iDreamPost
android-app
ios-app

Amardeep Chowdary: అమర్ దీప్‌పై పుస్తకం.. శ్రీముఖి షాకింగ్ రెస్పాన్స్ వైరల్..!

  • Published Dec 30, 2023 | 5:52 PM Updated Updated Dec 30, 2023 | 5:52 PM

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. అయితే ఎంత ఫేమ్ అయ్యింది.. అంత వివాదం నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. హౌస్ నుండి బయటకు రావడంతో రచ్చ జరిగిన సంగతి విదితమే. దీనికి అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది. రన్నరప్‌గా గెలిచిన అమర్ దీప్.. రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు.

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. అయితే ఎంత ఫేమ్ అయ్యింది.. అంత వివాదం నెలకొంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. హౌస్ నుండి బయటకు రావడంతో రచ్చ జరిగిన సంగతి విదితమే. దీనికి అతడు జైలు పాలు కావాల్సి వచ్చింది. రన్నరప్‌గా గెలిచిన అమర్ దీప్.. రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు.

  • Published Dec 30, 2023 | 5:52 PMUpdated Dec 30, 2023 | 5:52 PM
Amardeep Chowdary: అమర్ దీప్‌పై పుస్తకం.. శ్రీముఖి షాకింగ్ రెస్పాన్స్ వైరల్..!

తెలుగు బుల్లితెరపై అలరించిన షో బిగ్ బాస్. ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయ్యి.. ఓ రచ్చ కారణంగా నేషనల్ మీడియా సైతం ఫోకస్ అయ్యే స్థాయికి చేరింది. సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేత కాగా, రన్నరప్‌గా నిలిచాడు టీవీ నటుడు అమర్ దీప్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక.. స్టూడియో బయట జరిగిన విధ్వంసానికి ప్రశాంత్ కారణమయ్యాడన్న ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన సంగతి విదితమే. ఇక రన్నరప్ అమర్ దీప్ కూడా గట్టి పోటీనిచ్చాడు. ఇక గ్రాండ్ ఫినాలే రోజు ప్రశాంత్ ఫ్యాన్స్.. అమర్ దీప్ భార్య, అమ్మ వస్తున్న కారుతో సహా ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై అమర్ దీప్ స్పందించిన సంగతి విదితమే. తననేమైనా చేసుకోవాలంటూ పేర్కొన్నాడు. ఈ సీరియల్ నటుడు.. బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకున్నట్లే.. బిగ్ బాస్ హౌస్‌లో బాగా ఎంటర్ టైన్ చేశాడు. నిజానికి తను బయట ఎలా ఉంటే.. అలానే ఉన్నాడు. తనకు నచ్చింది మాట్లాడేవాడు. ఎగ్రెసివ్ అయ్యేవాడు. దాన్నే ఆసరాగా తీసుకుని శివాజీ లాంటి వాళ్లు అతడిని ట్రోల్ చేశారు. బయట కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, ఇతరులు విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. వాటన్నింటిని భరించిన అమర్ దీప్.. గ్రాండ్ ఫినాలేలో శివాజీని వెనక్కు నెట్టి మరీ రన్నరప్ అయ్యాడు. తాను విన్నర్ కాకపోయినా.. తనకు ఇష్టమైన రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు.

బయటకు వచ్చిన అమర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అతడికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. గతం కన్నా మరింత మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు ఓ ఫ్యాన్ అమర్‌పై పుస్తకాన్ని రాసి.. అతడికి ప్రజెంట్ చేశారు. స్టార్ మా పరివార్ కార్యక్రమంలో ఫ్యాన్.. అమర్‌కు బుక్ అందించాడు. ‘అన్నాఅందరికీ మీరు రన్నర్ కావచ్చు. మాకు మాత్రం ఎప్పటికీ మీరే విన్నరే . అమర్ అన్న తోపు, దమ్ముంటే ఆపు’ అంటూ అరిచి తనకు అమర్ పట్ల ఉన్న అభిమానాన్ని చాటాడు ఫ్యాన్. ‘ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు మీద బుక్ వచ్చిందంటే.. మా తమ్ముడు నిజంగా సాధించాడ్రా’ అంటూ మురిసిపోయింది యాంకర్ శ్రీముఖి. ఇదే కార్యక్రమానికి బిగ్ బాస్ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అర్జున్ అంబటి, ప్రియాంక వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా తనకు కూతురు పుడితే.. తన పేరు, తన భార్య పేరులోని అక్షరాలు కలిసేలా ‘ఆర్కా’అని పెడతానని చెప్పారు అర్జున్. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం ప్రోమో విడుదల అయ్యింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom