iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: జైలునుంచి విడుదలైన పల్లవి ప్రశాంత్‌.. ఫ్యాన్స్‌ సంతోషం!

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కోర్టు తాజాగా, ప్రశాంత్‌కు బెయిల్‌ మంజూరు చేసింది...

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. కోర్టు తాజాగా, ప్రశాంత్‌కు బెయిల్‌ మంజూరు చేసింది...

Pallavi Prashanth: జైలునుంచి విడుదలైన పల్లవి ప్రశాంత్‌.. ఫ్యాన్స్‌ సంతోషం!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా చోటు చేసుకున్న గొడవలు విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ జీవితాన్ని తలకిందులు చేశాయి. బిగ్‌బాస్‌ షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర ఆయన ఫ్యాన్స్‌ అరాచకానికి పాల్పడ్డారు. కొన్ని ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రశాంత్‌ను ఏ1గా చేర్చారు. తాజాగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు సైతం పంపారు. ప్రశాంత్‌ తల్లిదండ్రులు అతడి విడుదలను కోరుతూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు.

విచారణ జరిపిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాదాపు 15 వేల రూపాయల పూచీకత్తుతో ఈ బెయిల్‌ను ఇచ్చింది. రెండు షూరిటీలతో ఈ బెయిల్‌ లభించింది. ప్రశాంత్‌ అరెస్ట్‌ అయిన 48 గంటల్లోనే అతడి లాయర్లు బెయిల్‌ వచ్చేలా చూసుకున్నారు. ప్రశాంత్‌ శనివారం సాయంత్రం జైలునుంచి విడుదల అయ్యాడు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు బెయిల్‌ రావటం.. జైలు నుంచి విడుదల అవ్వటంపై ఆయన ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రశాంత్‌ అరెస్ట్‌ అయిన కేసు వివరాలు!..

గత ఆదివారం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే జరిగింది. విజేత ఎవరో డిసైడ్‌ అయ్యే తరుణం కాబట్టి.. షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గరకు పెద్ద ఎత్తున కంటెస్టెం‍ట్ల ఫ్యాన్స్‌ వచ్చారు. వీరిలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ ఎక్కువ మంది ఉన్నారు. షోలో విజేతగా నిలిచింది ప్రశాంత్‌ అని తెలిసిన తర్వాత వారు సంతోషం వ్యక్తం చేశారు. వారు అంతటితో ఆగలేదు. రన్నర్‌ అప్‌గా నిలిచిన అమర్‌ దీప్‌ స్టూడియో నుంచి బయటకు వస్తుండగా.. ఆయన కారును ముట్టడించారు.

కారుపై రాళ్లతో దాడి చేశారు. లోపల ఉన్నవారిపై కూడా దాడి చేయటానికి ప్రయత్నించారు. దాదాపు అరగంట పాటు అమర్‌ దీప్‌ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల రంగంలోకి దిగి కారును భద్రత నడుమ పక్కకు పంపించారు. తర్వాత కూడా ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ తమ రచ్చ కొనసాగించారు. మరికొంత మంది సెలెబ్రెటీల కార్లను ధ్వంసం చేశారు. ఏకంగా కొన్ని ఆర్టీసీ బస్సులను పాడు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రశాంత్‌కు పలు ఆదేశాలు ఇచ్చారు.

గొడవ జరుగుతున్న ప్రాంతం నుంచి కాకుండా.. వేరే వైపు నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు. అయితే, ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ ఉన్న వైపునుంచే బయటకు వెళ్లారు. తమ ఆదేశాలు భేఖాతారు చేయటంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రశాంత్‌ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు బెయిల్‌ ఇచ్చింది. మరి, ప్రశాంత్‌ బెయిల్‌పై బయటకు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.