iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ఆరోవారం కూడా అమ్మాయే.. నయనీ పావని ఎలిమినేటెడ్!

  • Published Oct 14, 2023 | 1:00 PM Updated Updated Oct 14, 2023 | 1:00 PM
  • Published Oct 14, 2023 | 1:00 PMUpdated Oct 14, 2023 | 1:00 PM
Bigg Boss 7 Telugu: ఆరోవారం కూడా అమ్మాయే.. నయనీ పావని ఎలిమినేటెడ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 నిజంగానే ఉల్టా పుల్టాగానే సాగుతోంది. ముఖ్యంగా వీకెండ్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అని ఈ వారం కూడా ఆడియన్స్ వెతుకులాట మొదలు పెట్టారు. అయితే లీకుల వీరులు చెబుతున్న పేరు చూసి బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ వారం పోటుగాళ్లకు చెందిన నయనీ పావనీ ఎలిమినేట్ కాబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ పేరు వినగానే అందరూ షాకవుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ అనగానే అందరూ ఫన్ కంటే కూడా ఎలిమినేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు అంటూ రెండ్రోజుల ముందు నుంచే వెతుకులాట మొదలు పెడతారు. అనధికారిక పోలింగ్, అనఫిషియల్ పేజీల్లో లీకులు ఏం వస్తున్నాయో అంటూ వెతికేస్తారు. అలా ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ వెతికేస్తున్నారు. వారికి నయనీ పావనీ పేరు కనిపంచడంతో షాకవుతున్నారు. ఎందుకు అంత షాకవుతున్నారు అంటే.. పోటుగాళ్లలో బాగా ఆడుతున్న ఇద్దరిలో నయనీ పావనీ కూడా ఒకరు. మొదటి రోజు నుంచి హౌస్ లో తన వాయిస్ ని బలంగానే వినిపిస్తోంది. నామినేషన్స్ సమయంలో కూడా ఆటగాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పింది.

కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో కూడా అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చింది. ఇంక అందం, డాన్సుల విషయంలో నయనీ పావనీకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మరోవైపు ప్రిన్స్ యావర్ తో లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ చేసేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. అతడిని కెప్టెన్ చేసి చాలా పాజిటివ్ అయ్యింది. నిజానికి ఎలిమినేషన్ శోభా శెట్టి- నయనీ పావనీ మధ్యకు వచ్చిందంట. శోభా ఇప్పటికే ఆరు వారాలుగా హౌస్ లో ఉంది. పాజిటివ్, నెగిటివ్ ఆటను బాగా ఆడుతోంది. కొత్తగా వచ్చిన నయనీ- శోభా మధ్య ఎలిమినేషన్ అంటే కచ్చితంగా నయనీనే ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఓట్ల విషయంలో శోభా కాస్త బలంగానే ఉంటుందని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)

హౌస్ లో అసలే కళ తగ్గిపోతోంది.. బాయ్స్ హాస్టల్ అవుతోంది అని హోస్ట్ నాగార్జున బాధ పడుతుంటే.. బిగ్ బాస్ మాత్రం వరుస పెట్టి అమ్మాయిలను హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు. ఐదోవారం అమ్మాయి అన్నప్పుడే చాలా మంది ఆడియన్స్ గగ్గోలు పెట్టారు. అలాంటిది మళ్లీ హౌస్ నుంచి అమ్మాయి ఎలిమినేషన్ అనగానే ప్రేక్షకులు ఉసూరు మంటున్నారు. అది కూడా నయనీ పావనీ పేరు వినగానే మరింత నిరుత్సాహ పడుతున్నారు. ఉల్టా పుల్టా అన్నారు గానీ.. మరీ ఇంతగానా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది అధికారికంగా తెలియాలి అంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే. ఏది ఏమైనా హౌస్ నుంచి నయనీ పావనీ ఎలిమినేట్ అయితే మాత్రం చాలామంది డిజప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి.. నయనీ పావనీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio