iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: హౌస్ లో సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

  • Published Sep 16, 2023 | 11:50 AM Updated Updated Sep 16, 2023 | 11:50 AM
  • Published Sep 16, 2023 | 11:50 AMUpdated Sep 16, 2023 | 11:50 AM
Bigg Boss 7: హౌస్ లో సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో హౌస్ మొత్తం గొడవలు, రాజకీయాలతో అట్టుడికిపోతోంది. మాయాస్త్రా టాస్క్, రెండో పవరాస్త్రా టాస్కుల్లో కంటెస్టెంట్స్ మొత్తం నానా యాగి చేశారు. ఎవరికి వారు వాళ్ల స్ట్రాటజీనే గొప్పది అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు హౌస్ లో పరిస్థితి ఎలా ఉందంటే.. పేరు పెట్టి పిలిచినా కేకలు వేసేటట్లు ఉన్నారు. ఎవరి గ్రూపు సభ్యులతో వాళ్లు చనువుగా ఉంటూ.. ఆటాడుతున్నారు. అయితే ఈ వీక్ లో నాగార్జునాకు చాలా పెద్ద పనే ఉంది. ఎందుకంటే హౌస్ లో తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.

ఈ వారం పవరాస్త్ర పోటీదారులను ఎంచుకోమన్నప్పుడు.. రతిక చేసిన రచ్చ, గౌతమ్- ప్రిన్స్ యావర్ గొడవ, పవరాస్త్రాన్ని కొట్టేయడం, ఎవరి బుదులైనా వెళ్లిపోతాను అని శివాజీ చెప్పడం, వెళ్లిపోతానని ప్రిన్స్ యావర్ ఏడవడం, రతిక- ధామిని గొడవ.. ఇలా చాలానే విషయాలు ఉన్నాయి. మరి.. వీటిలో నాగార్జున ఏ టాపిక్స్ టచ్ చేస్తారు? ఎవరికి సర్ది చెబుతారు? గౌతమ్ తో ప్రిన్స్ యావర్ కి క్షమాపణ చెప్పిస్తారా లేదా? ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్స్ పై వాడీ వేడి చర్చ జరుగుతోంది. అయితే వీకెండ్ అనగానే ఇంకో ప్రశ్న కూడా బాగా వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? ప్రేక్షకులు ఈ ప్రశ్న సమాధానం తెలుసుకోవడం కోసం చాలా ఎదురుచూస్తూ ఉంటారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వీక్ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్లు మరెవరో కాదు.. షకీలా, టేస్టీ తేజ. వీళ్లద్దరే ప్రస్తుతం ఓటింగ్ లీస్ట్ లో ఉన్నారంటూ అనధికారిక ఓటింగ్ ద్వారా తెలుస్తోంది. టేస్టీ తేజ సంగతి పక్కన పెడితే.. షకీలా కచ్చితంగానే డేంజర్ జోన్ లో ఉంటారని చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, షకీలా మాత్రం వయసు రీత్యా అంత యాక్టివ్ గా పాల్గొనలేకపోతున్నారు. అయినా.. పాల్గొన్న పుల్ రాజా పుల్ టాస్క్ లో మాత్రం ఇరగదీశారు. అంతేకాకుండా గొడవలు జరిగినప్పుడు మంచి పాయింట్స్ మాట్లాడి కౌంటర్లు ఇస్తారు. రతిక విషయంలో ఇప్పటికే చాలాసార్లు షకీలా హైలెట్ అయ్యారు. టాస్క్ అప్పుడు ఆమె గొడవ చేయగా.. కంటెంట్ కోసమే ఇలా చేస్తుంది అంటూ సూటిగా మాట్లాడింది.

అంతేకాకుండా హౌస్ లో గేమ్ ని అర్థం చేసుకున్న అతి కొద్ది కంటెస్టెంట్స్ లో షకీలా కూడా ఒకరు. కానీ, వయసు రీత్యా.. ఆమె హౌస్ లో కొనసాగడం ఇబ్బంది అనే చెప్పాలి. అలాగే రాను రాను గేమ్ ఇంకా ఊపందుకుంటుంది కాబట్టి షకీలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఈ అన్నీ కారణాలతో షకీలా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే టేస్టీ తేజ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్న టేస్టీ తేజ ఆ పేరును ఓట్లలోకి మార్చుకోలేకపోతున్నాడు అనే అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి టేస్టీ తేజ హౌస్ లో చాలా మంచి ఎంటర్ టైనర్. అందరితో కలిసిపోయే వ్యక్తి. అంతేకాకుండా ఏదైనా విషయం ఉంటే సూటిగా మాట్లాడతాడు. అంతేకాకుండా రతికాతో తేజాకు అస్సలు పడటం లేదు. అలాగే శోభాశెట్టి- తేజ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. శోభా ఏడుస్తుంటే తేజా ఓదారుస్తూ కనిపించాడు.

ఒకవేళ ఆఖరికి షకీలా- తేజ డేంజర్ జోన్ లోకి వస్తే.. కచ్చితంగా తేజ సేవ్ అవతాడనే చెప్పాలి. షకీలానే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, త్రిబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డబుల్ ఎలిమినేషన్ వరకు అయితే నమ్మచ్చు. కానీ, మరీ ఎంత ఉల్టా పుల్టా అయినా కూడా త్రిబుల్ ఎలిమినేషన్ అంటే.. మరీ ఓవర్ అవుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేసినా కూడా ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు. అంతాకాకుండా ఈ వీకెండ్ లో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా అంబటి అర్జున్ పేరు వినిపిస్తోంది. మరి.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom