iDreamPost
android-app
ios-app

Shivaji: రతికను బిడ్డ అన్న నోటితోనే కుక్క అనేసిన శివాజీ!

  • Published Dec 20, 2023 | 4:19 PM Updated Updated Dec 20, 2023 | 4:19 PM

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ వాళ్లు ఏమనుకున్నారో అది బాహాటంగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే శివాజీ కూడా కొన్ని ఓపెన్ కామెంట్స్ చేశాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ వాళ్లు ఏమనుకున్నారో అది బాహాటంగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే శివాజీ కూడా కొన్ని ఓపెన్ కామెంట్స్ చేశాడు.

  • Published Dec 20, 2023 | 4:19 PMUpdated Dec 20, 2023 | 4:19 PM
Shivaji: రతికను బిడ్డ అన్న నోటితోనే కుక్క అనేసిన శివాజీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిపోయినా కూడా.. ఈ సీజన్ సృష్టించిన హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన విధ్వంసానికి సంబంధించి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేస్తున్నారు. ప్రశాంత్ పరారీలో ఉన్నాడు అంటూ వార్తలు రాగానే.. తాను ఇంటి దగ్గరే ఉన్నాను అంటూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే టాప్ 6 కంటెస్టెంట్స్ కి సంబంధించిన బజ్ ఇంటర్వ్యూలు రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోస్ లో కంటెస్టెంట్స్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే శివాజీ బజ్ ఇంటర్వ్యూలో ఒక విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే రతికా రోజ్ ని కుక్కతో పోల్చడం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఎవ్వరికీ రాని అవకాశం రతికా రోజ్ కు దక్కింది. ఒకసారి ఎలిమినేట్ అయ్యి కూడా తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టింది. అయినా కూడా సరైన ప్రభావాన్ని చూపలేకపోయింది. మొదటిసారి హౌస్ లోకి వెళ్లినప్పుడు పల్లవి ప్రశాంత్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తర్వాత వెంటనే ఎవడ్రా నువ్వు అంటూ ప్లేట్ మార్చేసింది. ఆ దెబ్బతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తప్పు తెలుసుకుని ప్రశాంత్ కు సారీ చెప్తూ తిరిగింది. నాగార్జున ఇంక చాలు సారీలు అనగానే ఆట మొదలు పెడుతుంది అనుకున్నారు. కానీ, ఎవరిని ఏమంటే ఏమౌతుందో అంటూ భయపడుతూ ఆడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం రతికా రోజ్- ప్రశాంత్ అక్కా తమ్ముళ్లు అయిపోయారు. మొదటి పార్ట్ లో ప్రేమికులు ఏమో అని ఊహించుకున్న ఆడియన్స్.. సడన్ గా వరసలు మారగానే జీర్ణించుకోలేకపోయారు. పైగా వచ్చే వారం తప్పకుండా ఆడతాను.. వచ్చే వారం ఆడతాను అనేది రతికాకి ఊతపదంగా మారిపోయింది. ఆఖరికి నాగార్జున కూడా ఆ మాటను బ్యాన్ చేసేశారు. మొత్తానికి అందం, టాలెంట్, సింగింగ్, డాన్స్, మెమొరీ పవర్ అన్నీ ఉన్నా కూడా ఆట ఆడకపోవడంతో రెండుసార్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

ఈమె ఆట గురించి శివాజీ సీరియస్ కామెంట్స్ చేశాడు. “రెండోవారంలో రైతుబిడ్డను టార్గెట్ చేశారు. నేను అప్పుడు అందరికీ చెప్పాను. వాడిని మీరు అనవసరంగా హీరోని చేస్తున్నారు అని. నా పక్కనే ఉన్న రతిక కూడా వీడు దొంగ అంటూ లేసింది. వద్దు బిడ్డా అని చెప్పాను. నా మాట వినలేదు. బయటకు పోయింది. నిజానికి రతికా రోజ్ మొదటివారం హౌస్ మేట్ కంటెండర్ అయ్యింది. ఆ టాలెంట్ మొత్తాన్ని పోగొట్టుకుంది. రెండోసారి వచ్చినప్పుడు తన తప్పు తెలుసుకుంది అనుకున్నాను. కానీ, మళ్లీ ప్రశాంత్ ని ఏసుకుంది. కుక్క తోక వంకరలే అనుకున్నాను. అది వేస్ట్ అని ఊరుకున్నాను. ఆమెకు ఉన్న మొమొరీ పవర్, డాన్స్, సింగింగ్, టాలెంట్ ఉన్నా వేస్ట్ చేసుకుంది” అంటూ శివాజీ కామెంట్స్ చేశాడు. బిడ్డా అన్న నోటితోనే కుక్కతో పోల్చడంతో అందరూ షాకవుతున్నారు. మరి.. రతికా రోజ్ ఆట గురించి శివాజీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom