iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: సింపథీ ప్రశాంత్ చీప్ గేమ్.. రతికతో కాళ్ల బేరం..!

  • Published Sep 27, 2023 | 12:59 PM Updated Updated Sep 27, 2023 | 1:21 PM
  • Published Sep 27, 2023 | 12:59 PMUpdated Sep 27, 2023 | 1:21 PM
Pallavi Prashanth: సింపథీ ప్రశాంత్ చీప్ గేమ్.. రతికతో కాళ్ల బేరం..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, స్కీములతో అప్పటికప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి. అయితే ఎంత మారినా కూడా వరసలు, వ్యవహారాలు మాత్రం మారే ప్రసక్తి ఉండదు. కానీ, ఇప్పుడు మారిపోయాయి. ఇన్నాళ్లు ప్రేమపక్షుల్లా బిగ్ బాస్ పార్కులో విహరించిన పల్లవి ప్రశాంత్- రతికా రోజ్.. ఒక్కసారిగా అక్కాతమ్ముళ్లు అయిపోయారు. నిజానికి ఈ కళా ఖండాన్ని చూడటానికే కాదు.. మాట్లాడుకోవడానికి కూడా యాక్ అనేలా ఉంది మరి. పల్లవి ప్రశాంత్ క్షమాపణ చెప్పాలి అనుకుంటే నేరుగా క్షమించమని అడిగితే సరిపోతుంది. కానీ, ఇలా అక్కా అంటూ కాళ్ల బేరానికి రావడం అస్సలు కరెక్ట్ అనిపించడం లేదు.

హౌస్ లో పల్లవి ప్రశాంత్- రతికా రోజ్ మధ్య ఏదో జరుగుతోంది అని షో స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ అనుకున్నారు. అయితే వాళ్ల మధ్య ఏం లేదు.. ఇద్దరు కంటెంట్ కోసం ఒకరిని ఒకరు వాడుకుంటున్నారు అని తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే ప్రేక్షకులు చాలా క్లియర్ గా ఉన్నారు. కానీ, రతికా రోజ్ మాత్రం కాస్త క్లారిటీ తప్పి.. తనదేం తప్పులేదు అంతా ప్రశాంతే చేశాడు అంటూ కలరింగ్ ఇచ్చింది. ఇంకేముంది అందరి ముందు ప్రశాంత్ ని కడిగేసింది. రెండోవారంలో నామినేషన్ కూడా చేసింది. నామినేషన్ లో రతిక ప్లేట్ ఫిరాయించడం చూసి అంతా అవాక్కయ్యారు. ఏంటి రతికానేనా ఇలా మాట్లాడుతోంది అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కూడా రతికాకు దూరంగా జరగడం ప్రారంభించాడు.

ఇంకేముది ప్రశాంత్ లో మార్పు మొదలైంది.. రైతు బిడ్డ ఆట అల్లాడిస్తాడు అంతా ఎదురుచూశారు. అందరూ ఊహించిన విధంగానే ప్రశాంత్.. రతికా మీద కౌంటర్లు వేయడం, సెటైర్లు వేయడం చేశాడు. అది చూసిన అభిమానులు చప్పట్లు కొట్టారు. తర్వాత ప్రిన్స్ యావర్.. రతికా ఐ లైక్ యూ అంటుంటే.. మనోడు ముందు ముందు నీకే తెలుస్తుంది అంటూ నవ్వుకున్నాడు. తర్వాత నామినేషన్స్ లో రతికా రోజ్ తో గొడవకు కూడా దిగాడు. నువ్వు చేసింది తప్పు కాదా అంటూ రెచ్చిపోయాడు. అయితే రతికా మాత్రం నోరేసుకుపడింది. అసలు ఎవడ్రా నువ్వు అంటూ చిందులు తొక్కంది. నన్ను ప్రాపర్టీ అంటావా? హార్ట్ సింబల్ వేసి PR అని రాస్తావా? నా మీద నీకు హక్కు ఉందా? అంటూ రచ్చ రచ్చ చేసింది. ఇంకేముంది.. అప్పటివరకు స్ట్రాంగ్ ఉన్న ప్రశాంత్ దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చాడు.

అతని విషయంలో రతికా తప్పు కూడా ఉంది అనే విషయాన్ని మర్చిపోయాడు. అసలు ఆమె తప్పు గురించి ప్రశ్నించడం మానేశాడు. దెబ్బకు జేబులో నుంచి తెల్ల కర్జీఫ్ తీసి సరెండర్ అయిపోయాడు. నేనే నేరస్థుడిని అంటూ మొత్తం మీదేసుకున్నాడు. ఈ విషయంలో కంటెస్టెంట్స్ ముందు పల్లవి ప్రశాంత్ బెస్ట్ అనిపించుకుని ఉండచ్చు. కానీ, ప్రేక్షకుల ముందు మాత్రం పల్లవి ప్రశాంత్ జీరో అయిపోయాడు. అతని తప్పు ఉన్నా.. అంతకంటే ఎక్కువ రతికా తప్పు ఉంది అనే విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయాడు. రతికా అక్క నన్ను క్షమించు. ఇకనుంచి నిన్న రతికా అని కూడా కాదు.. అక్క అనే పిలుస్తాను. నన్ను క్షమించావో లేదో చెప్పు. ఇక నుంచి నీ ఊసు కూడా ఎత్తను అంటూ కాళ్ల దగ్గర కూర్చుని ప్రాథేయపడ్డాడు. అందుకు ఆమె కాలు మీద కాలేసుకుని.. నవ్వుకుంటూ ఎక్కువ చనువు తీసుకుని నువు ఏమేంమేం అన్నవో.. ఏమేంమేం చేసినవో అన్నీ సరదా కోసమే చేసినవా? అంటూ రతికా రోజ్ ప్రశ్నిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Lyf A Zindagi (@lyf_a_zindagi)

అన్నీ మర్చిపో నేను అన్నింటికి క్షమాపణ చెబుతున్నాను. నువ్వు నాకు అక్కవి.. నేను నీకు తమ్ముడిని ఇంక ఎప్పుడన్నా అతిగా చేస్తే ఆ చీపురు కట్టతో కొట్టు అంటూ ప్రశాంత్ చెబుతాడు. ఇంక అన్నీ వదిలేసి మంచిగా ఉండు అంటూ రతికా రోజ్ కామెంట్ చేస్తుంది. పనిలో పని క్షమించాలే పో అంటూ డైలాగ్ కూడా వేస్తుంది. అందుకు పల్లవి ప్రశాంత్ ఉప్పొంగిపోయి అక్కడి నుంచి పరుగులు పెడతాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు బుద్ధి మీకైనా ఉండాలి.. మాకైనా ఉండాలి అంటూ పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లు లవ్ ట్రాక్ కోసం తిప్పలు పడి.. ఇప్పుడు అక్కాతమ్ముళ్లు అయిపోవడం చూస్తుంటే.. వరసలు కూడా వల్గర్ గా ఫీలయ్యేలా చేస్తున్నారు వీళ్లు అనిపిస్తోంది. మరి.. పల్లవి ప్రశాంత్– రతికా రోజ్ అక్కాతమ్ముళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom