iDreamPost
android-app
ios-app

నయనీ పావనీ ఎలిమినేషన్ ఎంత వరకు కరెక్ట్? అన్యాయం జరిగిందా?

  • Published Oct 16, 2023 | 12:48 PM Updated Updated Oct 16, 2023 | 12:53 PM
  • Published Oct 16, 2023 | 12:48 PMUpdated Oct 16, 2023 | 12:53 PM
నయనీ పావనీ ఎలిమినేషన్ ఎంత వరకు కరెక్ట్? అన్యాయం జరిగిందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 ఉల్టా పుల్టా అని చెబుతున్న మాట వాస్తవమే. కానీ, మరీ ఇంత ఉల్టా పుల్టా చేస్తారు అనుకోవట్లేదు. వీళ్లు ఇస్తున్న ట్విస్టులకు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరు హౌస్ లోకి వస్తున్నారో? ఎవరు హౌస్ నుంచి పోతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఆరోవారం హౌస్ నుంచి నయనీ పావనీ ఎలిమినేషన్ అనగానే.. పావనీ ముఖచిత్రం ఏమో గానీ, ప్రేక్షకుల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నయనీ పావనీ నువ్వు ఎలిమినేట్ అయ్యావ్ అంటూ నాగార్జున చెప్పగానే అంతా షాకయ్యారు. అది కూడా అశ్వినీ శ్రీ ఆఖరి వరకు రాగా.. నయనీ పావనీ ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ బిగ్ బాస్ సీజన్ పూర్తిగా ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తవాళ్లు హౌస్ లోకి వస్తున్నారు.. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్లు హౌస్ నుంచి బయటకు పోతున్నారు. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే ఉల్టా పుల్టా అని అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లంతా లేడీ కంటెస్టెంట్స్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గెస్ట్ గా వచ్చిన అనిల్ రావిపూడి కూడా ఈ వీక్ అన్నా.. అబ్బాయి ఎలిమినేట్ చేయండి సార్ అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ, బిగ్ బాస్ మాత్రం లేడీ హౌస్ మేట్ నే బయటకు పంపేశారు. హౌస్ లో కేవలం ఐదుగురు మాత్రమే లేడీస్ ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అశ్వినీ శ్రీ- నయనీ పావనీ డేంజర్ జోన్ కి వచ్చారు.

తర్వాత అశ్వినీ శ్రీ సేవ్ అయ్యి.. నయనీ పావనీ ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయిన విషయాన్ని నయనీ కూడా అంగీకరించలేకపోయింది. తాను కనీసం 10 వారాలు అయినా హౌస్ లో ఉంటాను అనుకుంది. కానీ, ఇలా వచ్చిన ఫస్ట్ వారంలోనే రిటర్న్ అవుతుందని ఊహించలేదు. స్టేజ్ మీద నుంచే ఏడుపు మొదలు పెట్టేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నయనీ పావనీ ఏడుస్తూనే ఉంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది. అసలు తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో తనకి అర్థం కావడం లేదని చెప్పింది. నయనీ ఎలిమినేట్ అయిన తర్వాత ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. నయనీ పావనీ ఎలిమినేషన్ తప్పు అంటూ పోస్టులు పెట్టారు. కొన్ని సోషల్ మీడియా పేజెస్ పెట్టి పోలింగ్ లో కూడా నయనీ పావనీ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ ఓటు వేస్తున్నారు.

ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. నయనీ హౌస్ లో చాలా బాగా ఆడింది. వచ్చిన రోజు నుంచి తన వాయిస్ ని బలంగా వినిపించింది. అబ్బాయిలకు పోటీగా ఫిజికల్ గేమ్స్ లో కూడా పాల్గొంది. అందం, డాన్స్, టాస్కులు, గొడవలు, ఫ్రెండ్ షిప్ ఇలా ఎందులోనైనా నయనీ టాప్ అనే చెప్పాలి. అందరితో కలిసిపోయి బాగా ఆడింది. కానీ, ఇలా ఒక వారానికే బయటకు వచ్చేసింది. ఆడుతున్న నయనీ పావనీ ఎలిమినేట్ కావడంతో అందరూ తట్టుకోలేక పోయారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రేక్షకులు వేసిన ఓట్ల ఆధారంగానే తాము ఎలిమినేట్ చేస్తామని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే నయనీని ఇప్పుడు ఎలిమినేట్ చేసినా కూడా.. మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మరి.. నయనీ పావనీ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio