ప్రశాంత్ అనడం.. ఏయ్ దొబ్బేయ్ అంటూ గౌతమ్ రియాక్ట్ అవ్వడం చూసి అంతా షాకయ్యారు. అయితే ఈ గొడవలో అసలు తప్పు ఎవరిదో ఇప్పుడు చూద్దాం.

పల్లవి ప్రశాంత్ ఈ వారం వేసిన నామినేషన్స్ లో ఒకటి అమర్ దీప్ కి, మరొకటి గౌతమ్ కృష్ణకు వేశాడు. వీటిలో ఎవరూ ఆశ్చర్యపోయే నామినేషన్ ఏం లేదు. ఎందుకంటే ప్రశాంత్ వీళ్లనే నామినేట్ చేస్తాడు అని అందరూ ఊహించే విషయమే. అయితే రీజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ కు సంబంధించి ఎలాంటి కారణాలు లేవు. శివాజీ కోసం ఒకటి, యావర్ కోసం మరో నామినేషన్ వేశాడు. అందులో గౌతమ్ చెప్పిన రీజన్స్ చెప్పి వీటిని ఏమంటారు అంటూ మెడను చూపించాడు. అందుకు గౌతమ్ కూడా కేకలు వేస్తూ రియాక్ట్ అయ్యాడు. కాసేపు కూల్ గా ఉన్నాడులే అనుకునేలోపు గౌతమ్ కృష్ణ హైపర్ అయ్యాడు. కాసేపు వీళ్ల మధ్య గట్టిగానే గొడవ జరిగింది. తొడలు కొట్టుకోవడం కాదు అంటూ గౌతమ్ అనగానే.. అందుకు ప్రశాంత్ మరోసారి తొడలు కొట్టుకున్నాడు.

మళ్లీ కొడతా.. అంటూ ఎగిరి రెండు తొడలు కొట్టుకున్నాడు. మీసాలు తిప్పాడు. అయితే ఈ పార్ట్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే ప్రతి నామినేషన్ లో ఇలాంటి రియాక్షన్లు అవసరం లేదు. కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అమర్ ని నామినేట్ చేసినప్పుడు మధ్యలో శోభా- భోలేకి గొడవ జరుగుతోంది. ఆ సమయంలో గౌతమ్ కృష్ణ.. అమర్ తో ఏదో చెవిలో చెప్పాడు. అందుకు పల్లవి ప్రశాంత్.. అలా చెవుల్లో కాదు ఈడొకిచ్చి మాట్లాడు అంటూ కేకలు వేశాడు. అందుకు గౌతమ్ కృష్ణ ఫుల్ హైపర్ అయిపోయాడు. సాధారణంగా నామినేషన్ సమయంలో వేరే వాళ్లు చెవిలో మాట్లాడితే ఎవరైనా తమ గురించే అనుకుంటారు.

ప్రశాంత్ కూడా అలాగే అనుకున్నాడు. అందుకు గౌతమ్ కృష్ణ కూల్ గా సమాధానం చెప్పి ఉంటే సరిపోయేది. “నేను ఎవరితో మాట్లాడుకుంటే నీకెందుకు? నీకు ఎందుకు చెప్పాలి. నాకు నచ్చిన వాడితో మాట్లాడుకుంటా నీకేంది? నువ్వు బిగ్ బాస్ వా? నీకు అసలు ఆ అర్హతే లేదు దొబ్బేయ్” అంటూ గౌతమ్ కృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మాత్రం గౌతమ్ కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. అయితే నామినేషన్స్ విషయంలో ప్రశాంత్ ది రివేంజ్ నామినేషన్ అని గౌతమ్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. కానీ, గౌతమ్ కాస్త అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. మరి.. ప్రశాంత్- గౌతమ్ కృష్ణ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom