iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ ఫ్యాన్స్ కి అమర్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల వార్నింగ్.. సాక్షం చెప్తానంటూ..

  • Published Dec 25, 2023 | 9:10 PM Updated Updated Dec 25, 2023 | 9:10 PM

Naresh Lolla Warns Palalvi Prashanth Fans: బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించిన విషయాలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమర్ దీప్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

Naresh Lolla Warns Palalvi Prashanth Fans: బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించిన విషయాలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమర్ దీప్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

  • Published Dec 25, 2023 | 9:10 PMUpdated Dec 25, 2023 | 9:10 PM
ప్రశాంత్ ఫ్యాన్స్ కి అమర్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల వార్నింగ్.. సాక్షం చెప్తానంటూ..

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు ఎంతో అట్టహాసంగా ముగిసింది. కానీ, ఆ షో రాజేసిన మంటలు మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నాయి. డిసెంబర్ 17న జరిగిన అల్లర్లు, దాడులకు సంబంధించి నెట్టింట ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్టై జైలుకు కూడా వెళ్లాడు. 48 గంటల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ దాడి చేసిన వాళ్లు తన ఫ్యాన్స్ కాదని.. అతనికి దాడులకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రశాంత్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ ఫ్రెండ్ నరేశ్ లొల్ల మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాడు. ప్రశాంత్ అంతా తెలుసంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా తాను కోర్టులో సాక్షం చెప్తానంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

నరేశ్ లొల్ల.. అమర్ దీప్ ఎంతో మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. అమర్ బిగ్ బాస్ కి వెళ్లినప్పటి నుంచి రన్నర్ గా తిరిగి వచ్చే వరకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. అమర్ కు సపోర్ట్ చేసినందుకు నరేశ్ లొల్లను కూడా నెట్టింట ట్రోల్ చేశారు. వాటికి నరేశ్ ఎప్పుడూ భయపడలేదు. అంతే సమర్థంగా తిప్పికొడుతూ ఉండేవాడు. అయితే తాజాగా నరేశ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకి తెలియదు అంటున్న దాడి విషయం, ప్రశాంత్ ఫ్యాన్స్ చేయాలనుకున్న దారుణాలు పల్లవి ప్రశాంత్ కి ముందే తెలుసు అంటూ కామెంట్స్ చేశాడు. “మేము సాయంత్రం 5.30కే లోపలికి వెళ్లాం. 8.30 గంటలకు షూట్ అయిపోయింది. అమర్ రన్నర్- ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ప్రశాంత్ ని బజ్ ఇంటర్వ్యూ కోసం లోపలికి పంపారు. అమర్ నన్ను హగ్ చేసుకుని అడిగాడు.. అంతా ఓకే కదా అని. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.  బయట పరిస్థితి గురించి మేము పెట్టుకున్న బౌన్సర్లు చెప్పారు. బయట ఒక్కొక్కడు పెట్రోల్ బాటిల్లు, కోడిగుడ్లు, టమాటాలు, కర్రలు తెచ్చుకున్నారని విని షాకయ్యాం.

అమర్ తో నేను సైలెంట్ గా ఉండు. దేనికీ రియాక్ట్ కాకు అని చెప్పాను. టార్చ్ లైట్లు వేసుకుని అమర్ కోసం వెతుకుతుంటే.. అతని ముఖం దాచుకోమని చెప్పడానికి నేనే సిగ్గు పడ్డాను. బయట రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. లోపల ఆడవాళ్లు ఉన్నారని చెప్తుంటే.. అమర్ లం** కొ*కా.. నరేశ్ లొల్ల లం** కొ*కా అంటూ తిడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న లగేజ్ మొత్తం లాక్కెళ్లారు. నేను ఆ కారుని అద్దెకు తెచ్చాను. అద్దాలు పగలగొట్టి ఆ కారు డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోయారు. ఆ పేపర్లు వాళ్ల శవాల మీద వేసుకుంటారా? వాటిని ఏం చేసుకుంటారు అసలు? మమ్మల్ని 30 నిమిషాలు వెంబడించారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వెళ్లాం. వెనుక కారులో అమర్ నాన్న ఉన్నారు. ఆయన పక్షవాతం వచ్చిన వ్యక్తి. ఆయనకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత. అమర్ ని ఏదోచేస్తాం అంటున్నారు. అమర్ ని నేనే తీసుకొస్తాను ఏం చేస్తారు?

మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. కేసు నమోదు అయ్యింది కదా.. కోర్టులో నేనే సాక్షం చెప్తాను. అమర్ ని గనుక విన్నర్ ని చేస్తే అన్నపూర్ణ స్టూడియోస్ తగలబెట్టేవాళ్లా?” అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా బయట పరిస్థితి మొత్తం ప్రశాంత్ తాను చెప్పానన్నాడు. అమర్ నేను మంచి ఫ్రండ్స్, మా మధ్య ఏమీ లేదు.. ఎలాంటి గొడవలు చేయకండని చెప్పమంటే.. బయటకు వచ్చి ఏదేదో మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లు ఆడింది అంతా ఫేకా అంటూ నరేశ్ లొల్ల ప్రశ్నించాడు. ఇంక కేసు విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం చేయడమే కాకుండా.. 6 ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ దాడులకు సంబంధిచి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ప్రశాంత్, అతని సోదరుడుని అరెస్టు కూడా చేశారు. వాళ్లు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరి.. ప్రశాంత్ కి అంతా తెలుసు అంటూ నరేశ్ లొల్ల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio