iDreamPost
android-app
ios-app

ఆట సందీప్ ఎలిమినేషన్! నామినేషన్స్ లోకి వచ్చిన తొలి వారమే..!

  • Published Oct 28, 2023 | 1:50 PM Updated Updated Oct 28, 2023 | 1:56 PM

శనివారం రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆట సందీప్ అనే పేరు సమాధానంగా వినిపిస్తోంది. అయితే నిజంగానే ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా?

శనివారం రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆట సందీప్ అనే పేరు సమాధానంగా వినిపిస్తోంది. అయితే నిజంగానే ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా?

  • Published Oct 28, 2023 | 1:50 PMUpdated Oct 28, 2023 | 1:56 PM
ఆట సందీప్ ఎలిమినేషన్! నామినేషన్స్ లోకి వచ్చిన తొలి వారమే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగానే సాగుతోంది. హౌస్ లో మళ్లీ గొడవలు జోరందుకున్నాయి. అయితే సోమవారం అనగానే నామినేషన్స్.. వీకెండ్ అనగానే ఎలిమినేషన్ హౌస్ లో కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ప్రశ్న శుక్రవారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆట సందీప్ పేరు వినిపిస్తోంది. అయితే ఇది కాస్త షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. హౌస్ లో నామినేషన్స్ లోకి వచ్చిన తొలివారమే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు అని వస్తున్న లీకులు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. పైగా ఈ సీజన్ ని ఉల్టా పుల్టా అంటున్నారు. ఎంత ఉల్టా అయినా కూడా ఆట సందీప్ ఎలా ఎలిమినేట్ అవుతాడు అనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.. హౌస్ లో అశ్వినీ శ్రీ, భోలే షావలీ ఉండగా.. సందీప్ ఎలా ఎలిమినేట్ అవుతాడని అడుగుతున్నారు. అయితే ఇందుకు చాలా తెలివైన సమాధానం వినిపిస్తోంది. అదేంటంటే.. నామినేషన్స్ లో ఉన్న అశ్వినీ, భోలేలకు పల్లవి ప్రశాంత్, మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఓట్లు వేశారంట. అలా ఎందుకు వేశారు అంటే.. శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలి అని. గతంలో రతికాపై కోపంతో టేస్టీ తేజాకు ఓట్లు వేసి సేవ్ చేసినట్లు ఇప్పుడు శోభాని దెబ్బ కొట్టడానికి అశ్వినీకి, భోలేకి ఓట్లు వేశారంట.

ఈ పనితో అశ్వినీ, భోలే కాస్తా సేవ్ అయ్యి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. శోభాశెట్టి, ఆట సందీప్ కాస్తా డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టారు. అయితే అలాంటప్పుడు శోభా కదా ఎలిమినేట్ కావాలి అనే ప్రశ్న వస్తుంది. అందుకు సమాధానం ఏంటంటే.. మోనితగా శోభాకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే.. హౌస్ లో గట్స్ ఉన్న అమ్మాయి అనే పేరు తెచ్చుకుంది. ఎంత గోల చేసినా కూడా శోభాకి కూడా కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. మరోవైపు తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్ కు ఇది వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే నామినేషన్స్ లో లేకపోతే ఫ్యాన్స్ ఇన్ యాక్టివ్ అయిపోతారు. అది కూడా 7 వారాలు నామినేషన్స్ లో లేని సందీప్ కు తొలిసారి నామినేషన్స్ కచ్చితంగా కత్తి మీద సాములాగానే ఉంటుంది.

శోభా మీద పెరిగిన నెగిటివిటీ.. ఇప్పుడు సందీప్ కొంప ముంచింది అనే చెప్పాలి. మరి.. ఇది అధికారికమా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇవి కేవలం బయటకు వస్తున్న లీకులు ఆధారంగా మాత్రమే చెబుతున్నారు. శోభాశెట్టి, సందీప్ ఇద్దరి ఏవీలు రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాబట్టి శోభాని ఎలిమినేట్ చేస్తే కాస్త షో మీద పాజిటివ్ టాక్ వస్తుందనే అభిప్రాయం కలిగితే కచ్చితంగా శోభాని పంపే ఆస్కారం ఉంటుంది. ఇన్నాళ్లు ఆడవాళ్లను ఎలిమినేట్ చేసి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ వారం మాత్రం అబ్బాయిని పంపేద్దాంలే అనుకుంటే మాత్రం సందీప్ బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఏదైనా కచ్చితంగా తెలియాలి అంటే ఆదివారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి.. ఆట సందీప్ ఎలిమినేట్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ