iDreamPost
android-app
ios-app

వీడియో: షకీలాకు ఏమైంది? కంగారులో ఇంటి సభ్యులు!

  • Published Sep 08, 2023 | 7:52 PM Updated Updated Sep 08, 2023 | 7:52 PM
  • Published Sep 08, 2023 | 7:52 PMUpdated Sep 08, 2023 | 7:52 PM
వీడియో: షకీలాకు ఏమైంది? కంగారులో ఇంటి సభ్యులు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలి వారంలోనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎవరికి వాళ్లు హౌస్ లో ప్లేస్ పక్కా చేసుకోవాలి అని గట్టిగానే ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ చెప్పిన పవరాస్త్ర కోసం శక్తికి మించి కష్టపడుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కావడం కోసం మాత్రమే కాదు.. 5 వారాల ఇమ్యునిటీ కోసం కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే ఈ ఇమ్యునిటీ వస్తే 5 వారాలు హౌస్ లో వాళ్లని ఎవరూ నామినేట్ చేయలేరు. అలాగే ఎలిమినేట్ కూడా అయ్యే అవకాశం లేదు. ఈ ఛాలెంజ్ లో శివాజీ, రతిక, ఆట సందీప్, ప్రియాంక జైన్ ఉన్నారు. వారిలో నుంచి రతిక, శివాజీ డిస్కాలిఫై అయినట్లు తెలుస్తోంది. ప్రియాంక జైన్- ఆట సందీప్ లో ఎవరు గెలిస్తే వారికి ఈ ఇమ్యునిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే హౌస్ లో టాస్కులు మాత్రమే కాదు.. కామెడీ కూడా చాలా బాగా పండుతోంది. కంటెస్టెంట్స్ కి యాక్టింగ్ టాస్కు ఇచ్చినప్పుడు శివాజీని చూసి అంతా భయపడిపోయారు. నిజంగానే బిగ్ బాస్ తో గొడవకు దిగాడు అనుకున్నారు. ఆ కాసేపు ప్రేక్షకులు కూడా ఏంటి శివాజీ కాఫీ కోసం ఇంత చేశాడా? అని అనుకున్నారు. కానీ, ఆ టాస్కులో మాత్రం శివాజీనే అందరి కంటే ఎక్కువ ఎంటర్ టైన్ చేశాడు. మధ్యలో బిగ్ బాస్ కు విషయం చెబుతూనే.. తాను మాత్రం రెచ్చిపోయాడు. ఇప్పుడు మరో ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిసారి తాను చేస్తే నమ్మరు అని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు.

ఈసారి షకీలాతో ప్రాంక్ చేయించాడు. షకీలా, శివాజీ, కిరణ్ రాథోడ్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అక్కడ వారి మధ్య డిస్కషన్ వచ్చింది. ఎలా చేస్తే బాగుంటుంది అంటూ శివాజీని షకీలా అడుగుతారు. షకీలాకు శివాజీ ఒక ఐడియా చెప్పాడు. ఆ ఐడియాని ఆమె తూచా తప్పకుండా ప్లే చేశారు. ఆమెకు సడెన్ గా ఏదో ఆరోగ్యం బాలేదు అన్నట్లు యాక్ట్ చేశారు. హౌస్ లో ఉన్న డాక్టర్ గౌతమ్ కృష్ణ కూడా ఆమెను పరీక్షించారు. ఎందుకో ఆమె కంగారు పడుతున్నట్లు చెప్పారు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉందని గౌతమ్ చెప్పాడు. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి ఆమెను దుప్పటి కప్పి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ షకీలా హెల్త్ విషయంలో కంగారు పడ్డారు.

ఆమెను అర్ధరాత్రి లేచి వింతగా ప్రవర్తించమని శివాజీ చెప్పాడు. అలాగే ఆమె అర్ధరాత్రి లేచి విచిత్రంగా చూడటం చేసింది. అది చూసి ఇంటి సభ్యులు కాస్త కంగారు పడ్డారు. సింగర్ ధామినీ అయితే ధైర్యంగా లోపలికి వెళ్లి.. భయంతో బయటకు వచ్చింది. ఇలా మొత్తానికి ప్రోమో మొత్తం ఈ ప్రాంక్ తోనే నిండిపోయింది. నైట్ ఎపిసోడ్ లో అయితే ఈ సీన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అసలు సీన్ మొత్తం ఎలా పండింది? సభ్యులు మొత్తం ఎంత కంగారు పడ్డారు? అనే ఆసక్తి పెరిగిపోయింది. మరి.. షకీలా- శివాజీ- కిరణ్ ప్రాంక్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom