Venkateswarlu
Pallavi Prashanth New Video: ఆదివారం అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్లకు సంబంధించి బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Pallavi Prashanth New Video: ఆదివారం అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్లకు సంబంధించి బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Venkateswarlu
రైతు బిడ్డగా బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగులోకి అడుగుపెట్టి.. ఎలాంటి అంచనాలు లేకుండా టైటిల్ సాధించాడు పల్లవి ప్రశాంత్. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తనకంటూ సూపర్ క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఓ సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభ కనబరిచాడంటూ ప్రశాంత్ పేరు జాతీయ మీడియాలో సైతం మారుమోగింది. అయితే, నిన్నటి వరకు పాజిటివ్‌గా తెరపైకి వచ్చిన ఆయన.. ఇప్పుడు కేసుల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం నాడు బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే కార్యక్రమ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే, బిగ్‌బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్న అమర్ దీప్ కారుపై ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు అద్దాలు బద్దలు కొట్టారు. అంతేకాదు! మరో ఇద్దరు సెలెబ్రిటీల కార్లను సైతం వారు పగుల కొట్టారు.
సదరు సెలెబ్రిటీలు ఎంత బతిమాలుతున్నా వినకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు రంగంలోకి దిగి సెలెబ్రిటీలను వారినుంచి విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయిన ప్రశాంత్ ఫ్యాన్స్ తగ్గలేదు. తర్వాత ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో స్టూడియోనుంచి బయటకు వస్తున్న ప్రశాంత్‌కు పోలీసులతో పాటు బిగ్‌బాస్ నిర్వహకులు ఓ సూచన చేశారు. అభిమానులు ఉన్న వైపు నుంచి కాకుండా మరో వైపు బయటకు వెళ్లాలని ఆదేశాలిచ్చారు.
అయితే, ప్రశాంత్ మాత్రం వారి మాటల్ని పెడచెవిన పెట్టాడు. ఓపెన్ టాప్ కారులో పోలీసులు వద్దన్న వైపుకే వెళ్లాడు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల కేసు నేపథ్యంలో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ప్రశాంత్ ఊరికి కూడా ఓ బృందాన్ని పంపారు. పోలీసులు తన కోసం గాలిస్తున్న సమయంలో ప్రశాంత్ ఓ వీడియో విడుదల చేశాడు.. ఆ వీడియోలో.. ‘‘ అన్న నేను మళ్లా వచ్చినా.. మళ్లా వచ్చినందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇలాల బాధ పడే రోజు.
రైతు బిడ్డ గెలిచిండని మా ఊరు ఘన స్వాగతం పలికింది. నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను చాలా సంతోషించాను. ఆ సంతోషం ఎక్కువ సేపు లేకుండా చేయాలని చూస్తున్నారు. బాధగా ఉంది. ఏడుద్దామంటే కూడా నెగిటివ్ చేస్తారని నాకు భయం వేస్తోంది. నా కోసం వచ్చిన వారందరికీ ఫొటోలు, వీడియోలు ఇచ్చాను. మీడియా మిత్రులు నెగిటివ్ చేస్తానని బెదిరిస్తున్నారు. నేను చేసిన తప్పేంటి? రైతు బిడ్డ చేసిన తప్పేంటి? పల్లవి ప్రశాంత్ ఏంటో జనాలకు తెలుసు. పల్లవి ప్రశాంత్ తప్పు చేయడు’’ అని అన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.