iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: మతులు పోగొడుతున్న బిగ్ బాస్ రతిక.. వైరల్ ఫొటోలు!

Bigg Boss 7: మతులు పోగొడుతున్న బిగ్ బాస్ రతిక.. వైరల్ ఫొటోలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందర్భం ఏదైనా బాగా వైరల్ అవుతున్న పేరు రతికా రోజ్. హౌస్ లో ఆట, మాట, పాట విషయంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంక గేమ్, కంటెంట్ విషయం గురించి ఆమెకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా అయితే కంటెంట్ వస్తుంది.. ఎలా అయితే హైలెట్ అవుతాం అనే విషయం తెలిసే రతిక గేమ్ ఆడుతోంది అనే భావన కలుగుతుంది. ఇంక హౌస్ లో ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. నవ్వుతూ తీసుకుంటోంది. అలాగే అవసరమైన సమయంలో గొడవలకు కూడా వెనకాడటం లేదు. మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ కావాలో.. రతికా అలాంటి కంటెంట్ ఇస్తూ ఎంటర్ టైన్ చేస్తోంది.

రతికా రోజ్ పేరు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత హైలెట్ అవుతోంది గానీ.. నిజానికి బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలే. ప్రియా పేరుతో పటాస్ కామెడీ షోలో తనదైన పంచులతో ప్రేక్షకులను అలరించింది. అలాగే హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అందం, టాలెంట్ ఉన్నా ఎందుకో తనకు గుర్తింపు రావడం లేదని స్వయంగా రతికా రోజ్ వెల్లడించింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై.. తన ఇమేజ్ ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ షో ద్వారా అయినా తనకు బ్రేక్ వస్తోందని ఆశిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి రతికా రోజ్ పేరు బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, రీల్స్ అన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో గతంలో పోస్ట్ చేసిన ఫొటోలను ఇప్పుడు షేర్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

రవిక లేకుండా చీర చుట్టుకుని రతికా రోజ్ చేసిన ఫొటోషూట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలా ఆమె దిగిన ఫొటోలు చూసి తెగ పొగిడేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ ఆమెకు తప్పకుండా బ్రేక్ ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రతికా హౌస్ లో తన ఒక్కో టాలెంట్ ని బయట పెడుతోంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో రతికా రోజ్ చాలా చక్కగా డాన్స్ చేసింది. హీరోయిన్ కావాలంటే డాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలని అందరికీ తెలుసు. ఆ పాయింట్ హైలెట్ చేసింది. అలాగే ధామినీ ఎలిమినేట్ అయి వెళ్తున్న సమయంలో పాట పాడి అందరికీ షాకిచ్చింది. నిజానికి సింగర్ ధామినీతో పాటు ఆమెలా శ్రావ్యంగా పాడింది. రియల్ సింగర్ ఎలిమినేట్ అయినా కూడా హౌస్ లో ఒక సింగర్ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ బిగ్ బాస్ అవకాశం రతికా రోజ్ కి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş