iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu Prince Yawar: జాక్ పాట్ కొట్టిన యావర్.. అమర్ తో సమానంగా సంపాదించాడు కదా

  • Published Dec 18, 2023 | 12:22 PM Updated Updated Dec 18, 2023 | 12:22 PM

టాప్ 6లొో నిలిచిన యావర్ తెలివైన నిర్ణయంతో జాక్ పాట్ కొట్టాడు. దాంతో మిగిలిన వారి కన్నా ఎక్కువే సంపాదించాడు. ఇంతకు అతడు ఎన్ని లక్షలు సంపాదించాడంటే..

టాప్ 6లొో నిలిచిన యావర్ తెలివైన నిర్ణయంతో జాక్ పాట్ కొట్టాడు. దాంతో మిగిలిన వారి కన్నా ఎక్కువే సంపాదించాడు. ఇంతకు అతడు ఎన్ని లక్షలు సంపాదించాడంటే..

  • Published Dec 18, 2023 | 12:22 PMUpdated Dec 18, 2023 | 12:22 PM
Bigg Boss 7 Telugu Prince Yawar: జాక్ పాట్ కొట్టిన యావర్.. అమర్ తో సమానంగా సంపాదించాడు కదా

ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 సుమారు 100 రోజులకు పైగానే సాగి.. ఆదివారం నాడు ముగిసింది. డిసెంబర్ 17న గ్రాండ్ గా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించారు నిర్వాహకులు. ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచినా ప్రిన్స్ యావర్.. ఈ సీజన్ లో జాక్ పాట్ కొట్టాడు. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కన్నా ప్రిన్స్ యావరే ఎక్కువ గెలిచాడు. ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకుని.. జాక్పాట్ కొట్టాడు. టాప్ 6లో మిగిలిన యావర్.. ఒక్క నిర్ణయంతో.. మిగాత కంటెస్టెంట్స్ కన్నా గట్టిగానే సంపాదించాడు. గోల్డెన్ సూట్ కేస్ లోని 15 లక్షల రూపాయలతో పాటుగా 15 వారాల పారితోషికం కలుపుకుని.. బాగానే సంపాదించాడు యావర్. ఆ వివరాలు..

సాధారణంగా తెలుగు షోలో పాల్గొంటున్నారు అంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్‌బాస్ షోలో అయితే దీన్ని పక్కాగా అమలు చేస్తారు. కానీ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చిన ప్రిన్స్ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు ఈ రూల్ ని పక్కనబెట్టేశారు. హౌజ్ లో ఉన్న సమయంలో చాలా త్వరగానే యావర్ శివాజీ బ్యాచ్‌లోకి చేరిపోయాడు. దాంతో ప్రతి సారి ఎలిమినేషన్ నుంచి బయటపడుతూ వచ్చి.. 15 వారాల పాటు హౌజ్ లో కొనసాగగలిగాడు.

మొత్తంగా ఎంత సంపాదించాడంటే..

అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్.. విజేతగా నిలిచి.. కప్ కొట్టే అవకాశం అస్సలు లేదు. ఈ విషయం యావర్ కి కూడా తెలుసు. దాంతో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్‌లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు. అలానే హౌజ్ లో ఉన్నందుకు యావర్.. వారానికి రూ.లక్షన్నర రెమ్యునరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ. 22.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.37.5 లక్షల వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తోంది. అమర్ దీప్ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే పొందితే.. యావర్ తెలివిగా ఆలోచించి.. 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకోవడంతో.. అమర్ తో సమానంగా సంపాదించినట్లు అయ్యింది.

పేరుకు నటుడు అయినా సరే తన కుటుంబానికి చాలా అప్పులు ఉన్నాయని… హౌజ్ లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు యావర్. తనకు డబ్బు చాలా అవసరమని కూడా అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్లే నాగ్.. రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ చేయగా తీసుకున్నాడు. పైగా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్‌కేసు ఆఫర్‌కే ఓటు వేసేసరికి.. ట్రోఫీ రేసు నుంచి తప్పుకొన్నాడు. ఒక్క నిర్ణయంతో.. టాప్ కంటెస్టెంట్లతో సమానంగా సంపాదించాడు యావర్.

Jojobet GirişmeritbetcasibomTophillbet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbetMadridbetcasibom giriştipobet girişganobetpokerklasjojobetCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş