iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu Tasty Teja: 15 సినిమాల్లో అవకాశం.. అసలు నిజం చెప్పిన టేస్టీ తేజా..

  • Published Dec 18, 2023 | 9:34 AM Updated Updated Dec 18, 2023 | 9:34 AM

బిగ్ బాస్ తర్వాత తనకు 15 సినిమాల్లో అవకాశం వచ్చిందంటూ తేజా చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమేనా అంటే దీనిపై క్లారిటీ ఇచ్చాడు తేజా. తనేం చెప్పాడంటే..

బిగ్ బాస్ తర్వాత తనకు 15 సినిమాల్లో అవకాశం వచ్చిందంటూ తేజా చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమేనా అంటే దీనిపై క్లారిటీ ఇచ్చాడు తేజా. తనేం చెప్పాడంటే..

  • Published Dec 18, 2023 | 9:34 AMUpdated Dec 18, 2023 | 9:34 AM
Bigg Boss 7 Telugu Tasty Teja: 15 సినిమాల్లో అవకాశం.. అసలు నిజం చెప్పిన టేస్టీ తేజా..

బిగ్ బాస్ అవకాశం అనగానే చాలా మంది ఎగిరి గంతేస్తారు. దాని వల్ల వారి కేరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావిస్తారు. కానీ వాస్తవంగా చూసుకుంటే మాత్రం అది నిజం కాదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ ద్వారా.. కెరీర్ టర్న్ అయిన వాళ్లు ఒక్కరు కూడా లేరు. ఏదో నామమాత్ర గుర్తింపు ఉన్న సెలబ్రిటీలు మాత్రం.. అందరికి తెలుస్తారు.. కాస్త క్రేజ్ సంపాదించుకుంటారు. కానీ ఆల్రేడీ గుర్తింపు ఉన్న వాళ్లకి బిగ్ బాస్ వల్ల పెద్దగా ఓరిగేది ఏం లేదని అర్థం చేసుకోవచ్చు. విన్నర్ గా గెలిచిన వాళ్లు కూడా పెద్దగా అవకాశాలు అందింపుచ్చుకుని.. కెరీర్లో దూసుకుపోతున్నారా అంటే అదీ లేదు. కానీ తాజాగా సీజన్ 7లోని ఓ కంటెస్టెంట్ కి మాత్రం సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయంట. అవును టేసీ తేజాకి ఏకంగా 15 సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇది నిజమేనా.. ఇంతకు తేజా ఏమన్నాడంటే..

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజా. హౌజ్ లో ఉన్నన్ని రోజులు టాస్కుల సంగతి ఏమో కానీ.. ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చి.. ప్రేక్షకులను అలరించాడు. అలానే శోభాతో తన బాండ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మధ్యలోనే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన తేజా.. తన పాత కెరీర్ నే కొనసాగిస్తున్నాడు. ఇలా ఉండగా.. టేస్టీ తేజాకి ఏకంగా 15 సినిమాల్లో ఆఫర్ వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. పైగా ఈ విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో తేజానే చాలా గర్వంగా చెప్పాడు.

tasty teja got 15 movie offers

దాంతో అందరూ ఇప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరికి ఈ రేంజ్ లో అవకాశాలు రావడం జరగలేదు.. తేజా లక్ బాగుంది అనుకున్నారు. అతడికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. కొందరైతే ఏకంగా ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పారట. అయితే టేస్టీ తేజాకు 15 సినిమాల్లో అవకాశం అనే మాట అవాస్తవం. అదేంటి.. తేజానే చెప్పాడు కదా అంటే అది జస్ట్ ప్రోమో కోసం కట్ చేసిన వీడియో. అసలు వాస్తవం వేరే ఉంది. 15 సినిమాల్లో అవకాశాలు అనే దానిపై టేస్టీ తేజా క్లారిటీ ఇచ్చాడు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి వెళ్లిన తేజా.. అక్కడ సందీప్ మాస్టర్.. రూం నుంచి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ పెట్టారు. ఈ సందర్భంగా టేస్టీ తేజా, సందీప్ మాస్టర్ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలో టేస్టీ తేజాని ఉద్దేశించి.. బాస్.. నీకు 15 సినిమాల్లో అవకాశం వచ్చిందా? హీరోగా చాన్స్ వచ్చిందా.. నమ్మొచ్చంటావా? అని వరుస కామెంట్లు రావడంతో.. రియాక్ట్ అయిన తేజా అసలు మ్యాటర్ చెప్పుకొచ్చాడు. “నిజమే బ్రో నాకు నిజంగానే 15 సినిమాల్లో ఆఫర్ వచ్చింది కానీ.. హీరోగా కాదు.. లీడ్‌ రోల్ అంతకంటే కాదు.. కమెడియన్‌ ఆఫర్లు వచ్చాయి. అయినా 15 సినిమాల్లో ఆఫర్ వచ్చిందంటే హీరో అనుకుంటున్నారేంటి.. నాకు హీరోగా అవకాశాలు వస్తాయా. కమెడియన్‌గా 15 సినిమాల్లో అవకాశం రావడం మాత్రమే నిజం. కానీ నేను అందులో నాలుగు సినిమాలకు ఓకే చేశాను. అవి కూడా కొత్త సినిమాలు. నా అదృష్టం బాగుండి 15 సినిమాల్లో అవకాశం వచ్చిందన్న ముక్కే ప్రోమోలో వేశారు. నాలుగు సినిమాల్లో చేస్తున్నట్టు కూడా చెప్పాను. అది వేయలేదు. నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాను” అంటూ అసలు విషయం చెప్పాడు.

తేజా ఓకే చేసిన సినిమాల్లో.. డిసెంబర్‌లో రెండు సినిమాలు షూటింగ్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో మరో రెండు సినిమాలు షూటింగ్‌ మొదలవుతాయి. మెయిన్ స్ట్రీమ్ హీరోలతోనే చేస్తున్నా.. వాటి గురించి అంతకంటే ఏం చెప్పలేను’ అంటూ దండం పెట్టేశాడు టేస్టీ తేజా. దాంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ నాలుగు సినిమాల్లో కూడా తేజాకు మంచి పాత్రలు లభిస్తే.. ఇక అతడి కెరీర్ మలుపు తిరుగుతుంది అంటున్నారు. మరి చూడాలి.. ఏం జరుగుతుందో.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş