ముందే మెలిక పెట్టిన నాగార్జున.. ఏ సభ్యుడు కన్ఫామ్ హౌస్ మేట్ కాదు!

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కో ఇంటి సభ్యుడు ఇంట్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా ఉంటుందని నిర్వాహకులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అలా చెప్పడం మాత్రమే కాదు.. చేస్తున్నారు కూడా. ఏ సీజన్ లో లేని అన్ని రూల్స్, గేమ్స్ ఈ సీజన్ లో మొదలు పెట్టేశారు. ఇప్పటివరకు సీజన్స్ చూసి వచ్చినా కూడా ఈసారి హౌస్ లో చేయగలిగింది ఏమీ లేదనే చెప్పాలి.

ఈ సీజన్ లో కొత్తగా హాలోగ్రామ్ దర్శిని అని స్టార్ట్ చేశారు. అంటే నాగార్జున ఎప్పుడు కావాలన్నా హాలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడతారు. గతంలోలా వీకెండ్ లో మాత్రమే రావడం కాకుండా.. ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ సీజన్ లో ఇంకో మెలిక కూడా పెట్టారు. నిజానికి ప్రతి సీజన్ లో స్టేజ్ మీదకు రాగానే ఇది మా లైఫ్ డ్రీమ్ సార్ అని అంటారు. లైఫ్ లో చాలా గొప్ప అవకాశం వచ్చింది అంటూ చెబుతారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్స్ వేస్ట్ అయ్యాయనే చెప్పాలి.

ఈ సీజన్ లో స్టేజ్ మీదకు వచ్చిన ఏ సభ్యుడు కూడా కన్ఫామ్ ఇంటి సభ్యుడు కాదు. ఈసారి బ్రహ్మాస్త్ర అని ఒక కొత్త రూల్ పెట్టారు. అంటే సభ్యులు ఆ అస్త్రాన్ని గెల్చుకుంటేనే వాళ్లు ఇంటి సభ్యులు అవుతారు. అప్పటి వరకు వాళ్లు కంటెస్టెంట్స్ గానే ఉండిపోతారు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున అందరికీ చెప్పి పంపుతున్నారు. అంతేకాదండోయ్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి కుర్చీలు, సోఫాలు కూడా లేవు. బెడ్ రూమ్ లో పరుపులు కూడా లేవు. ఇవన్నీ సభ్యులు సంపాదించుకోవాలి అంట. ఇంక ఈ సీజన్ లో ఇంకా ఎన్ని ట్విస్టులు ప్లాన్ చేశారో అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

Show comments