iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో అండర్ వేర్ తో.. ఇదేం దరిద్రంరా బాబు..!

  • Published Sep 04, 2023 | 6:16 PM Updated Updated Sep 04, 2023 | 6:16 PM
  • Published Sep 04, 2023 | 6:16 PMUpdated Sep 04, 2023 | 6:16 PM
బిగ్ బాస్ హౌస్ లో అండర్ వేర్ తో.. ఇదేం దరిద్రంరా బాబు..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పటిలాగానే టీవీలకు అతుక్కు పోయారు. ఈసారి కూడా బిగ్ బాస్ ని మీరు 24 గంటలు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చూడచ్చు. ఎప్పటిలాగానే 1 అవర్ ఎపిసోడ్లు కూడా వస్తాయి. ఈసారి ఉల్టా పుల్టా కావడంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెరిగింది. వచ్చిన కంటెస్టెంట్లు కూడా దానికి తగ్గట్లుగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక కోవకు చెందిన వారిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే వీళ్లందరిలో ఒక్కరు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. అతను మరెవరో కాదు ప్రిన్స్ యావర్. మనోడి ప్రవర్తనే కాస్త భిన్నంగా ఉంటోంది. దీని వల్ల ఇంట్లోని సభ్యులు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు.

బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచే ప్రిన్స్ యావర్ కు పంచులు పడుతూ వచ్చాయి. స్టేజ్ మీద ఉన్నప్పుడు నాగార్జున నీ పేరు యావరా? ఓవరా? అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇంట్లోకి డిఫరెంట్ గా వెళ్లమంటే.. షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్ చూపించుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి నాగార్జున గడ్డి పెట్టేదాకా ఆ షర్ట్ వేసుకోలేదు. బట్టలు ఊడదీసుకుంది చాలు.. ఇంక బట్టలు వేసుకో అంటూ నవ్వుతూనే చురకలు అంటించాడు. ఆ రోజుకు అక్కడితో అయిపోయిందిలే అనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ కు ఉదయం నుంచి మళ్లీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈసారి వ్యాయమం పేరుతో ప్రిన్స్ యావర్ అర్ధ నగ్నంగా తిరగడం ప్రారంభించాడు. జిమ్ షార్ట్స్ వేసుకుని హౌస్ లో కలియ తిరుగుతున్నాడు.

ఉదయం నుంచి కాసేపు వ్యాయామం చేయడం.. కాసేపు ఆ షార్ట్స్ తోనే ఇంట్లోని సభ్యులతో మాట్లాడటం, పనులు చేయడం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే.. ఇంట్లో ఉన్న ఆడ లేడీస్ చుట్టూ కూడా ఆ అండర్ వేర్ తోనే తిరుగుతున్నాడు. బిగ్ బాస్ అనేది ఫ్యామిలీ షో నాయనా.. ఇలాంటి బల ప్రదర్శనలు ఏంటి? అంటూ ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇంక్ హౌస్ లో వాళ్ల పరిస్థితి అయిచే చెప్పనక్కర్లేదు. నిన్న హౌస్ లోకి రాగానే యావర్ ని చూసి శివాజీ ఏంటి బట్టలు లేవా? ఇలా తిరుగుతున్నావ్ అంటూ సెటైర్ వేశాడు. గెస్టుగా వచ్చిన నవీన్ పోలిశెట్టి కూడా బిగ్ బాస్ పాపం మనవాడికి మంచి బట్టలు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Prince Yawar (@princeyawar)

ఇక రెండో రోజు అయితే టేస్టీ తేజ.. యావర్ నువ్వు బట్టలు వేసుకుంటావా? లేక నేను బట్టలు తీసేయాలా? అంటూ ప్రశ్నించాడు. అందరూ ఇంతలా చెబుతున్నా మరి.. ప్రిన్స్ యావర్ ఎందుకు అలా తిరుగుతున్నాడు అనేది ఎవరికీ తెలయని విషయం. అయితే ప్రిన్స్ యావర్ హిందీ బిగ్ బాస్ ఎక్కవగా చూసి ఇలా ఇన్ స్పైర్ అయ్యాడేమో? అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ దరిద్రాన్ని మేము చూడలేం అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలు చాలు ఇప్పటికే ఎక్కువైంది.. వెళ్లి బట్టలేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోడల్, యాక్టర్ గా అతనికి అది ఎబ్బెట్టుగా అనిపించకపోయినా.. చూసే వాళ్ల గురించి కూడా ఆలోచించాలిగా యావరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో ఓ కండల వీరుడు దొరికాడు. వద్దన్నా బల ప్రదర్శన చేసేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Top Views (@topviews_official)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio