iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: చొక్కా విప్పిన గౌతమ్.. అరుస్తూ రెచ్చిపోయిన శోభా!

Bigg Boss 7 Telugu: చొక్కా విప్పిన గౌతమ్.. అరుస్తూ రెచ్చిపోయిన శోభా!

బిగ్ బాస్ హౌస్ లో ఎంత అరిస్తే అంత హైలెట్ అవుతాం అనమాట. మొన్న గనుక అరిచే టాస్కు శోభా శెట్టికో.. గౌతమ్ కో ఇచ్చుంటే కచ్చితంగా ఇద్దరూ గెలిచే వాళ్లు. ఈపాటికి కన్ఫామ్డ్ హౌస్ మేట్స్ అయిపోయేవాళ్లు. లేదంటే వీళ్ల గొడవలేంటో? వీళ్ల గేమ్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఆటలో సత్తా చూపించండి అంటే.. ఒకాయన చొక్కావిప్పితే.. ఇంకొకామె గొంతు చించుకుంటోంది. ప్రేక్షకులు మాత్రం అరె బాబు వీళ్లని ఎవరికైనా చూపించండ్రా అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు ఈ సీజన్ లో ఉన్న వాళ్లకి బిగ్ బాస్ అంటే ఒక ఐడియా ఉండి వచ్చారో.. అరిసేసి కప్పులు కొడదామని వచ్చారో అర్థం కావడం లేదు.

పేరు పెట్టి పిలిచినా.. నామినేట్ చేసేలా ఉన్నారు. ముఖం చూసి నవ్వితే.. నన్ను చూసి నవ్వుతావా అని గొడవకు దిగేలా ఉన్నారు. ఇంతక ముందు ఆటలో మధ్యలో గొడవలు జరిగేవి. అదేంటో ఈ సీజన్లో మాత్రం గొడవల మధ్య ఆట జరుగుతోంది. ఉల్టా పుల్టా అన్నారు గానీ.. ఇలా బస్తీమే సవాల్ లా చేస్తారు అనుకోలేదు. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఏం చేసినా.. కచ్చితంగా గొడవ అయితే జరుగుతోంది. లేదంటే.. ముగ్గురు కంటెస్టెంట్స్ ని మూడో పవరాస్త్రం కోసం సెలక్ట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ల మీద అభిప్రాయం ఏంటని.. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అడిగాడు. అక్కడితో ఆగాడా? అవన్నీ మళ్లీ కంటెండర్లకు వినిపిస్తున్నాడు.

మూడో చెవికి వినిపించదు కదా అని వీళ్లేమో కడుపులో ఉన్నది కక్కేసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రిన్స్ యావర్ విషయంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. యావర్.. టేస్టీ తేజ మీద రెచ్చిపోయాడు. రతికానేమో.. కిచెన్ లో ప్రిన్స్ యావర్ కి బటర్ పూసి ఐస్ చేసింది. ఇప్పుడు శోభాశెట్టి వంతు వచ్చింది. ఆమెను ఎవరు డిసర్వింగ్ కాదని చెప్పారో వాళ్ల కారణాలు వినిపించారు. వాటిలో గౌతమ్ ఆమెని అన్ డిసర్వింగ్ అంటూ ఓటేశాడు. దాంతో శోభాశెట్టి రెచ్చిపోయింది. అసలు ఏం సాధించావని అంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది.. వెంటనే చొక్కా విప్పేశాడు. నీ బాడీ చూడటానికి నేను ఇక్కడికి రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే టాస్క్ లో తన బైసిప్ కి తగిలిన గాయాన్ని చూపేందుకు గౌతమ్ చొక్కా విప్పాడు. నువ్వు భక్వాస్ రీజన్ చెప్పావ్ అంటూ గౌతమ్ పై రెచ్చిపోయింది. నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తానంటూ నిప్పులు చెరిగింది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు.

శోభా లాన్ లోకి వెళ్లిన తర్వాత గౌతమ్ ఆమె ముందుకు వెళ్లి నా బాడీ నా ఇష్టం అంటూ జిమ్ బరువులు ఎత్తాడు. అయితే వీళ్ల మధ్య గొడవ చూస్తే ప్రేక్షకులు మొట్ట మొదటి మాట ఒకటే పిచ్చి అంటారు భయ్యా దీన్ని. ఈ గొడవలో ఇద్దరితీ తప్పు ఉంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు ప్రకారం గౌతమ్ తన అభిప్రాయాన్ని ఇచ్చాడు. దానిని శోభాశెట్టి స్పోర్టివ్ గా తీసుకోవాలి. నిజానికి గౌతమ్, శుభ శ్రీ తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని.. అది తెలిసిన వెంటనే వారిపై చిందులు తొక్కాలని ముందే ప్రిపేర్ అయింది. అలాగే గౌతమ్ కూడా ఒకరిని అనర్హులు అనేటప్పుడు ప్రోపర్ రీజన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తన రీజన్ అవతలి వాళ్లు తీసుకోలేదు అంటూ కామ్ గా తప్పుకోవాలి. బిగ్ బాస్ చెప్పాడు నేను చేశాను అంటే సరిపోతుంది. ఆమె అరిచిందని ఇతను కూడా అరిస్తే.. ఏమొస్తుంది. గొంతు నొప్పెడుతుంది. కాబట్టి గౌతమ్ కాస్త ఆలోచించి ఆడితే బాగుంటుంది. శోభాశెట్టి కూడా అరిచే ముందు ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. మరి.. గౌతమ్- శోభాశెట్టి గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş