iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: ప్రశాంత్‌ను చూడ్డానికి వచ్చి కాలు విరగ్గొట్టుక్కున్న లేడీ ఫ్యాన్‌!

  • Published Dec 18, 2023 | 1:14 PM Updated Updated Dec 18, 2023 | 1:14 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగు విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు. నిన్న జరిగిన గ్రాండ్‌ ఫినాలే చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనం అన్న పూర్ణ స్టూడియోకు వెళ్లారు. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 తెలుగు విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచారు. నిన్న జరిగిన గ్రాండ్‌ ఫినాలే చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనం అన్న పూర్ణ స్టూడియోకు వెళ్లారు. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేశారు.

  • Published Dec 18, 2023 | 1:14 PMUpdated Dec 18, 2023 | 1:14 PM
Bigg Boss 7: ప్రశాంత్‌ను చూడ్డానికి వచ్చి కాలు విరగ్గొట్టుక్కున్న లేడీ ఫ్యాన్‌!

వంద రోజుల బుల్లితెర పండగ ముగిసింది. గత కొన్ని నెలలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 తెలుగు’ నిన్నటితో అయిపోయింది. అందరూ ఊహించినట్లుగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ టైటిల్‌ను గెలిచాడు. భారీ మొత్తంలో డబ్బుతో పాటు విలువైన వస్తువుల్ని గెలుచుకున్నాడు. అంతకు మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. నిన్న బిగ్‌ బాస్‌ 7 గ్రాండ్‌ ఫినాలే జరిగింది. ఫైనల్‌ విన్నర్‌ ఎవరో తేలే సమయం కావటంతో కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయారు.

 ఇంకా కొంతమంది నేరుగా షో జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గరకు పెద్ద మొత్తంలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతరులు కూడా చేరారు. వందల మంది స్టూడియో బయట గుమికూడటంతో పోలీసులు సైతం వారిని అదుపుచేయలేకపోయారు. ఈ సమయంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట సైతం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కొంతమందికి గాయాలయ్యాయి. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ లేడీ ఫ్యాన్‌ ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాదు! షో ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అమర్‌దీప్‌పై కూడా దాడి జరిగింది. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌.. షో ముగించుకుని కారులో బయటకు వస్తున్న అమర్‌ దీప్‌ కారును చుట్టుముట్టారు. రాళ్లతో దాడి చేశారు. కారులోంచి బయటకు రావాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న అమర్‌ దీప్‌ భార్య, తల్లి, స్నేహితుడు కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు ఉద్రిక్త పరిస్థితి నడిచింది. కారులో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు.

ఇక, సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గరకు చేరుకున్నారు. భద్రత కల్పించి వారిని అక్కడినుంచి పంపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ కేవలం అమర్‌ దీప్‌పైనే కాదు.. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అశ్విని శ్రీ, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గీతూరాయల్ కార్లపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో వారి కార్లు దారుణంగా పాడయ్యాయి. దీంతో గీతూ రాయల్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

తన కారుపై దాడి చేసిన వారిని తీసుకువస్తే.. 10 వేల రూపాయలు రివార్డు ఇస్తానని ప్రకటించింది. కాగా, బిగ్‌ బాస్‌ 7లో విన్నర్‌గా గెలిచిన ప్రశాంత్‌కు 35 లక్షల రూపాయలు అందాయి. అయితే, వీటిలో ట్యాక్స్‌, జీఎస్టీ పోగా.. 17 లక్షలు చేతికి రానున్నాయి. ప్రశాంత్‌కు డబ్బుతో పాటు 15 వారాల రెమ్యూనరేషన్‌ 15 లక్షల విలువ చేసే మారుతీ కారు.. 15 లక్షలు విలువ చేసే ఓ డైమండ్‌ నెక్లస్‌ కూడా వచ్చింది. మరి, పల్లవి ప్రశాంత్‌ను చూడ్డానికి వెళ్లి లేడీ ఫ్యాన్‌ గాయపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş