iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: 13 వారాలకు గౌతమ్ కు దక్కిన రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

  • Published Dec 04, 2023 | 11:22 AM Updated Updated Dec 04, 2023 | 11:22 AM

బిగ్ బాస్ హౌస్ లో ఆట ముందుకు వెళ్లాలంటే వారానికి ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే. తాాజాగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. మరి.. గౌతమ్ కు ఎంత పారితోషకం దక్కిందో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో ఆట ముందుకు వెళ్లాలంటే వారానికి ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే. తాాజాగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. మరి.. గౌతమ్ కు ఎంత పారితోషకం దక్కిందో చూద్దాం.

  • Published Dec 04, 2023 | 11:22 AMUpdated Dec 04, 2023 | 11:22 AM
Bigg Boss 7 Telugu: 13 వారాలకు గౌతమ్ కు దక్కిన రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆఖరి మజిలీకి చేరుకుంది. ఇప్పుడు అంతా టాప్ 5లో ఎవరు నిలుస్తార్ అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అంబటి అర్జున్ ఫినాలే వీక్ కి చేరుకున్నాడు. అయితే టాప్ 5లో చోటు దక్కుంతుందా? లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇంక హౌస్ లో అందరూ తమ ప్లేస్ కోసం గట్టిగానే పోరాడుతున్నారు. తాజాగా గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఇంకా ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలో నుంచి కేవలం ఐదుగురు మాత్రమే టాప్-5కి చేరుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే గౌతమ్ ఎలిమినేషన్ విషయంలో ఇంకా చాలామంది షాక్ లో ఉన్నారు. టైటిల్ సంగతి పక్కన పెడితే రెమ్యూనషన్ పరంగా గౌతమ్ కి గట్టిగానే గిట్టుబాటు అయ్యిందని చెబుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కాస్తో కూస్తో సింగిల్ గా ఆడిన వ్యక్తి గౌతమ్ కృష్ణ. కొన్నాళ్లు శుభశ్రీ రాయగురుతో జోడీ కట్టినట్లు కనిపించినా కూడా లెటర్ టాస్కులో ఆమెను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి మరీ తన ఆటను ముందుకు తీసుకెళ్లాడు. ఆ సీన్ చూసిన తర్వాత గౌతమ్ కృష్ణ సింగిల్ ప్లేయర్ అని చెప్పడానికి బలం చేకూరినట్లు అయింది. అవన్నీ పక్కన పెడితే గౌతమ్ కు బయట ఫాలోయింగ్ బాగానే పెరిగింది. ముఖ్యంగా అమ్మాయిల్లో క్రేజ్ పెరిగిందని స్వయంగా గౌతమ్ తల్లి బిగ్ బాస్ హౌస్ లో చెప్పారు. ఆట పరంగా కూడా గౌతమ్ కు మంచి మార్కులే పడ్డాయి. మొదటి వారాల్లో కాస్త అటూ ఇటూగా ఆడిన గౌతమ్ కృష్ణ.. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కాస్త గాడిలో పడ్డాడు.

గౌతమ్ కి ఎప్పుడూ శివాజీ, యావర్ తో గొడవలైతే జరగుతూనే ఉండేవి. వాళ్లు గౌతమ్ ని నామినేట్ చేయడం, గౌతమ్ వాళ్లను నామినేట్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. మరోవైపు పల్లవి ప్రశాంత్ తో కూడా గౌతమ్ కు గొడవలు జరిగాయి. శివాజీ కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తూనే.. ప్రజల్లోకి మాత్రం వేరేలా తీసుకెళ్లాడు. గౌతమ్ గురించి తాను పట్టించుకోవడం లేదంటూ.. అతనే కావాలని శివాజీని టార్గెట్ చేస్తున్నాడు అంటూ పదే పదే కామెంట్ చేశాడు. అయినా అసలు ఈ వీక్ ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ కాదంట. అర్జున్ అవ్వాల్సి ఉండగా.. అతను ఫినాలే వీక్ కి చేరుకున్నాడు కాబట్టి ఆ తర్వాత లిస్ట్ లో ఉన్న గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించాడు.

ఇంక గౌతమ్ కృష్ణ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మనోడికి వారానికి రూ.1.5 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 13 వారాలు హౌస్ లో ఉన్నాడు. ఆ రూ.13 వారాలకు వారానికి రూ.1.5 లక్షల చొప్పున రూ.19.50 లక్షలు అతను పారితోషకంగా అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. అసలు గౌతమ్ కి ఎంత దక్కిందో తెలియాలంటే అతనే ఓపెన్ చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఆట పరంగా మాత్రం గౌతమ్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడనే చెప్పాలి. మరి.. గౌతమ్ కి రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom