iDreamPost
android-app
ios-app

సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శోభాశెట్టి.. ఇంత సింపుల్‌గానా!

  • Published Jan 21, 2024 | 6:56 PM Updated Updated Jan 21, 2024 | 6:56 PM

Shobha Shetty Engagement: కార్తీక దీపం సీరియల్‌, బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన శోభాశెట్టి.. సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

Shobha Shetty Engagement: కార్తీక దీపం సీరియల్‌, బిగ్‌బాస్‌ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన శోభాశెట్టి.. సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Jan 21, 2024 | 6:56 PMUpdated Jan 21, 2024 | 6:56 PM
సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శోభాశెట్టి.. ఇంత సింపుల్‌గానా!

కార్తీక దీపం సీరియల్‌ ద్వారా మోనితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శోభా శెట్టి.. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ద్వారా అందరికి మరింత చేరువ అయ్యింది. ఈ కన్నడ కస్తూరికి తెలుగులోకి బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక కార్తీక దీపం సీరియల్‌లో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న మోనిత పాత్రలో ఆమె నటించింది అనే కంటే జీవించింది అని చెప్పవచ్చు. ఆ పాత్రలో ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ శోభాశెట్టిని తిట్టుకున్నారు. అలా విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శోభాశెట్టి.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తన ఒరిజనల్‌ క్యారెక్టర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. హౌజ్‌లో చాలా సందర్భాల్లో ఆమె ప్రవర్తన చూసిన వారు ఈమె రీల్‌ మీదనే కాదు రియల్‌గా కూడా ఇలానే ఉంటుందా అని అనుకున్నారు.

బిగ్‌బాస్‌ హౌజ్‌లో శోభాశెట్టికి సంబంధించి మరో సీక్రెట్‌ వెల్లడయ్యింది. ఈ షో ద్వారా ఆమె తొలిసారిగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడిని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మోనిత లవర్‌ ఎవరో కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌ బాబు తమ్ముడిగా నటించిన వ్యక్తే. స్టేజ్‌ మీద అతడిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. అరే వీళ్లద్దరి మధ్య లవ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందబ్బ అనుకున్నారు అంతా. ఇక మోనిత ప్రేమించిన వ్యక్తి పేరు యశ్వంత్‌ రెడ్డి. కార్తీక దీపం సీరియల్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారింది అంట.

ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక.. శోభాశెట్టి, ఆమె లవర్‌ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వీడియోలు అప్లోడ్‌ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరికి షాక్‌ ఇచ్చింది శోభాశెట్టి. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. తన బర్త్‌డే నాడే ప్రియుడు యశ్వంత్‌ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది శోభాశెట్టి. ఎంతో సింపుల్‌గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శోభాశెట్టి తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిలో శోభాశట్టి, యశ్వంత్‌ రెడ్డి దండలు మార్చుకుంటున్న ఫొటోలు షేర్‌ చేసింది.

అయితే ముందుగా తనకు తన తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని.. ఎందుకంటే అప్పటికి తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పలేదన్నది. ఆ తర్వాత యశ్వంత్‌తో తన ప్రేమ గురించి చెప్పి.. తల్లిదండ్రలును ఒప్పించానని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ ఏడాది తన బర్త్‌డే నాడు నిశ్చితార్థం జరిగిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజనులు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio