iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: దిగజారడంలో ఒకరిని మించి ఒకరు అన్నట్లు రతిక- శివాజీ!

Bigg Boss 7 Telugu: దిగజారడంలో ఒకరిని మించి ఒకరు అన్నట్లు రతిక- శివాజీ!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మాస్క్ వేసుకుని ఆడినా అది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒకానొక సమయంలో అది పూర్తిగా తొలగిపోవాల్సిందే. అది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువు అయింది. మరోసారి రతికా- శివాజీ విషయంలో తెలిసొచ్చింది. రతికా రోజ్ పల్లవి ప్రశాంత్ విషయంలో వెన్నుపోటు పొడిచింది అని అందరికీ తెలిసిందే. కానీ, తన తప్పులేదు అన్నట్లు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడింది. అయితే శివాజీ రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్న పాయింట్ తో ఆమె ఏకీభవించలేదు. ఆ విషయానికి సంబధించి శివాజీతో గొడవకు కూడా దిగింది. ఆ తర్వాత అసలు పాయింట్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో శివాజీ కూడా మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అనే పాయింట్ రైజ్ అయింది.

రతికా రోజ్ ఇప్పటివరకు ప్రశాంత్ విషయంలోనే కాకుండా ప్రిన్స్ యావర్, శివాజీ విషయంలో ప్లేట్ ఫిరాయించింది. ప్రిన్స్ యావర్ కి కూడా చనువు ఇచ్చి తప్పు చేశాను అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పటివరకు వేరే గ్రూపుగా ఉన్న అమర్ దీప్, ఆట సందీప్ తో కలిసి శివాజీకి పొగ పెట్టడం ప్రారంభించింది. కాయిన్ ఫ్లిప్ చేయడంలో రతికా తర్వాతే ఎవరైనా అనే భావన కలిగేలా ప్రవర్తించింది. శివాజీని అన్నా అన్నా అంటూ ఇన్ని రోజులు చెప్పి.. తన గురించి ఉన్న మాట చెప్పినందుకు కటీఫ్ చెప్పేసింది. తనవైపు తప్పు పెట్టుకుని సుద్దపూస తరహాలో మాటలు చెప్పడం ప్రేక్షకులను సైతం ఇరిటేట్ చేస్తోంది. ఆమెకు బయట వస్తున్న నెగిటివిటీని అంచనా వేయకుండా.. గేమ్ ఆడుతోంది. కంటెంట్ ఇవ్వడమే అజెండాగా సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఆ ఇంపాక్ట్ గురించి ఆలోచిచడం లేదు. ఆమె పనులు తన క్యారెక్టర్ ని తానే తక్కువ చేసుకోవడం అవుతోంది.

శివాజీ గురించి మాట్లాడుతూ.. “రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని ఎలా అంటాడు? నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేయడం కాదా? మీరంతా ప్రియాంక చెప్పిందే చేస్తున్నారు, మీ అందరినీ ప్రియాంక జైన్ ఆడిస్తోందని ఆయన నాతోనే చెప్పారు. అందరిదీ సేఫ్ గేమ్ అని చెప్పి.. ఆయనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. హౌస్ లో ల్యాగ్ గేమ్ ఆడుతూ.. అందరితో మంచిగా ఉంటున్నట్లు నటిస్తాడు. వీకెండ్ నాగార్జున గారు అడగ్గానే బాబుగారు అది అలా అండి.. ఇది ఇలా అండి అంటూ మనల్ని పిచ్చోళ్లని చేస్తాడు” అంటూ రతికా రోజ్ శివాజీ గురించి చెప్పింది. ఇక్కడ శివాజీ డబుల్ గేమ్ మరోసారి బయటపడింది. ప్రియాంక, అమర్ దీప్, సందీప్ వాళ్లతో ముందు మాత్రం అమ్మా, నాన్న అంటూ మాట్లాడుతూ.. వాళ్లు లేని సమయంలో వారి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ గురించి అమర్ దగ్గర చేసిన కామెంట్స్ పెద్ద నెగిటివీటినీ మూట కట్టాయి.

ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు అతను మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అనే పాయింట్ రైజ్ చేస్తున్నాయి. అలాగే నామినేషన్స్ లో శివాజీ ఏకపక్షంగా గౌతమ్ పాయింట్స్ సిల్లీ అని చెప్పడం కూడా నెగిటివిటీని తీసుకొస్తున్నాయి. ఎందుకంటే యావర్ విషయంలో గౌతమ్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ, శివాజీ సిల్లీ అనడం.. అదే మాటను సందీప్- శోభా కూడా ఏకీభవించడం కరెక్ట్ గా అనిపించలేదు. అదే విషయాన్ని గౌతమ్ కూడా గట్టిగా చెప్పాడు. శివాజీ లాయర్ లాగా ఒకరి వైపే మాట్లాడుతున్నాడు అంటూ సీరియస్ అయ్యాడు. నువ్వు ఎంత అంటూ మీదకు వెళ్లినట్లు ప్రోమోలో ఉంది. అయితే ఇలా మీ మీదకు వస్తే మీకు ఎలా ఉంటుంది? యావర్ నా మీదకు అలాగే వచ్చాడు అనే పాయింట్ చెప్పడానికి అలా వెళ్లినట్లు చూపించారు. శివాజీ ఎప్పుడూ నేను ఎవరివైపు ఉండను అంటూ చెప్తాడు. కానీ, ఇక్కడ మాత్రం గౌతమ్ రీజన్స్ సిల్లీ అంటూ యావర్ ని సేవ్ చేయాలని చూశాడు. ఈ పాయింట్స్ ని బట్టే శివాజీ మరీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు. మరి.. రతికా- శివాజీ డబుల్ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş