బయట అన్నం పడేసి.. హౌస్ లో ఎంగిలి మెతుకులు తింటూ ఓవరాక్షన్!

బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల హడావుడి మొదలైపోయింది. ప్రతి ఒక్కరు టాస్కుల్లో గెలుపొందాలని కసిగా ఆడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు పెట్టాలి అనుకున్న విషయంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హౌస్ లో మొదటి వారంలోనే గ్రూపులు స్టార్ట్ అయి పోయాయి. ఇప్పుడు అందరూ కాస్త గ్రూపులుగానే ఆడుతున్నట్లు కనపిస్తోంది. ఇంక హౌస్ లో ఇప్పటి వరకు చూసిన ఆట ప్రకారం స్ట్రాంగ్ ప్లేయర్లు ఎవరైనా ఉన్నారు అంటే అది శివాజీ, షకీలా అనే చెప్పాలి. వీళ్లు ఎంతో మెచ్యూర్డ్ గా గేమ్ ఆడుతున్నారు. అలాగే హౌస్ లో ఉన్న సభ్యులను కూడా కాస్త పాజిటివ్ గేమ్ సైడ్ గైడ్ చేస్తున్నారు.

ఇంక హౌస్ లో మరో ఇద్దరి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్లు మరెవరో కాదు.. రతికా- పల్లవి ప్రశాంత్. హౌస్ లో వీళ్ల గేమ్ చూస్తుంటే ఒకరి వల్ల మరొకరు మిస్ గైడ్ అవుతున్నారేమో అనే భావన కలుగుతుంది. పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి హౌస్ లో ఉన్న సెలబ్రిటీల్లో సగం మందితో పోలిస్తే ప్రశాంత్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తనకి యూజ్ అవుతుందేమో అని రతికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పల్లవి ప్రశాంత్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటోదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె గేమ్ వల్ల పల్లవి ప్రశాంత్ కచ్చితంగా మిస్ గైడ్ అవుతున్నాడని చెప్పవచ్చు. తను ఏ విషయంలో కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు.

హౌస్ లో ఎవరన్నా రతిక గురించి మాట్లాడితే.. పల్లవి ప్రశాంత్ పక్కకు వెళ్లిపోతున్నాడు. పాజిటివ్ అయినా.. నెగెటివ్ అయినా అతను స్టాండ్ తీసుకోలేక పోతున్నాడు. అంటే అతను ఎంతో కొంత ఆమె వల్ల ఇన్ ఫ్లుఎన్స్ అవుతున్నాడనే చెప్పాలి. అలాగే పల్లవి ప్రశాంత్- రతిక డ్రెస్ గురించి కామెంట్ చేయడం కూడా కాస్త హాట్ టాపిక్ అయింది. హౌస్ లో అందరూ రతికా డ్రెస్ బాగుంది అని చెబుతుంటే… ప్రశాంత్ ఒక్కడే కాస్త చిన్నగా అయింది అని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రశాంత్ ఇలా అంటున్నాడు అంటూ రతికా హౌస్ మేట్స్ కి చెప్పింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అతని గేమ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రేక్షకులు అతని క్యారెక్టర్ జడ్జ్ చేసేలా మారతాయి. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాను అని చెబుతున్నాడు. కానీ, అతని గేమ్ చూస్తే రతికా చుట్టూ తిరగడమే సరిపోతోంది.

ప్రశాంత్ గేమ్ లో వీక్ అనుకోవడానికి లేదు.. తన స్ట్రాటజీలతో బిగ్ బాస్ కుస్తీ టాస్కులో సెకండ్ ప్లేస్ సాధించాడు. ఆడితే ఎంతో కసిగా ఆడుతున్నాడు. కానీ, రతిక విషయంలోనే తన గేమ్ ని పాడుచేసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఇంకొక విషయం ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి పల్లవి ప్రశాంత్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఎమోషనల్ వీడియోలు చేసి బిగ్ బాస్ అవకాశం కోసం ప్రాథేయపడ్డాడు. అదే విషయానికి సంబంధించి అతనిపై బయట ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే అవకాశం దక్కించుకుని హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు సింపథీ డ్రామా ఆడుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కెమెరాకి అన్నం పెట్టడం, నీళ్లు తాగమని ఇవ్వడం ప్రేక్షకులకు కాస్త ఓవర్ గా అనిపిస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఎవరో తిన్న మెతుకులు కింద పడితే వాటిని ప్రశాంత్ తినడం బాగా ట్రోల్ అవుతోంది.

బయటేమో అన్న పడేశావ్.. ఇంట్లో మాత్రం ఎంగిలి మెతుకులు తింటున్నావ్ ఏం యాక్టింగ్ అన్నా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ పని మాత్రం సిపంథీ గేమ్ లా కనిపిస్తోందని చెబుతున్నారు. అలాగే రతికాకి ధైర్యం చెబుతున్న ప్రశాంత్.. తాను మాత్రం ఎమోషనల్ అయిపోయి ఏడవడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే పల్లవి ప్రశాంత్ విషయంలో కంటెస్టెంట్స్ కూడా కాస్త భయంగా ఉన్నారు. ఎందుకంటే అందరూ బెడ్స్ మీద పడుకుంటే అతను ఒక్కడే కింద పడుకోవడం బయటకు నెగెటివ్ గా వెళ్తుందేమో అని అమర్ దీప్ – ఆట సందీప్ తో చెప్పడం చూశాం. నిజానికి అది అతని అలవాటు అయి ఉండచ్చు. రోజూ ఇంటి దగ్గర కింద పడుకునే వాళ్లు ఒక్కసారిగా మంచం మీద పడుకోమంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అమర్ దీప్ చెప్పినప్పుడు ఆట సందీప్ లైట్ తీసుకున్నాడు. కానీ, తర్వాత ఆలోచించి ఆ పాయింట్ కూడా కరెక్టే కదా అనే అభిప్రాయానికి వస్తాడు.

ఇవన్నీ చూస్తుంటే పల్లవి ప్రశాంత్ కాస్త ఎమోషనల్ గా, సింపథీ గేమ్ ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏదీ ఎక్కువ రోజులు దాచలేరు. ఎందుకంటే హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడటం అంత తేలిక కాదు. పైగా ఉల్టా పుల్టా సీజన్ కావడంతో మాస్క్ గేమ్ చాలా కష్టంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు రతికాతో క్లోజ్ కావడంపై కూడా పల్లవి ప్రశాంత్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తన గోల్ అంటూ చెప్పి ఇప్పుడు రతికా చుట్టూ తిరుగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి అనవసరంగా తన గేమ్ ని పాడు చేసుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఈ రెండు విషయాల్లో ప్రశాంత్ తన గేమ్ మార్చుకుంటే తప్పకుండా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. నిజంగానే పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ ఆడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments