iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి అమర్ దీప్ ఎలిమినేట్ కాబోతున్నాడా?

  • Published Oct 11, 2023 | 12:35 PM Updated Updated Oct 11, 2023 | 12:35 PM
  • Published Oct 11, 2023 | 12:35 PMUpdated Oct 11, 2023 | 12:35 PM
Bigg Boss 7 Telugu: ఈ వారం హౌస్ నుంచి అమర్ దీప్ ఎలిమినేట్ కాబోతున్నాడా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్టార్ట్ అయినప్పుడు హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో ఎవరు తోపు అంటే అందరూ టక్కున అమర్ దీప్ అని చెప్పేశారు. ఇప్పుడు 5 వారాలు కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు హౌస్ లో ఎవరు డల్ అంటే మళ్లీ టక్కున అమర్ దీప్ పేరు చెప్పేస్తున్నారు. అదేంటి తోపు ప్లేయర్ ఒక్కసారిగా డల్ ప్లేయర్ ఎలా అయ్యాడు అనుకుంటున్నారా? హౌస్ లో ఉండి ఆట ఆడకపోతే ఎంత తోపు అయినా కూడా జాబితాలో లీస్టు పొజిషన్ కి రావాల్సిందే. ఇప్పుడు సీజన్ లో కూడా అదే జరుగుతోంది. అమర్ దీప్ కి ఆట అసలు అర్థం కావడం లేదు. అదే అతనికి చాలా పెద్ద మైనస్ అయింది.

అమర్ దీప్ అనగానే బుల్లితెర ప్రేక్షకులకు ఒక హీరో గుర్తొస్తాడు. అతను బిగ్ బాస్ కి వెళ్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అతను ఇరగదీసి ఆడతాడు అంతా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది. అమర్ దీప్ మొదటివారంలోనే చతికిల పడ్డాడు. ఇంకా పైకి లేచి ఆట మొదలు పెట్టినట్లు కనిపించడం లేదు. అసలు మొదలు పడెతాడా? అంటే.. ‘మాకు నమ్మకం లేదు దొర’ అనే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా హౌస్ లోకి వచ్చిన ఐదుగురు పోటుగాళ్లని ఎవరు బాగా ఆడటం లేదు అని ప్రశ్నిస్తే.. నలుగురు అమర్ దీప్ పేరే చెప్పారు. అంటే బయట అమర్ దీప్ గురించి ఎలాంటి టాక్ నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మనోడి పరిస్థితి ఎలా అయిందంటే.. అమర్ దీప్ కి ఆట అర్థం అయిందా? అని అందరూ సెటైర్లు వేసుకుని నవ్వేదాకా వచ్చేసింది. బిగ్ బాస్ కూడా అమర్.. మీకు ఆట అర్థమైందా? అంటూ జోకులేస్తున్నాడు. మనోడి ప్లేస్ ఎక్కడ ఉందో.. నామినేషన్స్ లో అంబటి అర్జున్ చాలా క్లియర్ గా చెప్పాడు. అమర్ దీప్ కి చెప్పకనే.. అతని ఆట తీరును వివరించాడు. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో అని కూడా చెప్పాడు. బయట ఉన్న టాక్ గురించి లోపల ఉన్న వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. కానీ, తన ఫ్రెండ్ ఆట సరిగ్గా ఆడటం లేదు.. బయట నెగిటివ్ అవుతున్నాడు అని అర్జున్ తెలివిగా నామినేషన్స్ లో చెప్పుకొచ్చాడు. దానిని కూడా అమర్ అర్థం చేసుకోలేదు. పైగా అర్జున్ ని అపార్థం చేసుకున్నాడు. తాజాగా హౌస్ లో బుర్రకి పదునుపెట్టే టాస్క్ వచ్చింది.

ఆటగాళ్ల నుంచి ఒకరు.. పోటుగాళ్ల నుంచి ఒకరు రావాలని కోరారు. పోటుగాళ్ల నుంచి గౌతమ్ వచ్చాడు. ఆటగాళ్ల నుంచి అమర్ దీప్ వచ్చాడు. అయితే అడిగిన ప్రశ్నలు అర్థంకాక అమర్ చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాడు. అంతేకాకుండా ఆటను పూర్తి చేయకుండా మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇవాళ ఆడతాడు.. రేపు ఆడతాడు అని ఎదురుచూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు, అమర్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఆ టాస్కు అయ్యాక అమర్ దీప్ బయటకు వచ్చేశాడు. శివాజీతో ఈ వీక్ నన్ను పంపేస్తారు అంటూ తనలో ఉన్న భయాన్ని వ్యక్త పరిచాడు. నిజానికి అమర్ దీప్ కి ఆ భయం రావడంలో తప్పేం లేదు. అతని ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో అతనికి క్లారిటీ ఉంది. అందుకే ఏ వారానికి ఆ వారం ఎక్కడ హౌస్ లో నుంచి వెళ్లిపోతానో అని తెగ కంగారు పడిపోతున్నాడు.

ప్రతి వీక్ సేవ్ అయ్యాక తెగ ఎమోషనల్ అవుతున్నాడు. ప్రతిసారి ఈసారి నేనేంటో చూపిస్తానంటూ మాటలు ఇచ్చేస్తున్నాడు. అందుకే లాస్ట్ వీక్ నాగార్జున కూడా అమర్ నువ్వు ప్రతిసారి ఇదే చెప్తున్నావ్ అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. అమర్ కూడా ప్రతి వీక్.. నేనే వెళ్లిపోతాను అనే భయంతో బతికేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎలిమినేషన్ ఆలోయన ప్రేక్షకుల్లోకి కూడా వచ్చేసింది. అమర్ ఎలిమినేట్ కాబోతున్నాడా? అనే ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకో రెండువారాల్లో అమర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి.. అమర్ దీప్ కు పట్టుకున్న ఎలిమినేషన్ భయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş