iDreamPost
android-app
ios-app

Big Boss: బిగ్ బాస్‌లోకి పంపిస్తామంటూ మోసం.. సాక్షాలతో సహా బయటపెట్టిన యాంకర్

  • Published Jan 06, 2024 | 8:21 PM Updated Updated Jan 06, 2024 | 8:21 PM

తెలుగు రియాలిటీ, బిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో చూడటమే కాదూ.. అందులోకి వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఈ రియాలిటీ షో ద్వారా నేమ్, ఫేమ్ సంపాదించుకున్నవారున్నారు. వారిలాగే స్టార్స్ కావాలన్న ఉద్దేశంతో చాాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతుంటారు.

తెలుగు రియాలిటీ, బిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో చూడటమే కాదూ.. అందులోకి వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఈ రియాలిటీ షో ద్వారా నేమ్, ఫేమ్ సంపాదించుకున్నవారున్నారు. వారిలాగే స్టార్స్ కావాలన్న ఉద్దేశంతో చాాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాటపడుతుంటారు.

  • Published Jan 06, 2024 | 8:21 PMUpdated Jan 06, 2024 | 8:21 PM
Big Boss: బిగ్ బాస్‌లోకి పంపిస్తామంటూ  మోసం.. సాక్షాలతో సహా బయటపెట్టిన యాంకర్

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతో మందికి పేరు తీసుకురావడంతో పాటు స్టార్ స్టేటస్ ఇచ్చింది. అందుకే ఈ షోలో వెళ్లేందుకు సామాన్యులు సైతం తహ తహలాడుతుంటారు. పల్లవి ప్రశాంత్ లాంటి రైతు బిడ్డ కూడా.. బిగ్ బాస్‌లోకి వెళ్లాలని ఉందంటూ.. పలు వీడియోలు చేసి.. ఆ షో యాజమాన్యం దృష్టిలో పడి..ఎట్టకేలకు సాధించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత వచ్చిన కాస్త పేరు పొగొట్టుకున్నంత పనైంది. అదే వేరే విషయం. అయితే ఈ షోకి వెళ్లాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ టీంలో కొంత మంది అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నారు. దీనికి బాధితురాలు అయ్యింది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి అమ్మినేని.

వనితలో రేలార్ అనే టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరించింది స్వప్న. ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే మిస్టర్.. నమస్తే సేట్ జీ అనే మూవీల్లో నటించింది. ఆమెకు కూడా బిగ్ బాస్‌కి వెళ్లాలని ఆశ.  అయితే బీబీ హౌస్ లోకి పంపిస్తానని ఆ టీం సభ్యుల్లో ఒకరు  తనను మోసం చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా వీడియో ద్వారా బయట పెట్టింది. అందులో ఆమె ఏం చెప్పారంటే ‘బిగ్ బాస్‌కి వెళ్లడమంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే.. నేను కనే కలలో కూడా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు కలగంటా. బిగ్ బాస్ అన్ని సీజన్లు మిస్ అవ్వకుండా చూశా. బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్‌లో‌కి నన్ను పంపిస్తాను అని చెప్పి తమ్మాలి రాజు రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. గత ఏడాది జూన్ నెలలో ఇచ్చాను’ అంటూ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాగితాలను చూపించారు స్వప్న.

‘లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో‌కి వెళతావనే చెప్పారు. వేరో మార్గంలో నేను ట్రై చేసుకుంటా అంటే వద్దు నేనే పంపిస్తాను అని చెప్పి రాజు డబ్బులు అడిగారు. ఎందుకు అని అడిగితే.. పీఆర్, రేటింగ్ పెంచుకోవడం, కాస్ట్యూమ్ కోసం అని చెప్పారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేశారు. దాని కోసం రూ. 25 వేలు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బులు ఇచ్చాను..కానీ బిగ్ బాస్ షోకి వెళ్లలేకపోయా.. అడిగితే.. బిగ్ బాస్ 8లో పంపిస్తాను అని చెప్పారు. అయితే ఓ అగ్రిమెంట్ రాసిచ్చారు. నేను పంపలేకపోయాను.. డిసెంబర్‌లో ఇస్తాను అని చెప్పారు. బిగ్ బాస్ కోసం నేను చాలా మంది దగ్గర నుండి అప్పు చేసి ఇచ్చాను. నా పరిస్థితి బాగోలేదని చెప్పా. అయినా పంపిస్తాను.. వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు’ అని పేర్కొంది.

డిసెంబర్ 20వ తేదీలోగా డబ్బులు ఇస్తానని చెప్పాడు రాజు. ఆ తర్వాత జనవరి 6న ఇస్తానని చెప్పగా.. ఫోన్ చేస్తే.. ‘ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇస్తావా.. ఇచ్చుకో, ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో’ అంటూ సమాధానం చెప్పాడు. బిగ్ బాస్ అనేది ఓ మంచి అవకాశం ఇచ్చే వేదిక అ ది. ‘బిగ్ బాస్ ఆ టీం ఎవరైతే ఉన్నారో.. ఇలాంటి చీడ పురుగులు ఉన్నారు గుర్తించండి. అమౌంట్ ఇచ్చేటప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తారని. నేను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కాస్ట్యూమ్స్ కోసం అవసరమౌతాయని కదా అనుకున్నా. కానీ దయచేసి గమనించండి.  రాజు నుండి నాకు డబ్బులు రావాలి. నాకు సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ 8లో వెళతానని ఆశిస్తున్నా’ అని తెలిపారు స్వప్న చౌదరి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom