iDreamPost
android-app
ios-app

ఫిబ్రవరి నుంచే బిగ్ బాస్ OTT-2.. ఆరుగురు ఫైనల్ కూడా అయ్యారట!

  • Published Dec 28, 2023 | 3:19 PM Updated Updated Dec 28, 2023 | 3:19 PM

Bigg Boss OTT Season 2 Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిందో లేదే.. అప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గురించి బజ్ మొదలైపోయింది. ఇప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వైరల్ అవుతోంది.

Bigg Boss OTT Season 2 Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిందో లేదే.. అప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గురించి బజ్ మొదలైపోయింది. ఇప్పుడు కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వైరల్ అవుతోంది.

  • Published Dec 28, 2023 | 3:19 PMUpdated Dec 28, 2023 | 3:19 PM
ఫిబ్రవరి నుంచే బిగ్ బాస్ OTT-2.. ఆరుగురు ఫైనల్ కూడా అయ్యారట!

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభమైన ప్రతి భాషలో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అన్ని భాషల్లో లాగానే ఈ షోని సపోర్ట్ చేసే వాళ్లు ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఈ షోకి అదిరిపోయే ఆదరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షో తెలుగులో 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒట ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆరుగురు కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. 105 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ షోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతనిపై కేసు నమోదు కావడం, రిమాండు ఖైదీగా వెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఒక సూపర్ న్యూస్ అందింది. బిగ్ బాస్ ఓటీటీలో ఇప్పటికే ఒక సీజన్ పూర్తైంది. ఆ ఫస్ట్ సీజన్ లో బిందు మాధవి విన్నర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ ని కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారంట. డిసెంబర్ 17న బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల గ్యాప్ లోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభించేందుకు రెడీ అయిపోతున్నారంట. ఇంకో అదిరిపోయే న్యూస్ ఏంటంటే.. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ని కూడా ఫైనల్ చేశారంటూ టాక్ గట్టిగా వినిపిస్తోంది.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేశారని చెబుతున్నారు. వారిలో సీజన్ 7 కంటెస్టెంట్ పాట బిడ్ భోలే షావలీ పేరు బాగా వినిపిస్తోంది. వైల్డ్ కార్డుగా వెళ్లిన భోలే షావలీ బయటకు వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయ్యాడు. భోలే హీరో అంటూ పాట కూడా చేశాడు. సీజన్ 7లో ప్రేక్షకుల్లో పాజిటివీటీ వస్తోంది అన్న సమయంలో భోలే ఎలిమినేట్ అయ్యాడు. అందుకే భోలేని ఓటీటీ కోసం సంప్రదింపులు జరపగా.. షావలీ కూడా ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దాదాపుగా భోలే షావలీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కి ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఇంక అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు చిత్రంలో హీరోయిన్ గా చేసిన రీచా పనాయ్ కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం ఓకే చెప్పారని లీకులు వస్తున్నాయి.

అలాగే హ్యాపీ డేస్ ఫేమ్ సోనియా దీప్తీ కూడా ఓటీటీ-2 కోసం ఓకే చేసిందని చెబుతున్నారు. సింగర్ పార్వతిని కూడా ఓటీటీ కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్ పేర్లు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీళ్ల ఆరుగురు పేర్లు కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చెబుతున్నారు. అయితే వీరిలో ఎంత మంది ఫైనల్ కావచ్చు? అసలు ఓటీటీ సీజన్ 2 ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం కూడా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పడానికి లేదు. మరి.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కాబోతోందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom