iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్! హ్యాట్సాఫ్ కామన్ మ్యాన్..

  • Published Dec 14, 2023 | 7:56 PM Updated Updated Dec 17, 2023 | 11:39 PM

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ దీప్ చౌదరి రన్నరప్ గా నిలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ దీప్ చౌదరి రన్నరప్ గా నిలిచాడు.

  • Published Dec 14, 2023 | 7:56 PMUpdated Dec 17, 2023 | 11:39 PM
Pallavi Prashanth: బిగ్ బాస్ 7 విన్నర్ గా రైతుబిడ్డ ప్రశాంత్!  హ్యాట్సాఫ్ కామన్ మ్యాన్..

బిగ్ బాస్-7 ఎంత విజయవంతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ సీజన్ ఉల్టాపుల్టాగా సాగి.. ప్రేక్షకులను అలరించింది. ఇక 105 రోజులు రసవత్తరంగా సాగిన ఈ గేమ్ ఆదివారంతో ముగిసింది. సంతోషాలు, బాధలు, టాస్క్ లు, కోపాలు, అలకలు ఇన్ని సంబరాల మధ్య అందరికీ ఒక్కటే డౌట్. బిగ్ బాస్-7 విన్నర్ ఎవరు? హౌస్ లో ఉన్న ఆరుగురిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది?  అన్న సందేహాం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్ 17)న జరిగిన గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించారు నాగార్జున. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు. దీంతో ఈ కామన్ మ్యాన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి.. విజేత నిలిచాడు. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఫస్ట్ అంబటి అర్జున్ ఎలిమినేట్ తో మెుదలైన ఈ ఎలిమినేషన్ వరుసగా ప్రియాంక జైన్, యావర్, శివాజీ లతో ముగిసింది. దీంతో పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ మధ్య టైటిల్ పోటీ నెలకొంది. ఇక అందరూ ఊహించిన విధంగానే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ముందునుంచే ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తాడని అందరూ భావించాడు. హౌస్ లో ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో ప్రశాంత్ కు బాగా తెలుసు. అదే అతడిని ఇక్కడి దాకా తీసుకొచ్చింది.

ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలవడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎంతో మంది సెలబ్రిటీలను దాటుకుని పల్లవి ప్రశాంత్ ఈ ఘనత సాధించాడు. టాస్క్ ల్లో ప్రశాంత్ దుమ్మురేపుతూ.. అందరి కంటే ముందుగానే వాటిని ముగించేయడం మనం చూశాం. కాగా.. ఓ సామాన్య మానవుడు ఇలాంటి ఓ బిగ్ రియాలిటీ షోలో పాల్గొని, విజేతగా నిలవడంతో.. అతడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి మహామహులను ఓడించి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom