iDreamPost
android-app
ios-app

ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.. నాన్న చనిపోయారు అని కూడా తెలియకుండా..!

  • Published Oct 24, 2023 | 12:01 PM Updated Updated Oct 24, 2023 | 12:01 PM

మొదటి వారమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిన పూజా మూర్తి.. తండ్రి అకాల మరణంతో వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అసలు బిగ్ బాస్ కి వెళ్లడానికి రెండ్రోజుల ముందు ఏం జరిగిందో ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పూజా మూర్తి ఎమోషనల్ అయ్యారు.

మొదటి వారమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిన పూజా మూర్తి.. తండ్రి అకాల మరణంతో వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అసలు బిగ్ బాస్ కి వెళ్లడానికి రెండ్రోజుల ముందు ఏం జరిగిందో ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పూజా మూర్తి ఎమోషనల్ అయ్యారు.

  • Published Oct 24, 2023 | 12:01 PMUpdated Oct 24, 2023 | 12:01 PM
ఆ రోజు రాత్రి జరిగింది ఇదే.. నాన్న చనిపోయారు అని కూడా తెలియకుండా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అన్నీ ఉల్టా పుల్టాగానే జరుగుతున్నాయి. ఏడువారాలు అమ్మాయిలే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఏడోవారం హౌస్ నుంచి పూజా మూర్తి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే మొదటివారమే హౌస్ లోకి వెళ్లాల్సిన పూజా.. తండ్రి అకాలమరణంతో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఐడ్రీమ్ మీడియాకి పూజామూర్తి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్ బాస్ కి వెళ్లడం తన తండ్రి చివరి కోరిక అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

“నేను సెప్టెంబర్ 3నే బిగ్ బాస్ కి వెళ్లాల్సింది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. అంతా రెడీ చేసుకుని.. లగేజ్ కూడా ప్యాక్ చేసి పంపేశాను. రెండ్రోజుల ముందు రాత్రి 1కి అమ్మ కాల్ చేసింది. నాన్నకు ఊపిరి ఆడటంలేదు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం అని చెప్పింది. నాన్నతో బావగారు హాస్పిటల్ కి వెళ్లారు. నేను ఆయనకు కాల్ చేసి.. ఏం జరిగింది అని అడిగాను. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది.. కానీ, ట్రై చేస్తామని డాక్టర్స్ చెప్పారు అన్నారు. నేను కంగారు పడకూడదు అని అలా చెప్పారు. మళ్లీ కాల్ చేసినా అదే చెప్పారు. నేను తీసుకోలేను నిజం చెప్పండి అని అడిగాను. అప్పుడు నాన్న గారు చనిపోయారు అని చెప్పారు. అంబులెన్స్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అంట. కారులోనే నాన్నను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కొంచం దూరం వెళ్లగానే ఆయన చనిపోయారంట. ఒక ఆస్పత్రికి తీసుకెళ్తే కళ్లు చూసి చనిపోయారు అని చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందని చెప్పారు. షాక్ ట్రీట్మెంట్ ట్రైం చేస్తామన్నారు. అలా షాక్ ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది.

కార్డియాక్ అరెస్ట్ వల్లే నాన్న చనిపోయారు. నేను డాడీ కోసం వెళ్తున్నాను అని ఎందుకు అన్నాను అంటే. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని తెలియగానే నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నారు. ఫ్యామిలీ వీక్ కి మీరు రావచ్చు అని చెప్పాను. నేను  వస్తాను అన్నారు. మా నాన్న, నేను చాలా క్లోజ్ గా ఉంటాం. డబ్బులు, ఫేమ్ అందరికీ కావాలి. నేను మా నాన్న ఆనందం కోసం వెళ్లాను. నన్ను బిగ్ బాస్ హౌస్ లో నన్ను చూడాలి అనేది నాన్న కోరిక. నేను వెళ్లాలా వద్దా అని డైలామాలో ఉన్నాను. నేను వెళ్లిపోతే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? ఏం చేయాలి అర్థం కాలేదు. అలాంటి సమయంలో మా అమ్మే వెళ్లమని చెప్పింది. నువ్వు బిగ్ బాస్ కి వెళ్లడం మీ నాన్న చివరి కోరిక వెళ్లు అని చెప్పింది. మా నాన్న నన్ను బిగ్ బాస్ హౌస్ లో చూసి ఆనందించే ఉంటారు” అంటూ పూజా మూర్తి ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ పూజా మూర్తి ఫుల్ ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom