iDreamPost
android-app
ios-app

Aata Sandeep: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆట సందీప్‌ భార్య గొప్ప మనసు..

  • Published Dec 31, 2023 | 11:00 AM Updated Updated Dec 31, 2023 | 11:00 AM

ఆట సందీప్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగులో పాల్గొన్నారు. తన మార్కు యాటిట్యూడ్‌తో షోలో టాప్‌ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఇక, ఆట సందీప్‌ భార్య తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు.

ఆట సందీప్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగులో పాల్గొన్నారు. తన మార్కు యాటిట్యూడ్‌తో షోలో టాప్‌ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఇక, ఆట సందీప్‌ భార్య తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు.

  • Published Dec 31, 2023 | 11:00 AMUpdated Dec 31, 2023 | 11:00 AM
Aata Sandeep: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆట సందీప్‌ భార్య గొప్ప మనసు..

ఆట సందీప్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆట డ్యాన్స్‌ షోతో ఆయన తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో సందీప్‌కు సంబంధించిన కొన్ని సీన్ల వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఉన్నాయి. వాటిపై కొన్ని స్పూఫులు కూడా వచ్చాయి. ప్రముఖ బుల్లి తెర రియాలిటీ షో బిగ్‌ బాస్‌ సీజన్‌ 7లో సందీప్‌ పాల్గొన్నారు. తన యాడిట్యూడ్‌ అందరికీ గట్టి పోటీ ఇచ్చారు.  ఆట సందీప్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ అన్న సంగతి తెలిసిందే. ఆయన చాలా సినిమాలకు పని చేశారు.

తాజా సూపర్‌ హిట్‌ మూవీ యానిమల్‌లో కూడా రణబీర్‌ ఇంట్రడక్షన్‌ సీన్లను సందీపే కంపోజ్‌ చేశారు. ఇక, అసలు విషయానికి వస్తే.. ఆట సందీప్‌ భార్య తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు. సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌ కూడా మంచి డ్యాన్సరే.. ఆమె తన భర్తతో కలిసి పలు డ్యాన్స్‌ షోలలో పాల్గొన్నారు. ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తాను చేసిన మంచి పని తాలూకా వీడియోను ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

aata sandeep wife jyothi

చలికాలంలో రోడ్డు పక్క నివసించే వారికి ఆమె దుప్పట్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫుల్‌ వీడియోను తన యూట్యూబ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో.. ‘‘ ఈ రోజు నేను నా ఫ్రెండ్‌ కలిసి ఓ మంచి పని చేయబోతున్నాము. మేమిద్దరం ఖాళీగా ఉన్నపుడు షాపింగ్‌కు వెళతాము.. తినడానికి వెళతాము.. బయటకు వెళతాము.. బేకరీకి వెళతాము. చాలా ప్లేసులకు తిరుగుతాము. కానీ, ఈ రోజు ఓ మంచి పని చేయాలని అనిపించింది. అందుకే నేను నా ఫ్రెండ్‌ కలిసి ఓ ప్లేసుకు వచ్చాము.

చలి చాలా ఎక్కువగా ఉంది. ఇంట్లో ఉన్న మాకే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది పూర్‌ పీపుల్‌ బయట పడుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. వారి పరిస్థితి గురించి ఆలోచిస్తే చాలా బాధ వేసింది. మాకు తోచినంతలో.. మా ఏరియాలో వాళ్లకు బెడ్‌ షీట్లు ఇద్దామని అనుకుంటున్నాము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే.. ఈ వీడియో చూసి.. ఎవరికి వారు వారి ఏరియాల్లోని పూర్‌ పీపుల్‌కు సాయం చేస్తారని భావిస్తున్నాం’’ అని అన్నారు. మరి, బిగ్‌ బాస్‌ 7 కంటెస్టెంట్‌ ఆట సందీప్‌ భార్య జ్యోతీ రాజ్‌ పేద వారికి దుప్పట్లు పంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş