iDreamPost
android-app
ios-app

శోభాతో శివాజీ గొడవలో తప్పు ఎవరిది?

  • Published Nov 17, 2023 | 11:27 AM Updated Updated Nov 17, 2023 | 12:03 PM

బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు సర్వ సాధారణం. ఏమీ లేకపోయినా కూడా సరదాగా అయినా గొడవలు పడతారు. మరి.. శివాజీ- శోభాకి జరిగిన గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు సర్వ సాధారణం. ఏమీ లేకపోయినా కూడా సరదాగా అయినా గొడవలు పడతారు. మరి.. శివాజీ- శోభాకి జరిగిన గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

  • Published Nov 17, 2023 | 11:27 AMUpdated Nov 17, 2023 | 12:03 PM
శోభాతో శివాజీ గొడవలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా సాగుతోంది. హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గట్టిగానే యుద్ధాలు జరిగాయి. ఎవరూ కూడా ఎక్కడా తగ్గలేదు. అయితే యావర్ బ్రెయిన్, ఫిజికల్ గేమ్ ముందు హౌస్ మేట్స్ తేలిపోయారు. అర్జున్ మీద విజయం సాధించి రేసులోకి వచ్చిన తర్వాత యావర్ వరుసగా మూడు టాస్కుల్లో విజయం సాధించాడు. చివరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్ కూడా అయ్యాడు. అయితే ఈ టాస్కుల సందర్భంలో ఒక పెద్ద గొడవ కూడా జరిగింది. అది శివాజీ- శోభాకి మధ్య జరిగింది. అయితే ఆ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో గొడవలే ఎక్కువ జరుగుతూ ఊంటాయి. ఆ గొడవల మధ్యలో ఆట జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో శివాజీ గట్టిగానే గొడవలు పెట్టుకుంటున్నాడు. సాధారణంగా ఎపిసోడ్ చూసిన వాళ్లకు ఎందుకు అసలు వీళ్లు గొడవ పడుతున్నారు? అనే అనుమానం కలగకమానదు. టేక్ ఏ బౌ అనే టాస్కు జరుగుతోంది. ఈసారి ప్రత్యర్థులను బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. శివాజీ, ప్రియాంకలతో యావర్ తలపడాల్సి ఉంటుందని చెప్పాడు. అందుకు అందరూ విల్లును పట్టుకుని దాని మీద ఇనుప బంతులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి తర్వాత పెడుతూ వాటిని కింద పడకుండా ఆపాలి. అలా ఎక్కువసేపు ఎవరైతే ఆపుతారో వాళ్లే టాస్కులో గెలుస్తారు.

అయితే ఈ టాస్కులో బాల్ కింద పడుతున్న సమయంలో దానిని చేత్తో పట్టుకుని మళ్లీ పైన పెట్టుకోవచ్చు. అలా అందరూ బాల్ కింద పడుతున్న సమయంలో పట్టుకుని పైన పెట్టారు. అయితే పల్లవి ప్రశాంత్ కు రూల్స్ అర్థంకాక ఒక దగ్గర తప్పు మాట చెప్పాడు. ఆ తప్పును పట్టుకుని యావర్, శివాజీ ప్రశ్నించారు. అవన్నీ పక్కన పెడితే శివాజీ ఎక్కువసేపు ఆ బాల్స్ ని పట్టుకున్నాడు అని బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత అదే పాయింట్ ని శోభా కూడా చెప్పింది. అయితే అకారణంగా శివాజీ టాస్కు ముగిసిన తర్వాత శోభాతో గొడవ పెట్టుకున్నాడు. అతను కావాలనే వాంటెడ్ గా పెట్టుకున్నాడు అని అందరికీ అర్థమైంది. అయితే అలా మానిప్యులేట్ చేసి శోభాతో రిజల్ట్ మార్పించాలి అని భావించి కూడా ఉండచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆ గొడవలో మాత్రం నూటికి నూరు శాతం శివాజీతే తప్పు.

అది స్ట్రాటజీ అయినా తప్పు మాత్రం శివాజీదే. శోభా తనని తాను స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంది. ఎక్కడా కూడా ఆమె తగ్గలేదు. తర్వాత శివాజీ కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. తన ఎలిమినేషన్ కి తానే పునాదులు వేసుకుంటోంది అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి శోభా చేసింది తప్పు కానప్పుడు ఆమె ఎలిమినేషన్ కు ఇది కారణం కాదు. అలాగే ఈ ఎపిసోడ్ లో యావర్- అర్జున్ తలపడిన సమయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడాడు. ఆ విషయాన్ని చాలామంది చూశారు. కానీ, ఎవరూ కూడా పాయింట్ అవుట్ చేయలేదు. మళ్లీ.. యావర్ తాను ఫౌల్ గేమ్ ఆడితే తానే ఒప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాంటి విజయం తనకి అవసరం లేదు అన్నాడు. అయితే అతనికి తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా.. అతను మాత్రం ఫౌల్ గేమ్ ఆడాడు. మరి.. శివాజీ- శోభా మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio