Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ హీట్ మొదలవుతుంది. ఈ వారం రతికా రోజ్ తన ఆటను మొదలు పెట్టింది. నామినేషన్స్ లో శోభా శెట్టి, ప్రియాంక జైన్ లపై విరుచుకుపడింది. అయితే వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ హీట్ మొదలవుతుంది. ఈ వారం రతికా రోజ్ తన ఆటను మొదలు పెట్టింది. నామినేషన్స్ లో శోభా శెట్టి, ప్రియాంక జైన్ లపై విరుచుకుపడింది. అయితే వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సోమవారం అనగానే ఆట మంచి ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా వీకెండ్ ఎపిసోడ్ అయినా మిస్ అవుతారేమో గానీ.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్లు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఈ సీజన్ లో నామినేషన్స్ అనగానే దాదాపు రెండ్రోజులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన నామినేషన్స్ కూడా అంతే ఉత్కంఠను రేకెత్తించాయి. ఈ ఎపిసోడ్ లో రతికా రోజ్ విశ్వరూపం దాల్చింది. శోభా శెట్టి, ప్రియాంకలపై విరుచుకుపడింది. అయితే ఆమె చెప్పిన పాయింట్స్ లో నిజమెంత? నామినేషన్స్ కరెక్టేనా? అసలు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? అన్నీ పాయింట్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం.
రతికా రోజ్ రెండోసారి హౌస్ లోకి వచ్చిన తర్వాత అస్సలు ఆట ఆడలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రతికా రోజ్ కూడా ఒప్పుకుంది. అలాగే కుటుంబసభ్యులు కూడా టాప్ 5లో రతికాకి నాలుగో స్థానం ఇచ్చారు. ఆట మొదలు పెట్టాలి అని కూడా క్లియర్ గా చెప్పారు. అలాగే నామినేషన్స్ కి ముందు శివాజీ కూడా కరెక్ట్ స్టాండ్ తీసుకో.. ఫన్నీగా చేస్తావా? సీరియస్ గా చేస్తావా? ఎలాగైనా కూడా దొరక్కుండా చేయ్.. నీకు చాలా ప్లస్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. శివాజీ మాటలను కాస్త ఎక్కువగానే తలకు ఎక్కించుకుంది. అందుకే నామినేషన్స్ లో కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యింది. రతికా రోజ్.. శోభా, ప్రియాంకలను నామినేట్ చేసింది. శోభాకి చెప్పిన పాయింట్స్ మాత్రం కాస్త వాలిడ్ గా అనిపించాయి.
“నువ్వు కెప్టెన్ గా ఫెయిల్ అయ్యావ్. ఎంటర్ టైన్మెంట్, టాస్కుల్లో కూడా నువ్వు ఫెయిల్ అయ్యావ్. రాజమాతల టాస్కులో కూడా నువ్వు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదు. కెప్టెన్ గా ముందుండాల్సిన నువ్వు అందరికంటే లేటు రియాక్ట్ అవుతున్నావ్. ఇంక నువ్వు ఏమైనా అనుకో” అంటూ రతికా రోజ్ చెప్పుకొచ్చింది. అందుకు శోభా చాలా కూల్ గా రియాక్ట్ అయ్యింది. నువ్వు ఏదైతే కోరుకుని ఇలా చేస్తున్నావో.. నేను ఆ కంటెంట్ ఇవ్వను. నేను అస్సలు రియాక్ట్ అవ్వను అంటూ కామ్ గా ఉంది. తన పాయింట్స్ తాను చెప్పుకుంది. నేను కెప్టెన్ గా బాగానే చేశాను అంది. నాగార్జున గారి ముంది బాగుంది అని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? అని ప్రశ్నించింది. ఇంక తర్వాత ప్రియాంకను నామినేట్ చేసింది. ప్రియాంకకు చెప్పడానికి నిజానికి రతికా దగ్గర పాయింట్స్ లేవు. స్టార్టింగ్ లో అదే పాయింట్ చెప్పి దొరికిపోయింది. ప్రియాంకకు “మొన్ని టాక్సిసిటీ అని నాకు చాక్లెట్ ఎందుకు ఇచ్చావ్? అంటే ఎవరు నామినేట్ చేస్తే వాళ్లకు ఆ చాక్లెట్ ఇస్తావా? నువ్వు, శోభా కలిసి అశ్వినీని ఏడిపించారు కదా.. దానిని టాక్సిసిటీ అంటారు. మీకు ఇవ్వాలి చాక్లెట్” అంటూ చెప్పింది.
అయితే ప్రియాంక విషయంలో మాత్రం ఎలాంటి పాయింట్స్ చెప్పలేదు. కానీ, ఆన్సర్ చెప్పు అంటూ కేకలు వేసింది. శోభా నామినేషన్ ని కచ్చితంగా వాలిడ్ గానే తీసుకోవాలి. కానీ, ప్రియాంక విషయంలో మాత్రం పాయింట్స్ లేకుండానే నామినేట్ చేసినట్లు అనిపించింది. ఇంక రతికా వర్సెస్ శోభా- ప్రియాంకల విషయంలో తప్పు ఎవరిది అంటే? రతికా కాస్త ఓవర్ గానే రియాక్ట్ అయ్యింది. కంటెంట్ కోసం తాపత్రయ పడినట్లు క్లియర్ గా అనిపించింది. కానీ, ఆమె ఏదో ఒకటి ఆడటానికి ప్రయత్నిస్తోందని ఆనంద పడచ్చు. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే మొదటి ఎపిసోడ్.. రతికా కాస్తో కూస్తో గేమ్ ఆడింది. పాయింట్స్ సిల్లీగా ఉన్నా కూడా రతికా గేమ్ స్టార్ట్ చేసింది అని చెప్పాలి. మరి.. రతికా రోజ్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.