iDreamPost
android-app
ios-app

Big Boss 8: బిగ్ బాస్‌లోకి బ్యూటీ.. పెద్ద స్కెచ్చే

  • Published Aug 05, 2024 | 6:17 PM Updated Updated Aug 05, 2024 | 6:22 PM

బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. క్యూరియాసిటీని పెంచేస్తుంది. అలాగే రోజు రోజుకూ ఇంట్లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఓ బజ్ నడుస్తుంది. తాజాగా ఓ బ్యూటీని తీసుకురాబోతున్నారట.

బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. క్యూరియాసిటీని పెంచేస్తుంది. అలాగే రోజు రోజుకూ ఇంట్లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఓ బజ్ నడుస్తుంది. తాజాగా ఓ బ్యూటీని తీసుకురాబోతున్నారట.

  • Published Aug 05, 2024 | 6:17 PMUpdated Aug 05, 2024 | 6:22 PM
Big Boss 8: బిగ్ బాస్‌లోకి బ్యూటీ.. పెద్ద స్కెచ్చే

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్ని భాషల్లో వచ్చినా ఈ ఎంటర్ టైన్‌మెంట్ షోకు దక్కుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఏడాదికి సుమారు 100 రోజుల పాటు టీవీ ప్రేక్షకులను కనువిందు చేస్తుంది ఈ షో. హిందీ నుండి సౌత్ ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లోకి చొచ్చుకుపోయింది. బిగ్ బాస్ కోసం ప్రతి ఒక్కరూ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. టాస్కులు, గొడవలు, అలకలు, ఆవేశాలు, చాడీలు వెరసి ఈ షోను కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్నాయి. గత సీజన్‌లో సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ గెలుచుకున్నాడు. ఉల్టా పల్టా అంటూ తీసుకు వచ్చింది బిగ్ బాస్ టీం. సీజన్ పూర్తయ్యాక విపరీతమైన బజ్ నడిచిన సంగతి విదితమే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్ కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారిని సర్ ప్రైజ్ చేస్తూ తాజాగా ఓ టీజర్ విడుదల చేసింది. ఇందులో హోస్ట్ నాగార్జున సరికొత్త గెటప్‌లో దర్శనమిచ్చారు. ‘ఇక్కడ కమిటైతే.. లిమిటే లేదు’ అంటూ మరో ట్యాగ్ లైన్‌తో ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఈ సీజన్ స్టార్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ కోసం చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. నటుడు అబ్బాస్ నుండి బుల్లితెర, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు బయటకు వచ్చాయి. రీతూ చౌదరి, విష్ణు ప్రియ, సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత, జబర్దస్త్ పవిత్ర, సీరియల్ యాక్టర్ అంజలి, మై విలేజ్ షో అనిల్, సోనియా సింగ్, యాంకర్ వర్షిణి, ప్రభాకర్, తేజశ్విని గౌడ, యాంకర్ నిఖిల్, కుషిత కల్లపు, కిరాక్ ఆర్పీ, బర్రెలక్క అలియాస్ శిరీష, ఇంద్రనీల్, అర్జున్ అంబటి, రేఖా భోజ్, యాదమ రాజు వంటి పేర్లు వినిపించాయి.

వీరితో పాటు మోడల్ కమ్ మాజీ మిస్ ఇండియా కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మిస్ ఇండియా తెలంగాణ ఊర్మిళ చౌహాన్. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేసిన ఊర్మిళ చౌహాన్.. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తుంది. ఇప్పుడు ఈమెను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆమెను సంప్రదించాలని టాక్ నడుస్తుంది. గత కొన్ని రోజులుగా బ్యూటీలను ఇంట్లోకి తీసుకు వస్తున్న టీం మరోసారి ఈ అందాన్ని తీసుకు వచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş