iDreamPost
android-app
ios-app

9 వారాలకు టేస్టీ తేజాకి షాకింగ్ రెమ్యూనరేషన్.. అన్ని లక్షలా?

  • Published Nov 06, 2023 | 1:07 PM Updated Updated Nov 06, 2023 | 1:07 PM

బిగ్ బాస్ అవకాశం దక్కడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రియాలిటీ షో వల్ల డబ్బు మాత్రమే కాదు.. కెరీర్ లో మంచి అవకాశాలు కూడా దక్కుతాయి. అయితే తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన టేస్టీ తేజాకు ఎంత రెమ్యూనరేషన్ దక్కిందంటే?

బిగ్ బాస్ అవకాశం దక్కడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రియాలిటీ షో వల్ల డబ్బు మాత్రమే కాదు.. కెరీర్ లో మంచి అవకాశాలు కూడా దక్కుతాయి. అయితే తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన టేస్టీ తేజాకు ఎంత రెమ్యూనరేషన్ దక్కిందంటే?

  • Published Nov 06, 2023 | 1:07 PMUpdated Nov 06, 2023 | 1:07 PM
9 వారాలకు టేస్టీ తేజాకి షాకింగ్ రెమ్యూనరేషన్.. అన్ని లక్షలా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 9వ వారం హౌస్ నుంచి ఎంటరన్ టైనర్ టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. తేజా ఎలిమినేట్ అవతుంటే.. హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే హోస్ట్ నాగార్జున కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. “తేజా నీతో మాట్లాడుతుంటే ఎంతో సరదాగా ఉంటుంది. అమ్మను హౌస్ లోకి తీసుకురావాలి అనుకున్నావ్. అది జరగకుండానే వెళ్లిపోతున్నావ్” అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇంక, శోభాశెట్టి అయితే బాగా ఏడ్చేసింది. ఇప్పుడు తేజా బయటకు వచ్చిన తర్వాత అసలు బిగ్ బాస్ నుంచి అతనికి ఎంత రెమ్యూనరేషన్ దక్కింది అంటూ తెగ ఆలోచిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో టేస్టీ తేజా చాలా స్పెషల్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో అయినా హౌస్ మేట్స్ అందరినీ నవ్వించేవాడు. ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ తో హౌస్ లోకి వచ్చినందుకు తన పేరుకు న్యాయం చేశాడు. ఎవరు ఎంత సీరియస్ గా ఉన్నా కూడా తేజాతో మాట్లాడితే కూల్ అయ్యేవాళ్లు. అలాంటి ఒక స్మైలింగ్ స్టార్ ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. నిజానికి హౌస్ లో ఉన్న అందరిలో ఆటను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి తేజా ఒక్కడే అని చెప్పాలి. బిగ్ బాస్ ఏ టాస్కు ఇచ్చినా కూడా అందరికంటే బాగా తేజానే అర్థం చేసుకునేవాడు. ఇంకో విచిత్రం ఏంటంటే.. తాను ఈ వీక్ ఎలిమినేట్ కాబోతున్నాను అని ముందే తేజా గ్రహించాడు. అదే విషయాన్ని నామినేట్ చేసిన శివాజీకి కూడా చెప్పాడు. లేదనన్నా ఈ వీక్ నేను వెళ్లిపోతాను.. నాకు అర్థమవుతోంది అంటూ చెప్పాడు. అలా ఎలా సాధ్యం అని అడిగితే నా సెవన్త్ సెన్స్ అలా చెప్పేస్తూ ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు.

హౌస్ లో శోభాశెట్టికి తేజా ఎంతో బాగా కనెక్ట్ అయ్యాడని తెలిసిందే. ఆమె అవసరానికి తేజాతో మాట్లాడినట్లు కనిపించినా కూడా.. తేజా మాత్రం ఒక మంచి ఫ్రెండ్ లా తనకి సపోర్ట్ చేశాడు. శోభా కోసమే హౌస్ లోకి వెళ్లావా అంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. మొత్తానికి తనకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని తన కెరీర్ బిల్డ చేసుకోవడానికి టేస్టీ తేజా చక్కగా వినియోగించుకున్నాడు అనే చెప్పాలి. ఇంక బిగ్ బాస్ నుంచి టేస్టీ తేజాకి వచ్చిన రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. అతనికి అంత ఎక్కువ ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకంటే తేజా ఇంత బాగా ఎంటర్ టైన్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే వెళ్లబోయే ముందు తేజా ఒక చిన్న యూట్యూబర్ కాబట్టి కాస్త తక్కువ రెమ్యూనరేషన్ కే అతను ఓకే చెప్పాడని తెలుస్తోంది.

వారానికి రూ.1,50,000 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు తేజాకి రూ.21 వేల వరకు అందింది. అంటే హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎలిమినేట్ అయిన వరకు టేస్టీ తేజాకి రూ.13.50 లక్షలు రెమ్యూనరేషన్ గా దక్కినట్లు చెబుతున్నారు. నిజానికి ఇంత మొత్తంలో అందుకుంటానని తేజా కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే తేజా తాను 4 వారాలు మాత్రమే ఉంటానని అనుకుని వెళ్లాడు. కానీ, ఊహించని విధంగా 9 వారాలు హౌస్ లో కంటిన్యూ అయ్యాడు. మరి.. టేస్టీ తేజా ఎలిమినేషన్, రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom