iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: 3 వారాలకి ధామినీకి ఇచ్చింది ఎన్ని లక్షలంటే?

  • Published Sep 25, 2023 | 5:28 PM Updated Updated Sep 25, 2023 | 5:28 PM
  • Published Sep 25, 2023 | 5:28 PMUpdated Sep 25, 2023 | 5:28 PM
Bigg Boss 7 Telugu: 3 వారాలకి ధామినీకి ఇచ్చింది ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా మారుతోంది. హౌస్ లో ప్రస్తుతం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆట ఇంకా 12 వారాలు కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా గ్రాండ్ లాంఛ్ 2.0 కూడా ఉండబోతోందని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే హౌస్ లో ఆటకు సంబంధించి మంచి రెస్పాన్స్ వస్తోంది. హౌస్ లో ఎవరు అయితే ఆడుతున్నారో.. ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వారు మాత్రమే ఉంటున్నారు. ఏ మాత్రం తక్కువ పర్ఫార్మ్ చేస్తున్నారు అనిపించినా ప్రేక్షకుల ఓట్లు పడటం లేదు. అందుకు ధామినీని ఉదాహరణగా చెప్పచ్చు.

సింగర్ ధామినీ మూడో వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. హౌస్ లో ఆమె కనీసం 7, 8 వారాలు అయినా ఉంటాననే నమ్మకంతో వెళ్లినట్లు చెప్పింది. కానీ, అనూహ్యంగా మూడో వారమే బయటకు వచ్చేసింది. అయితే ఈ విషయాన్ని తాను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె హౌస్ లో ఆడిన తీరు ప్రజలకు నచ్చలేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని.. అంగీకరించింది కూడా. ముఖ్యంగా ఆమె చేసిన పొరపాటు ఏంటంటే.. గేమ్ మీద ఫోకస్ చేయకుండా.. కంటెస్టెంట్స్ కి దగ్గరవ్వడం, వాళ్లకి వండి పెట్టడం మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపించింది. ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ధామినీ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసింది. ఆల్టర్నేటివ్ డేస్ లో మాత్రమే వంట చేసింది. కానీ, అదమీ వర్కౌట్ కాలేదు.

ఇప్పుడిప్పుడే గేమ్ స్ట్రాటజీలు మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. వస్తూ వస్తూ ప్రియాంక జైన్ కు మంచి సలహా కూడా ఇచ్చింది. వంట చేసుకుంటూ కేవలం కిచెన్ లో మాత్రమే ఉండిపోవద్దు. వంటలక్క అనే ముద్ర వేయించుకోవద్దు అంటూ సజీషన్ ఇచ్చింది. అయితే ఉన్నన్ని రోజులు మాత్రం ధామినీ ఎంతో బాగా అందరితో కలిసిపోయింది. మనసులో ఏదున్నా ఓపెన్ గా మాట్లాడింది. అందరిలా మాస్కు వేసుకుంది అనే మాట మాత్రం తెచ్చుకోలేదు. నటించకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే ధామినీకి హౌస్ లో ఇబ్బందులు తెచ్చిందనే చెప్పాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పిన మాటలు కూడా ఆమెకు బ్యాక్ ఫైర్ అయ్యాయి.

ఏం మాయరోగం వచ్చింది అంటే అలాంటి హార్ష్ ల్యాంగ్వేజ్ వాడద్దు అని చెప్పింది. మళ్లీ ఆమే ఇంగ్లీష్ లో అసభ్య పదాలు చెప్పింది. అలాంటి కొన్ని కొన్ని విషయాలు ధామినీకి ఇబ్బందులు తెచ్చాయనే చెప్పాలి. అయితే హౌస్ లో ఇన్ని వారాలు ఉన్నందుకు గానూ.. ధామినీకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. అయితే ధామినీకి వారానికి రూ.2 లక్షల చొప్పున.. 3 వారాలకు సింగర్ ధామినీకి రూ.6 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా 3 వారాలకే వచ్చేస్తానని తెలియక.. మొదటి రోజు వచ్చిన రూ.35 లక్షల ఆఫర్ ధామినీ వదులుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆ ఆఫర్ తీసుకుని ఉంటే చక్కగా రూ.35 లక్షలు ఆమెకు దక్కేవి అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి ధామినీ ఇలా 3 వారాలకే ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు కూడా నమ్మలేదు. కాబట్టే ఆమె అప్పుడు ఆ ఆఫర్ తీసుకోలేదు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom