iDreamPost
android-app
ios-app

గౌతమ్ దెబ్బకు కంగుతిన్న శివాజీ- ప్రశాంత్.. టాప్ 5 పక్కా!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం కెప్టెన్ ఎవరు అవుతారే అనే ఆసక్తి అందరిలో ఉంది. అందుకోసం హౌస్ మేట్స్ అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఆ అర్హతను కోల్పోయారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం కెప్టెన్ ఎవరు అవుతారే అనే ఆసక్తి అందరిలో ఉంది. అందుకోసం హౌస్ మేట్స్ అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఆ అర్హతను కోల్పోయారు.

గౌతమ్ దెబ్బకు కంగుతిన్న శివాజీ- ప్రశాంత్.. టాప్ 5 పక్కా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కు ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఎవరికి వాళ్లు విజయం సాధించి.. ఈ సీజన్ చివరి కెప్టెన్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇంక హౌస్ లో కొన్ని గొడవలు తగ్గాయనే చెప్పాలి. కానీ, శివాజీ- గౌతమ్ పంచాయితీ మాత్రం ఇప్పుడల్లా తేలేలా లేదు. ఇప్పటికీ వారి మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. శివాజీ చేసిన తప్పును, మార్చిన మాటను తిరిగి ప్రశ్నించగల హౌస్ మేట్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది గౌతమ్ అనే చెప్పాలి. కానీ, శివాజీ మాత్రం గౌతమ్ అన్నీ వాటెండ్ గా చేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆట తక్కువ, గొడవలు ఎక్కువ అనే కామెంట్స్ కూడా చేస్తాడు. కానీ, ఇప్పుడు డాక్టర్ బాబు శివాజీ, ప్రశాంత్ కు షాకిచ్చాడు.

ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న టాస్కులో కొందరికి సీక్రెట్ టాస్కులు కూడా ఇస్తున్నాడు బిగ్ బాస్. ఆ టాస్కుల్లో విజయం సాధిస్తే వారికి కెప్టెన్సీ రేసులో మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటి ఒక సీక్రెట్ టాస్క్ శివాజీకి బిగ్ బాస్ ఇచ్చాడు. కానీ, శివాజీ మాత్రం ఎంతో సక్సెస్ ఫుల్ గా అందులో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఆ బాధ్యతను ప్రియాంకకు బిగ్ బాస్ అప్పగించాడు. ఇంక గౌతమ్ విషయానికి వస్తే.. ప్రశాంత్ ని శివాజీ హత్య చేశాడు అనే విషయం ఎవరికీ తెలీదు. కానీ, గౌతమ్ ఒక్క మాటతో అది తేల్చేశాడు. దెయ్యం దుస్తుల్లో తిరుగుతున్న ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్ ను గౌతమ్ ఒక మాట అడిగాడు. అరే నిన్ను శివాజీ అన్ననే చంపాడు కదా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో రైతుబిడ్డ ప్రశాంత్ కంగుతిన్నాడు. గౌతమ్ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు. అంతేకాకుండా హంతకుడు శివాజీ అనే విషయాన్ని కూడా గౌతమ్ కనిపెట్టాడు. హోటల్ మేనేజర్ గెటప్ లో ఉన్న శివాజీనే ఈ హత్య చేసి ఉంటాడనే అనుమానాన్ని గౌతమ్ లేవనెత్తాడు. ప్రశాంత్ ని డెడ్ చేసిన సీక్రెట్ టాస్కు మాత్రమే కాదు.. బిగ్ బాస్ భార్యను కూడా హత్య చేసింది శివాజీ అనే విషయాన్ని గౌతమ్ కనిపెట్టాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఒకప్పుడు టేస్టీ తేజ మైండ్ గేమ్స్, బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడు అనే విషయాలను కనిపెట్టేవాడు. ఇప్పుడు ఆ ప్లేస్ ని గౌతమ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంక గౌతమ్ తెలివితేటలకు నెట్టింట మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. డాక్టర్ బాబు ఆట విషయానికి వస్తే.. మొదటి నుంచి ఏ గ్రూప్ లో లేకుండా సింగిల్ గానే ఆడుతున్నాడు. నామినేషన్స్ సమయంలో కూడా ఎవరిది తప్పు ఉంటే వారినే నామినేట్ చేస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. నాకు 6 పాయింట్స్ ఉన్నాయి.. బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తే ఆరుగురిని నామినేట్ చేస్తాను అంటూ చెప్పిన మాటలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ఇదే ఆట, జోరు కొనసాగితే డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. గౌతమ్ కృష్ణ ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis