iDreamPost
android-app
ios-app

శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా!.. విన్నర్ ను మించిన సంపాదన!

  • Published Dec 17, 2023 | 4:11 PM Updated Updated Dec 17, 2023 | 4:11 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ నటుడు శివాజీ భారీ పారితోషకాన్ని అందుకున్నారట. వారానికి ఏకంటా అన్ని లక్షలు అందుకుని విన్నర్ కంటే ఎక్కువ సంపాదించారట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ నటుడు శివాజీ భారీ పారితోషకాన్ని అందుకున్నారట. వారానికి ఏకంటా అన్ని లక్షలు అందుకుని విన్నర్ కంటే ఎక్కువ సంపాదించారట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Dec 17, 2023 | 4:11 PMUpdated Dec 17, 2023 | 4:11 PM
శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా!.. విన్నర్ ను మించిన సంపాదన!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 7. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 15 వారాల పాటు సాగిన ఈ ప్రోగ్రాం ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 7 ముగియనున్నది. నేడు ఈ సీజన్ విజేతను మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే ఫైనలిస్టుగా నిలిచి ఎలిమినేట్ అయిన నటుడు శివాజీకి సంబంధించిన రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. వారానికి ఏకంగా రూ. 4 లక్షలు పుచ్చుకున్నాడంట. దీంతో బిగ్ బాస్ సీజన్ 7 లో జాక్ పాట్ కొట్టిన కంటెస్టెంట్ గా శివాజీ నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ మొదలై అన్ని ఎపిసోడ్స్ అంతే ఆసక్తిని రేకెత్తించింది. టైటిలే లక్ష్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ తమ తమ వ్యూహాలతో గేమ్ ను రక్తికట్టించారు. కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకున్న గొడవలు, భావోద్వేగాలు బిగ్ బాస్ ప్రోగ్రాంకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి. బిగ్ బాస్ హౌజ్ లో నటుడు శివాజీ పెద్దన్నలా వ్యవహరించిన తీరుకు అతనిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ లోని కంటెస్టెంట్లకు సూచనలిస్తూ.. తను గేమ్ ఆడిన తీరుకు అంతా శివాజీనే ఈ సీజన్ విన్నర్ అని ఓ అంచనాకు వచ్చారు. కానీ బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్స్ తో కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ కు కూడా షాకిచ్చాడు.

కాగా ఇప్పుడు నటుడు శివాజీ రెమ్యునరేషన్ పై జోరుగ చర్చ జరుగుతోంది. శివాజీ వారానికి రూ. 4 లక్షలు అందుకున్నారట. బిగ్ బాస్ సీజన్ 7లో అత్యధిక పారితోషకం అందుకున్న కంటెస్టెంట్ గా శివాజీ నిలిచారని సమాచారం. హౌజ్ లో 15 వారాలపాటు ఉన్న శివాజీ వారానికి నాలుగు లక్షల చొప్పున మొత్తం 60 లక్షలు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెమ్యునరేషన్ బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ. బిగ్ బాస్ విజేతకు రూ. 50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. విన్నర్ అందుకోబోయే ప్రైజ్ మనీతో పోల్చితే శివాజీ అందుకున్న రేమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది. శివాజీ విన్నర్ ని మించి సంపాదించాడని ఇది తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. మరి శివాజీ అందుకున్న రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom