iDreamPost
android-app
ios-app

ఫైనలిస్ట్‏లకు ఇంటి ఫుడ్.. కాకపోతే ఒక మెలిక పెట్టిన బిగ్ బాస్!

  • Published Dec 14, 2023 | 8:51 PM Updated Updated Dec 14, 2023 | 8:51 PM

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ ఆరువారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈసారి బిగ్ బాస్ 7వ సీజన్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ కింగ్ నాగార్జున సందడి చేశారు.

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ ఆరువారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈసారి బిగ్ బాస్ 7వ సీజన్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ కింగ్ నాగార్జున సందడి చేశారు.

  • Published Dec 14, 2023 | 8:51 PMUpdated Dec 14, 2023 | 8:51 PM
ఫైనలిస్ట్‏లకు ఇంటి ఫుడ్.. కాకపోతే ఒక మెలిక పెట్టిన బిగ్ బాస్!

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ తెలుగు లో కూడా బాగా రాణిస్తుంది. సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ఇక సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హూస్ట్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తయి ఇప్పుడు ఏడో సీజన్ నడుస్తుంది. బిగ్ బాస్ 7వ సీజన్ పూర్తి కాబోతుంది.. ఈసారి అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ వచ్చారు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఆరుగురు కంటెసెంట్స్ ఉన్నారు. ఆదివారం వరకు ఎలిమినేషన్స్ ఆసక్తికంగా కొనసాగుతూ వచ్చాయి. 14వ వారం ఎలిమినేషన్ శోభా శెట్టి అయ్యింది. అప్పటి వరకు ఇంటి సభ్యుల మధ్య గొడవలు, బుజ్జగింపులు, అలకలు, కోపాలు కొనసాగాయి. సోమవారం నుంచి ఇంటి సభ్యుల జర్నీ వీడియోలు ఎమోషనల్‎గా అందరికీ కనెక్ట్ అయ్యాయి. తాజాగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ కింగ్ నాగార్జున్ సందడి చేస్తూ ప్రారంభించారు. బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అందులో అంబటి అర్జున్ ఫైనల్ కి చేరారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విన్నర్ ని ప్రకటించబోతున్నారు. ఈసారి టాప్ 6 లో ఇంటి సభ్యులుగా శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్, ప్రియాంక జైన్, యావర్ నిలిచారు. ఈ రోజు గురువారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. గతంలో ఇంట్లో ఆడిన ఆటలు మళ్లీ ఆడిపించాడు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో.. హౌస్ మెట్స్ కోసం ఇంటి నుంచి ఫుడ్ తెప్పించారు. తమ ఇంటి నుంచి తెప్పించే ఫుడ్ తినే అవకాశం కల్పించాడు బిగ్ బాస్.. కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టాడు. గతంలో టాస్కుల్లో ఎవరు ఓడిపోయారో అదే టాస్కులు పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారి కోసం వారు ఆడకుండా.. పక్కవ వాళ్ల కోసం ఆడి గెలవాల్సి ఉంటుంది. అలా గెలిచిన వారికి వారి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ తినే అవకాశం ఉంటుంది.

ముందుగా అర్జున్ కోసం వచ్చిన ఫుడ్ తినాలంటే.. యావర్ గతంలో ఎవిక్షన్ పాస్ గెలిచే సమయంలో ఆడిన బ్యాలెన్స్ బాల్ ఆడాల్సి వచ్చింది. అందులో యావర్ గెలిచాడు. తర్వాత శివాజీ కోసం వచ్చిన ఫుడ్ తినాలంటే.. ప్రియాంక టాస్క్ గెలవాల్సి ఉంటుంది. గతంలో ఓడిపోయిన బ్యాలెన్సింగ్ టాస్క్ లో ప్రియాంక గెలిచింది. ఇక అమర్ దీప్ కోసం వచ్చిన ఫుడ్ తినాంటే.. శివాజీ మూడు నిమిషాల్లో బెలూన్స్ పగలగొట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చాలా ఉత్కంఠంగా సాగింది.. అందరి ముఖాల్లో టెన్షన్ కనిపిస్తుంది. మరి అమర్ దీప్ కోసం శివాజీ గెలిచాడా? లేదా అన్నది ఈ రోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet