iDreamPost
android-app
ios-app

తేజ చేతిలో బిగ్ బాస్ గేమ్! ఎవ్వరూ గమనించని నిజాలు..

  • Published Oct 30, 2023 | 1:04 PM Updated Updated Oct 30, 2023 | 1:04 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా మారుతోంది. తాజాగా ఆట సందీప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇప్పటి నుంచి హౌస్ లో ఆట మరింత రసవత్తరంగా సాగబోతోంది. ఎవరికి వాళ్లు ఆటలో విజయం సాధించాలంటూ తెగ పోటీ పడుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా మారుతోంది. తాజాగా ఆట సందీప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇప్పటి నుంచి హౌస్ లో ఆట మరింత రసవత్తరంగా సాగబోతోంది. ఎవరికి వాళ్లు ఆటలో విజయం సాధించాలంటూ తెగ పోటీ పడుతున్నారు.

  • Published Oct 30, 2023 | 1:04 PMUpdated Oct 30, 2023 | 1:04 PM
తేజ చేతిలో బిగ్ బాస్ గేమ్! ఎవ్వరూ గమనించని నిజాలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి ఆటపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంక హౌస్ లో గేమ్ విషయానికి వస్తే.. తాజాగా ఆట సందీప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. నామినేట్ అయిన తొలివారమే ఎలిమినేట్ అయ్యాడు. అయితే సందీప్ ఎలిమినేషన్ వెనుక టేస్టీ తేజ హస్తం ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతను నామినేట్ చేయబట్టే ఎలిమినేట్ అయ్యాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ అనేది రియాలిటీ గేమ్ షో అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఫిజికల్ టాస్కులు ఎంత ముఖ్యమో.. మెంటల్ గా గేమ్ ఆడటం కూడా అంతే ముఖ్యం. ఎక్కువగా సైకలాజికల్ గానే గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఆ విషయంలో మాత్రం టేస్టీ తేజాకి ఎక్కువ మార్కులు పడతాయి. ఇప్పటికే చాలా మంది హౌస్ లో ఉన్న వారిలో తేజ తెలివితేటలను మెచ్చుకున్నారు. వచ్చేటప్పుడు ఆట సందీప్ కూడా టేస్టీ తేజ ఎంతో తెలివైనవాడు అంటూ కితాబిచ్చాడు. హౌస్ లో ఉన్నవారిలో తేజానే తెలివైనవాడు అనే విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నాడు. అలాగే చాలా సందర్భాల్లో టేస్టీ తేజా కూడా తెలివైనవాడు అనే విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు.

గౌతమ్ కృష్ణాని సీక్రెట్ రూమ్ కి పంపిన సమయంలో అందరూ తను ఎలిమినేట్ అయ్యాడనే అనుకున్నారు. కానీ, టేస్టీ తేజా ఒక్కడే అసలు విషయాన్ని డీకోడ్ చేసి గౌతమ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో టేస్టీ తేజ తెలివితేటలను ప్రదర్శించడం చూశాం. ఇంక ఇప్పుడు నామినేషన్స్, ఎలిమినేషన్స్ విషయంలో టేస్టీ తేజ పేరు బాగా వినిపిస్తోంది. టేస్టీ తేజ నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతారు అంటూ చెబుతున్నారు. ఈ మాట హౌస్ లో కూడా వినిపిస్తోంది. తేజా నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతారు అంటూ చెబుతున్నారు. నయనీ పావనీ, పూజా మూర్తి, తాజాగా ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. స్టేజ్ మీద నాగార్జున కూడా తేజా నామినేట్ చేస్తే ఎలిమినేట్ అవుతారు అంటూ చెప్పారు.

ఆ మాటకు నాగార్జునానే క్లారిటీ కూడా ఇచ్చారు. తేజా కేవలం నామినేట్ మాత్రమే చేయగలడు. కానీ, వాళ్లకు ఓట్లు పడకపోతేనే ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు. ఎందుకంటే వరుసగా మూడు వారాలు ఇలా జరిగితే తేజాకు నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పినట్లు అనిపించింది. నిజానికి తేజా నామినేట్ చేస్తే ఎలిమినేట్ అవ్వడం అనేది ఉండదు. కానీ, తేజా ఎవరిని నామినేట్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. తేజా గేమ్ ని బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఎవరు అయితే వీక్ ఉంటున్నారో వాళ్లనే నామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నీ కలిసొచ్చి వాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టేస్టీ తేజ చేతిలో బిగ్ బాస్ గేమ్ అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి.. తేజా నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet