iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో సీమంతం.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

  • Published Nov 07, 2023 | 8:54 PM Updated Updated Nov 07, 2023 | 8:54 PM

ఫ్యామిలీ వీకెండ్ తో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది. అంబటి అర్జున్ భార్య హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఫ్యామిలీ వీకెండ్ తో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది. అంబటి అర్జున్ భార్య హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

  • Published Nov 07, 2023 | 8:54 PMUpdated Nov 07, 2023 | 8:54 PM
బిగ్ బాస్ హౌస్ లో సీమంతం.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

బిగ్ బాస్ అనేది అన్ని ఎమోషన్స్ కలిసి ఉండే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటింది. హౌస్ మేట్స్ ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా వారి ఎమోషన్స్ కచ్చితంగా బయటకు వచ్చేస్తాయి. ఎవరూ కూడా హౌస్ లో యాక్ట్ చేయడం అస్సలు కుదరదు. వాళ్లు అరిచినా, ఏడ్చినా అన్నీ ట్రూ ఎమోషన్స్ అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్ లో ఫ్యామిలీ వీకెండ్ నడుస్తోంది. ఒక్కో కంటెస్టెంట్ కోసం వారి కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి వస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలు వస్తున్నాయి. ఇప్పటికే శివాజీ కుమారుడికి సంబంధించిన ప్రోమో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అంబటి అర్జున్ వాళ్ల భార్య హౌస్ లోకి వచ్చింది. ఈ ప్రోమో మరీ ఎమోషనల్ గా ఉంది. చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఏడ్చేస్తారు.

హౌస్ లో భార్యను చూడగానే అంబటి అర్జున్ చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. భార్యను కౌగిలించుకుని ఏడ్చేశాడు. అర్జున్ ఇప్పటివరకు హౌస్ లో మైండ్ గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కామ్ గా, కూల్ గా ఉంటూ వచ్చాడు. అయితే అలాంటి గేమ్ వర్కౌట్ కాదని భార్య చెప్పింది. నీకు ఏది అనిపిస్తే అది ట్రూగా బయటకు చెప్పేయ్ అంటూ సలహా ఇచ్చింది. నువ్వు ఎమోషన్స్ ని దాచుకుంటే కుదరదు అంటూ సూచించింది. కప్పు ముఖ్యం బిగిలు అంటూ డైలాగు కూడా చెప్పింది. ఇన్ని రోజుల తర్వాత భర్తకు ప్రేమగా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత ఇంట్లోని సభ్యులతో కూడా మాట్లాడింది.

ఫ్యామిలీ మెంబర్స్ వస్తే.. మిగిలిన వాళ్లు కూడా వారి ఆటకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు. అయితే ఎంత మంచిగా చెప్పినా కూడా అది తమ వాళ్లకు పోటీని పెంచినట్లే అవతుంది. అందుకే అంబటి అర్జున్ భార్య కూడా ఎంతో తెలివిగా సమాధానం చెప్పింది. బయట ఏం జరుగుతోంది.. ఎలా ఉంది అంటే.. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పింది. ఆమె సమాధానానికి హౌస్ మొత్తం నవ్వేసింది. అశ్వినీని చూసి ఏంటి ఇప్పటికైనా నా భర్త అంటే భయం పోయిందా అంటూ ప్రశ్నించింది. బిగ్ బాస్ అర్జున్ భార్యకు బిగ్ సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. చీర, గాజులు, పూలు, పుసుపు, కుంకుమ అన్నింటిని ఇంట్లోకి పంపారు. అందరూ కలిసి ఘనంగా సీమంతం చేశారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి సరదాగా డాన్సులు కూడా చేశారు.

ఈ మొత్తం దృశ్యాలు చూస్తూ అంబటి అర్జున్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. బాగా ఏడ్చేశాడు కూడా. భార్యను తిరిగి పంపే సమయంలో ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యాడు. ఈ మొత్తం సీన్స్ చూసిన హౌస్ మేట్స్ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. శివాజీ అయితే ఇలాంటి సీన్స్ లైవ్ లో చూసినంత ఎంతో ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ ఫ్యామిలీ వీకెండ్ సీజన్ 7కే టాప్ రేటెడ్ ఎపిసోడ్ గా నిలిచే ఆస్కారం ఉంది. ఎందుకుంటే అంటే ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఫ్యామిలీ వీకెండ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శివాజీ కుమారుడు, అర్జున్ భార్య ఎంట్రీలతోనే ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఇంక రాబోయో కుటుంబసభ్యుల విషయంలో కూడా ఇలాంటి ఎమోషనల్ యాంగిల్ ని చూపిస్తారు. మరి.. ఈ ప్రోమో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş