iDreamPost
android-app
ios-app

అప్పుడు రైతుబిడ్డ- ఇప్పుడు పాటబిడ్డ.. అదే పులిహోర కబుర్లు!

  • Published Oct 13, 2023 | 2:34 PM Updated Updated Oct 13, 2023 | 2:34 PM
  • Published Oct 13, 2023 | 2:34 PMUpdated Oct 13, 2023 | 2:34 PM
అప్పుడు రైతుబిడ్డ- ఇప్పుడు పాటబిడ్డ.. అదే పులిహోర కబుర్లు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0లో పోటుగాళ్లు వచ్చిన తర్వాత ఆట బాగా ఆసక్తిగా మారుతోంది. అయితే అక్కడ అక్కడ మాత్రం కాస్త బోరింగ్ గా ఉంటోంది. అది ఒక్క ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా అంతే బోరింగ్ గా ఉంటోంది. అది మరీ ముఖ్యంగా జరుగుతోంది పాట బిడ్డ భోలే షావలీ వల్లే అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు భోలే పెద్ద స్ట్రాటజీలోత వచ్చినట్లు లేడు. ఉన్న ఒక వారమైనా అందరితో మంచిగా ఉండి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అని ఫిక్స్ అయి వచ్చినట్లు ఉన్నాడు. కానీ, బిగ్ బాస్ హౌస్ లో అలా ఉంటే కుదరదు. అలా కూడా ఉండకుండా.. పులిహోర కలపడం ప్రారంభించేశాడు. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ తో అదే పనిగా చింతపండు పులిహోర మిక్స్ చేస్తున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో భోలే షావలి మెజారిటీ సభ్యులకు నచ్చడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే భోలే పేరు చప్పినా చిరాకు ఎక్స్ ప్రెషన్ పెట్టేస్తున్నారు. సినిమా స్టైల్లో వచ్చేశాడ్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. భోలే షావలి హౌస్ లోకి వచ్చేటప్పుడు తనని తాను పాట బిడ్డగా పరిచయం చేసుకున్నాడు. హౌస్ లో రైతు బిడ్డ ఉన్నాడు.. నేను పాట బిడ్డను అని చెప్పాడు. వాళ్లు ఇద్దరు ప్రకృతి నుంచి వచ్చిన వాళ్లేనని.. అన్నం కూరలా కలిసిపోతాం అన్నాడు. ఎవరైనా తనకి ఎదురొస్తే ప్రేమిస్తానని చెప్పాడు. నిజానికి ఆ మాట జోక్ గా చెప్పాడు అనుకున్నారు. కానీ, మనోడి కాన్సెప్ట్ ప్రేమ అనే తెలుస్తోంది. ఎక్కడ అవకాశం దొరికినా లేడీ ఇంటి సభ్యులతో పులిహోర కలిపేస్తున్నాడు.

మొదటివారం ప్రశాంత్ కి ఎంత నెగిటివిటీ వచ్చిందో చూసి కూడా.. రైతుబిడ్డ తరహాలోనే పాట బిడ్డ కూడా అమ్మాయిల వెనుక ప్రదిక్షణాలు చేస్తున్నాడు. మొన్నొకరోజు అశ్వినీశ్రీతో పులిహోర కలుపుతూ కనిపించాడు. పొద్దున్నే పాల ప్యాకెట్ కూడా అవసరం లేదంట.. అశ్వినీ పాల బుగ్గలు చూస్తు బతికేయచ్చు అంట. ఆమె చిరునవ్వు చూస్తూ కూర్చుంటే ఆకలి కూడా తెలియదట. అబ్బో ఇలాంటి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత నయనీ పావనీకి బిస్కెట్లు వేస్తూ కనిపించాడు. నువ్వు నిన్నటి దాకా మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నావు. కానీ, ఇప్పుడు మాత్రం భలే చక్కగా ఉన్నావు. తెలుగుతనం ఉట్టిపడుతోంది అంటూ డైలాగులు ఏశాడు. మరోసారి అశ్వినీ శ్రీతో పులిహోర కలిపే ప్రయత్నం చేయగా.. ఆమె తిననిస్తారా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

39వ రోజు టాస్కుల సమయంలో భోలే ఏదో మాట్లాడుతూ ఉంటే పూజా కూడా చాలా చిరాకు పడింది. ఎందుకు మీరు ఏదొకటి మాట్లాడతారు అంటూ సీరియస్ అయింది. ఆ తర్వాత నేను చెప్పింది అది కాదు.. ఇది అంటూ వివరణ ఇచ్చాడు. అసలు ఊరికే మాట్లాడటం దేనికి? అలా వివరణ ఇచ్చుకోవడం దేనికి అంటూ ప్రేక్షకులు కూడా ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఆడేందుకు వస్తే ఆట ఆడాలని.. ఇలా పులిహోర కలపకూడదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. బోలే షావలి వచ్చిన విషయంపై ఫోకస్ పెట్టి ఆట ఆడతాడా? లేక అమ్మాయిలతో సరదాగా మాట్లాడేసుకుంటూ గడిపేస్తాడో చూడాలి. మరి.. భోలే షావలి ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş