iDreamPost
android-app
ios-app

ఈసారి ప్రూఫ్స్ చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చిన అమర్ దీప్ తల్లి!

  • Published Oct 25, 2023 | 5:41 PM Updated Updated Oct 25, 2023 | 5:41 PM

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఆట ఆడుతుంటే.. బయట మాత్రం వాళ్ల అభిమానుల పేరుతో రచ్చ చేస్తున్నారు. తమకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా ఒక మాట అంటే యుద్ధాలు చేస్తున్నారు. అమర్ దీప్ తల్లి, భార్య విషయంలో ఫ్యాన్స్ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమర్ తల్లి మరోసారి ట్రోలింగ్ పై స్పందించారు.

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ ఆట ఆడుతుంటే.. బయట మాత్రం వాళ్ల అభిమానుల పేరుతో రచ్చ చేస్తున్నారు. తమకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా ఒక మాట అంటే యుద్ధాలు చేస్తున్నారు. అమర్ దీప్ తల్లి, భార్య విషయంలో ఫ్యాన్స్ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమర్ తల్లి మరోసారి ట్రోలింగ్ పై స్పందించారు.

  • Published Oct 25, 2023 | 5:41 PMUpdated Oct 25, 2023 | 5:41 PM
ఈసారి ప్రూఫ్స్ చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చిన అమర్ దీప్ తల్లి!

బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని ఒకరు కామెంట్స్ చేసుకోవడం, ఆటలో గొడవలు పడటం సర్వ సాధారణం. అందరూ హౌస్ లో గేమ్ ఆడే క్రమంలో ఒక్కోసారి మాట జారడం, ఒకరిపై ఒకరు గెలిచేందుకు పోటీ పడటం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ పోటీ, ఆ గొడవ హౌస్ లో ఉంటేనే బాగుంటుంది. అది కాస్తా బయటకు వచ్చి.. ఫ్యాన్ వార్ లా మారితే చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరుతో అమర్ దీప్ తల్లిని దుర్భాషలాడిన విషయం తెలిసిందే. వాటికి అమర్ తల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అమర్ తల్లి మరోసారి ఆ వ్యాఖ్యలపై స్పదించారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేరుతో ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. సందర్భంతో సంబంధం లేకుండా.. నోటికొచ్చిన మాటలు కామెంట్స్ రూపంలో పెట్టేస్తున్నారు. అమర్ దీప్ కి పల్లవి ప్రశాంత్ కి గొడవ జరిగింది అని అమర్ తల్లిని, భార్యను నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశారు. ఆ సమయంలో అమర్ తల్లి ఒక వీడియో చేసి తప్పుడు మాటలు అన్న వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో చాలా మంది అమర్ తల్లికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఈసారి అమర్ తల్లి అన్ని ప్రశ్నలకు సమాధానాలతో మరో వీడియో చేశారు. చాలా మంది మిమ్మల్ని తిట్టినట్లు ప్రూఫ్ ఏంటి అని అడిగారు. హౌస్ లో అమర్ గేమ్ ఆడుతుంటే.. మీరు సిపంథీ కోసం ఇక్కడ ఇలాంటి వీడియోలు పెడుతున్నారా అంటు ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు అమర్ తల్లి తాజాగా సమాధానం చెప్పారు. అలాగే తప్పుడు కామెంట్స్ చేసే వారికి మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

అమర్ తల్లి మాట్లాడుతూ.. “లోపల గేమ్ ఆడుతోంది అమర్ అన్నారు. అమర్ అయితే వాళ్ల అమ్మను అనలేదు. మరి మీరెందుకు వాళ్ల అమ్మను అంటున్నారు. నేను అడిగేది అదే. మీరు బూతులు మాట్లాడకండి. అమ్మను అనకండి అనే చెప్తున్నాను. అదే మాట పదే పదే అంటున్నారు. ప్రూఫ్ చూపీమన్నారు కదా. ఇదీగో ప్రూఫ్ చూడండి. చాలా చాలా.. మళ్లీ అమర్ అన్న మాట మీకు తప్పు అనిపించినప్పుడు.. మీరు అనే మాటలు నాకు తప్పు అనిపించదా? మరి అప్పుడు నేను వచ్చి అడగాలి కదా? నేను వచ్చి అడిగినప్పుడు సింపథీ కోసం వచ్చాను అంటున్నారు. నేను ఈరోజు కూడా సింపథీ కోసం రాలేదు.

నా కొడుకుని ఎన్ని తిట్లు తిట్టినా నేను రాలేదు. నన్ను అంటున్నారనే నేను వస్తున్నాను. మీరు అమ్మను అనడం ధర్మం కాదు. ఒక అమ్మని అనడం ధర్మం కాదు. ఇంకేం చేయాలి నేను? చెప్పండి ఏం చేయమంటావ్? అమ్మను అనకూడదు అనకూడదు ఎన్నిసార్లు ఇదే చెప్తున్నాను. నేను సింపథీ కోసం రాలేదు.. రాలేదు.. ఇప్పటికైనా మీకు అర్థమైందా?” అమర్ దీప్ తల్లి వ్యాఖ్యానించారు. అసభ్య కామెంట్స్ చేసే వారికి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమర్ తల్లి విషయంలో ఫ్యాన్స్ పేరిట జరుగుతున్న ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom