iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తో మారిన సెలబ్రెటీల వాయిస్!

  • Published Dec 21, 2023 | 1:52 PM Updated Updated Dec 21, 2023 | 2:01 PM

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు అత్యుత్సాహంతో కంటెస్టెంట్ల కార్ల మీద దాడి చేసి నానా రభస చేశారు. దాడి జరిగిన రోజున విమర్శలు చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు మాత్రం అతడికి మద్దతిస్తున్నారు. ఆ వివరాలు..

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు అత్యుత్సాహంతో కంటెస్టెంట్ల కార్ల మీద దాడి చేసి నానా రభస చేశారు. దాడి జరిగిన రోజున విమర్శలు చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు మాత్రం అతడికి మద్దతిస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 21, 2023 | 1:52 PMUpdated Dec 21, 2023 | 2:01 PM
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తో మారిన సెలబ్రెటీల వాయిస్!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విన్నర్ ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని.. మిగతా కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేయడమే కాక.. లేడీ కంటెస్టెంట్లతో కూడా తప్పుగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆర్టీసీ బస్ మీద కూడా రాళ్లు రువ్వారు. ప్రశాంత్ ర్యాలీ తీస్తే.. పరిస్థితి మరింత చేజారుతుందని భావించిన పోలీసులు.. అతడిని రహస్య మార్గం గుండా బయటకు పంపడమే కాక.. ఎక్కడా ఆగవద్దని సూచించారు. కానీ ప్రశాంత్ మాత్రం పోలీసులు మాటలు వినకుండా అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావడంతో.. పరిస్థితి చేజారింది. ఈ క్రమంలో ప్రశాంత్ మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇక గొడవ జరిగిన రోజు ప్రశాంత్ మీద, అతడి అభిమానులు మీద విమర్శలు చేసిన సెలబ్రిటీలు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. నాడు ప్రశాంత్ మీద విమర్శలు చేసిన వారు.. నేడు మాత్రం పాపం ప్రశాంత్, మా తమ్ముడికి మద్దతివ్వండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అమర్ కారు మీద పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేయడంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ స్పందిస్తూ.. నేనైతే కారుతో గుద్దు పడేసేవాడిని.. వ్యక్తి మీద అభిమానం ఉండాలి కానీ.. ఇలాంటి ఉన్మాదం పనికిరాదు అన్నాడు.

కానీ తాజాగా అదే సోహైల్ ప్రశాంత్ పాపం అమాయకుడు అంటూ మరో వీడియో విడుదల చేశాడు. నేను ముందు నుంచి ప్రశాంత్ కి మద్దతిస్తూనే ఉన్నాను. కేవలం అభిమానుల వల్లనే ప్రశాంత్ కి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ ప్రేమ, అభిమానం వల్లనే ఈ స్థాయికి వచ్చాడు. కానీ నేడు వాడు సక్సెస్ ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేడు. జైలుకు వెళ్లాడు. కేవలం మీ వల్లే. ప్రశాంత్ ని తప్పుదోవ పట్టించిన వారి వల్లే.. ఈ పరిస్థితి వచ్చింది అంటూ ప్రశాంత్ కి మద్దతిస్తూ వీడియో విడుదల చేశాడు.

అలానే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అశ్విని కూడా పల్లవి ప్రశాంత్ కి మద్దతిచ్చింది. పాపం మా తమ్ముడిని అరెస్ట్ చేశారు.. అతడికి మద్దతివ్వండి అని కోరింది. గొడవ జరిగిన నాడు తన కారు పగలకొట్టారని.. అందుకు బాధ్యులైన వారి మీద కేసు ఫైల్ చేసింది అశ్విని. ఇక జరిగిన గొడవకు అభిమానులే కారణమంటున్నారు సెలబ్రిటీలు. పల్లవి ప్రశాంత్ అమాయకుడని.. కానీ కొందరు అతడిని తప్పుదోవ పట్టించారని.. వారి వల్లనే నేడు ప్రశాంత్ జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తింది అంటున్నారు. గొడవ జరిగిన రోజున విమర్శలు చేసిన సెలబ్రిటీలు.. ప్రశాంత్ అరెస్ట్ తర్వాత.. అతడికి మద్దతిస్తున్నారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/